- పరిపాలనాధికారుల పోస్టులు ఖాళీ
- ఇబ్బంది పడుతున్న రోగులు
ఎంజీఎంలో గాడి తప్పుతున్న పాలన
Published Fri, Sep 2 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
ఎంజీఎం : నాలుగు జిల్లాలకు ధర్మాస్పత్రిగా పే రుగాంచిన ఎంజీఎం ఆస్పత్రిలో పాలన గాడి తప్పుతోంది. పరిపాలనాధికారులు లేకపోవడం తో సరైన వైద్య సేవలందక ఆస్పత్రికి వచ్చే రో గులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వెయ్యి పడకల ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యల పరిష్కారంతోపాటు రోగుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ముగ్గురు రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్లను కేటాయించింది. అయితే రెండు నెలల క్రితం సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ–1 నాగేశ్వర్‌రావు ఉద్యోగ విరమణ పొందడంతోపాటు బుధవారం డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ–2 హేమంత్ కూడా ఉద్యోగ విరమణ చేశారు. విధుల్లో ఉండాల్సిన ఆర్‌ఎంఓ–3 శివకుమార్ సైతం ఎంజీఎం ఆస్పత్రి ఎన్‌బీహెచ్ సర్టిఫికేషన్ పొందడమే లక్ష్యంగా కలెక్టర్ ఆదేశాల మేరకు పుట్టపర్తి వెళ్లారు. దీంతో గురువారం ఆస్పత్రిలోని ఆర్‌ఎంఓ కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సూపరింటెండెంట్ కరుణాకర్‌రెడ్డికి సైతం అదనంగా హెల్త్ యూనివర్సిటీ వీసీ బాధ్యతలు అప్పగించడంతో ఆయన గురువారం పలు పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. పరిపాలన విభాగంలో అధికారులు ఎవరు లేకపోవడంతో పలు వార్డుల సామగ్రి సరఫరాకు సంబంధించిన సంతకాలను ఓ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్‌తో చేయించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఫోన్ ఎత్తని డ్యూటీ ఆర్‌ఎంఓలు..
ఎంజీఎం ఆస్పత్రిలో ముగ్గురు పీఆర్‌ఓలు ఉండేవారు. పీఆర్‌ఓ పోస్టులకు ప్రభుత్వం నుంచి ఎ లాంటి అనుమతి లేదని గతంలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పేర్కొనడంతో వారిని విధుల నుంచి తొలగించారు. అయితే ఆస్పత్రిలోని రోగుల వివరాలను తెలి యజేసేందుకు డ్యూటీ ఆర్‌ఎంఓలు స్పందిస్తార ని అభివృద్ధి కమిటీ సమావేశంలో అధికారులు సభ్యులకు హామీ ఇచ్చారు. 9490611938 నం బర్‌కు కాల్‌చేసే ్తడ్యూటీ ఆర్‌ఎంఓగా విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు ఫోన్ ఎత్తడం లేదని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఆస్పత్రి పరిపాలనాధికారులతోపాటు ఆయా విభాగాధిపతులు ఫోన్ చేస్తేనే స్పందించడం ఆనవాయితీగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎంజీఎం ఆస్ప త్రిలో పాలనను గాడిలో పెట్టాలని పలువురు కోరుతున్నారు.
Advertisement
Advertisement