ఎంజీఎంకు ఇద్దరు న్యూరోసర్జన్లు
Published Thu, Sep 8 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద ది క్కుగా పేరుగాంచిన ఎంజీఎం ఆస్పత్రి కి రోడ్డు ప్రమాదంలో తలకు దెబ్బలు తగిలిన బాధితులను తీసుకొస్తే న్యూ రోసర్జన్ వైద్యుల లేమీతో ఇప్పటివరకు హైదరాబాద్‌కు తరలించేవారు. ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. అయితే ఇప్పటి నుం చి ఆ బాధలు ఉండవు. ఈ మేరకు పా త విధానానికి స్వస్తి పలుకుతూ ఎం జీఎంకు ప్రభుత్వం ఇద్దరు న్యూరోసర్జ న్ వైద్యులను నియమించింది. ఈ సం దర్భంగా నూతనంగా నియామకమైన న్యూరోసర్జన్ డాక్టర్ రాజ్‌మోహన్, సీనియర్ రెసిండెంట్ మధు బుధవా రం ఎంజీఎం సూపరింటెండెంట్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
మెరుగుపడనున్న సేవలు..
ఎంజీఎం సూపర్‌స్పెషాలిటీలో కీలకమైన న్యూరోసర్జన్ వైద్యుల లేమీతో ఎంతో మంది రోగులు సరైన సమ యంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ఈ విభాగంలోని రోగులకు కొంత కాలంగా సీనియర్ డాక్టర్ బందెల మోహన్‌రావు వైద్యం అందించేవారు. ప్రాణపాయస్థితిలో ఉన్న రో గులను హైదరాబాద్‌కు తరలించడం తప్పేదీ కాదు. ఈ క్రమంలో వరంగల్ కు చెందిన డాక్టర్ రాజ్‌మోహన్ గతం లో ఎంజీఎం సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిం చారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రి లో న్యూరోసర్జన్ విభాగంలో పీజీ పూ ర్తి చేసి ఎంజీఎంలో సేవలందించేందుకు వచ్చారు. అలాగే సీని యర్ రెసిడెంట్‌గా డాక్టర్ మధు కూడా నియామకమయ్యారు.
Advertisement