Neuro surgeon
-
వెన్నుముక మార్పిడి... వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యయనం!..
Paralysed Man Walks Again: ఇంతవరకు పంది గుండె, కిడ్ని వంటివి మానవుడికి అమర్చడం వంటి సరికొత్త వైద్యా విధానాలను గురించి తెలుసుకున్నాం. పైగా అవయవాల కొరతను నివారించే ప్రక్రియలో భాగంగా జరిగిన సరికొత్త వైద్యా విధానాలుగా పేర్కొనవచ్చు. అయితే ఇంతవరకు మనం వెన్నముక ఇంప్లాంటేషన్(మార్పిడి) గురించి వినలేదు. వెన్నముకకి గాయాలై శరీరం చచ్చుబడి పోయి మంచానికి పరిమితమైన వారికి ఈ ఇంప్లాంటేషన్ వరం. అసలు విషయంలోకెళ్తే...వెన్నముకకు గాయాలవ్వడంతో మంచానికి పరిమితమైన వాళ్లు మళ్లీ తాము జీవితంలో లేచి నిలబడలేమని నిరాశ నిస్ప్రహలకి లోనవ్వాల్సిన అవసరంలేదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నముక సాయంతో రోగులు నిలబడటమే కాక వ్యాయమాలు కూడా చేయగలరని అంటున్నారు. వెన్నుమక గాయం కారణంగా కాళ్లు చేతులు పక్షవాతానికి గురైన వాళ్లు సైతం లేచి నిలబడగలరిని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. 2017లో మిచెల్ రోకాటి మోటర్‌బైక్ ప్రమాదంలో వెన్నముకకు అయిన గాయం కారణంగా దిగువ శరీర భాగం చచ్చుబడిపోయింది. అయితే రోకాటి ఎలక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నుముక ఇంప్లాంటేషన్‌తో అడుగులు వేయగలిగారని నేచర్ మెడిసిన్ జర్నల్ పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ముగ్గరు రోగులు ఈ ఎక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నముక ఇంప్లాంటేషన్ సాయంతో తమ శరీరాన్ని కదిలించగలిగారని తెలిపారు. ఆరు సెంటీమీటర్ల ఇంప్లాంట్‌ను చొప్పించి, పల్స్‌ను చక్కగా ట్యూన్ చేసిన కొద్దిసేపటికే ముగ్గురులో కదిలికలను గుర్తించాం అని అన్నారు. ఈ ఎలక్ట్రోడ్లు ఇంతకుముందు అమర్చిన వాటి కంటే పొడవుగా, పెద్దవిగా ఉంటాయని తెలిపారు. ఇవి కండరాలను యాక్సెస్ చేయగలవని జపాన్ లాసాన్ యూనివర్శిటీ హాస్పిటల్‌లోని న్యూరో సర్జన్ జోసెలిన్ బ్లాచ్ చెప్పారు. అంతేకాదు ప్రారంభ దశలో కదిలించటానికి తమ ముందు శరీర భాగాంలో కొంత బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోగి ప్రాక్టీస్ చేయడం ద్వారా నిలబడటం, నడవటం వంటివి చేయగలుగుతారన్నారు. అంతేకాదు దాదాపు కిలోమీటర్ దూరం వరకు నడవగలుగుతారని చెప్పారు. పక్షవాతాన్ని పరిష్కరించడానికి ఎలక్ట్రికల్ పల్స్‌లను ఉపయోగించాలనే ఆలోచన నొప్పిని నియంత్రించడానికి ఉపయోగించే సాంకేతికత నుండి ఉద్భవించిందని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ పల్స్ కంప్యూటర్ ద్వారా యాక్టివేట్ అవుతుంటాయి. వీటిని రోజు రోగి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొంతమంది ఈ ఎలక్ట్రిక్ పోల్స్‌ని యాక్టివేట్ చేయకుండా కూడా అవయవాలను కదిలించగలిగారని కానీ పూర్తిగా మాత్రం సాధ్యం కాదని న్యూరో సర్జన్లు చెబుతున్నారు. ఈ ఏడాది యునైటెడ్ స్టేట్స్ యూరప్‌లో సుమారు 50 నుంచి100 మంది రోగులపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
కొత్త అధ్యక్షుడు రాగానే.. పెద్ద డాక్టర్ మారిపోయాడు
ఏ పాలనా వ్యవస్థలోనైనా ప్రధానంగా ఇద్దరే ఉంటారు. ఆదేశాలు ఇచ్చేవారు. ఆదేశాలు పాటించేవారు. ఇండియా కానివ్వండి. అమెరికా అవనీయండి. రాజకీయ నాయకులు ఆదేశిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పాటిస్తారు. ఆదేశించేవారు ఇండియాలో అయితే ఐదేళ్లు, అమెరికాలో అయితే నాలుగేళ్లు ఉంటారు. ఆ తర్వాత మారిపోతారు. ప్రజాభిమానం ఉంటే మరో టెర్మ్ మారకుండా ఉండిపోతారు. రిటైర్ అయ్యేవరకు ఉండేది మాత్రం ఆదేశాలు పాటించేవారే. కాకపోతే.. ఆదేశించేవారు మారినప్పుడల్లా ఆదేశాలు పాటించేవారి స్థానం మాత్రం మారుతుంటుంది. భార్య, కుమార్తె తో జెరోమ్ ఆడమ్స్ జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే,‘సర్జన్ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్’ జెరోమ్ ఆడమ్స్ రాజీనామా చేశారు. చేయడం కాదు, బైడెన్ ఆయన్ని రాజీనామా చేయమని రిక్వెస్ట్ చేశారు! ట్రంప్ నియమించిన సర్జన్ జనరల్ ఆడమ్స్. ఆయన స్థానంలోకి డాక్టర్ వివేక్ మూర్తిని బైడెన్ నియమించుకున్నారు. పాలకుల నిర్ణయాలు ఎలా ఉన్నా, అధికారులు మాత్రం ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఆదేశాలను అమలు చేయవలసి ఉంటుంది. ఇంతకీ ఆడమ్స్, మూర్తి.. ఇద్దరిలో ఎవరు సమర్థులు? ఇద్దరూ. అయితే బైడన్ మూర్తికి ఒక మార్కు ఎక్కువ వేసుకున్నారు.. తన పాలనా సౌలభ్యం కోసం. జెరోమ్ ఆడమ్స్ సర్జన్ జనరల్ ఆఫీసు వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. ఆమెరికా ప్రజారోగ్య సేవల పాలనా వ్యవహారాలన్నీ అక్కడినుంచే అమలు అవుతాయి. నిన్నటి వరకు ఆ ఆఫీసు మెట్లెక్కి దిగిన జెరోమ్ ఆడమ్స్ తన కెరీర్లో ఎన్నో నిచ్చెనలు ఎక్కి జనరల్ స్థాయికి చేరుకున్నారు. 46 ఏళ్లు ఆడమ్స్కి. ఆరోగ్యంగా ఉంటారు. తన శాఖనూ ఆరోగ్యంగా ఉంచారు. ప్రాథమికంగా ఆయన అనెస్థీషియాలజిస్టు. నేవీలో చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన ఏడాది తర్వాత ఆయనకు సర్జన్ జనరల్ పదవి లభించింది. అంతకుముందు వరకు ఆడమ్స్ ఇండియానా స్టేట్ హెల్త్ కమిషనర్. కరోనా వచ్చి, గత ఏడాదిగా మనం తెల్లారి లేస్తే టీవీలలో, పేపర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధాన మ్ని, ఆ సంస్థ తరఫునే పని చేస్తున్న సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్‌ని, మన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ని చూస్తూ వస్తున్నాం. వీళ్లలాగే అమెరికాలో జెరోమ్ ఆడమ్స్. వీళ్లలాగే అంటే కరోనా గురించి అమెరికా ఏం చెప్పాలనుకున్నా ఈయన స్క్రీన్ మీదకు వచ్చేవారు. ట్రంప్‌తో ఆడమ్స్ భద్రంగా ఉండాలనీ, నిర్లక్ష్యం తగదని ఆడమ్స్ ఎప్పటికప్పుడు ప్రజల్ని హెచ్చరిస్తున్నప్పటికీ, కరోనాను ఏమాత్రం లెక్కచేయని ట్రంప్ ధీమా ముందు ఆ హెచ్చరికలన్నీ కొట్టుకుపోయాయి. రేపు ఒకవేళ ఏ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ప్రతినిధో.. ‘ఆడమ్స్‌ని రాజీనామా చేయమని ఎందుకు కోరవలసి వచ్చింది? అని బైడెన్‌ను అడిగినప్పుడు..‘కరోనాను కంట్రోల్ చేయలేకపోయారు’ అనేది ఆయన దగ్గర ఉండే తక్షణ సమాధానం కావచ్చు. అందువల్ల ఆడమ్స్కి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆయన ఏంటో, తన కెరీర్లో ఆయన ఎన్ని అవార్డులు సాధించారో ఆ రంగంలోని వారందరికీ తెలుసు. ఆయనకొచ్చిన ఫీల్డ్ మెడికల్ రెడీనెస్ బ్యాడ్జిలు అయితే.. చదివితే అర్థం అయ్యేవి కావు. వంశవృక్షంలా ఒక మ్యాప్ గీసుకోవాలి. ఆడమ్స్ భార్య లేసీ. ఇద్దరు తనయులు. ఒక కుమార్తె. లేసీ స్కిన్ క్యాన్సర్ నుంచి రెండుసార్లు బయటపడ్డారు. వివేక్ మూర్తి అమెరికా సర్జన్ జనరల్‌గా ఉన్న జరోమ్ ఆడమ్స్ స్థానంలోకి బైడెన్ తీసుకున్న భారత సంతతి వైద్యుడు వివేక్ మూర్తి ఆడమ్స్ కన్నా వయసులో మూడేళ్లు చిన్న. 43 ఏళ్లు. ఈయన కూడా ఆయనలానే అమెరికన్ నేవీలో వైస్ అడ్మిరల్‌గా చేశారు. ‘డాక్టర్స్ ఫర్ అమెరికా’ అని పన్నెండేళ్ల క్రితం సొంతంగా ఒక సేవాసంస్థను స్థాపించారు. అమెరికా సర్జన్ జనరల్ అయిన తొలి భారత సంతతి వైద్యుడు కూడా. పూర్వికులది కర్ణాటక. ఈయన యు.కె.లో పుట్టారు. తర్వాత యు.ఎస్. వచ్చేశారు. మూర్తి ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో డిగ్రీ చేశారు. 2011లో ఒబామా ఈయన్ని ‘హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్’ డిపార్ట్మెంట్లోకి తీసుకున్నారు. ప్రజారోగ్యం కోసం పదిహేను వేల మంది వైద్యులతో, మెడికల్ స్టూడెంట్స్‌తో ‘డాక్టర్స్ ఫర్ అమెరికా’ సంస్థ ద్వారా మూర్తి నడిపిన సైన్యాన్ని చూసి ఈ వైద్య సేనాపతిని తనకు సహాయంగా తీసుకున్నారు ఒబామా. ఆయన ప్రభుత్వంలో మూర్తి కూడా కొంతకాలం సర్జన్ జనరల్‌గా ఉన్నారు. బైడెన్‌తో మూర్తి అయితే అంత తేలిగ్గా ఏమీ సెనెట్ మూర్తి నియామకాన్ని ఆమోదించలేదు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ వ్యతిరేకించారు. ‘అమెరికాలో గన్ వయలెన్స్ ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించింది’ అని గతంలో మూర్తి చేసిన కామెంట్ వల్ల ఆయనకు కాంగ్రెస్ మద్దతు లభించలేదు. చివరికి యూఎస్‌లోని వందకు పైగా వైద్య, ప్రజారోగ్య సంస్థలు, మాజీ సర్జన్ జనరళ్లు ఇద్దరు ఆయన నియామకాన్ని సమర్థించడంతో సెనెట్‌లో ఆయనకు 51–43 ఓట్ల వ్యత్యాసంతో ఆమోదం లభించింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక మూర్తి స్థానంలోకి ఆడమ్స్‌ని తీసుకున్నారు. ఆడమ్స్కి ఉన్నన్ని అవార్డులు మూర్తికి లేకపోయినా అంతటి అనుభవమైతే ఉంది. మూర్తి భార్య కూడా డాక్టరే. అసిస్టెంట్ క్లినికల్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె పేరు అలైస చెన్. ఒక కొడుకు, ఒక కూతురు. -
ఎంజీఎంకు ఇద్దరు న్యూరోసర్జన్లు
ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద ది క్కుగా పేరుగాంచిన ఎంజీఎం ఆస్పత్రి కి రోడ్డు ప్రమాదంలో తలకు దెబ్బలు తగిలిన బాధితులను తీసుకొస్తే న్యూ రోసర్జన్ వైద్యుల లేమీతో ఇప్పటివరకు హైదరాబాద్‌కు తరలించేవారు. ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. అయితే ఇప్పటి నుం చి ఆ బాధలు ఉండవు. ఈ మేరకు పా త విధానానికి స్వస్తి పలుకుతూ ఎం జీఎంకు ప్రభుత్వం ఇద్దరు న్యూరోసర్జ న్ వైద్యులను నియమించింది. ఈ సం దర్భంగా నూతనంగా నియామకమైన న్యూరోసర్జన్ డాక్టర్ రాజ్‌మోహన్, సీనియర్ రెసిండెంట్ మధు బుధవా రం ఎంజీఎం సూపరింటెండెంట్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మెరుగుపడనున్న సేవలు.. ఎంజీఎం సూపర్‌స్పెషాలిటీలో కీలకమైన న్యూరోసర్జన్ వైద్యుల లేమీతో ఎంతో మంది రోగులు సరైన సమ యంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ఈ విభాగంలోని రోగులకు కొంత కాలంగా సీనియర్ డాక్టర్ బందెల మోహన్‌రావు వైద్యం అందించేవారు. ప్రాణపాయస్థితిలో ఉన్న రో గులను హైదరాబాద్‌కు తరలించడం తప్పేదీ కాదు. ఈ క్రమంలో వరంగల్ కు చెందిన డాక్టర్ రాజ్‌మోహన్ గతం లో ఎంజీఎం సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిం చారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రి లో న్యూరోసర్జన్ విభాగంలో పీజీ పూ ర్తి చేసి ఎంజీఎంలో సేవలందించేందుకు వచ్చారు. అలాగే సీని యర్ రెసిడెంట్‌గా డాక్టర్ మధు కూడా నియామకమయ్యారు. -
గుమాస్తా కుమార్తె టాపర్
ఎంసెట్ మెడికల్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన హేమలత విజయవాడ(గుణదల)/కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రతిభకు ఆర్థిక స్థితిగతులు అడ్డంకి కాదని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని రుజువు చేసింది. బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసే ఓ సాధారణ వ్యక్తి కుమార్తె ఎంసెట్-2016 మెడికల్ విభాగంలో తొలి ర్యాంకు సాధించి స్ఫూర్తిదాయకం గా నిలిచింది. శనివారం విడుదలైన ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో కర్నూలు జోహరాపురానికి చెందిన మాచాని హేమలత మొదటి ర్యాంకు సాధించింది. కర్నూలులోని శ్రీనివాస క్లాత్ స్టోర్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న మాచాని వీరన్న, చంద్రకళ దంపతుల రెండో కుమార్తె హేమలత. తన ముగ్గురు బిడ్డ లు చదువులో ఆణిముత్యాలని చెప్పారు. తన సంతానాన్ని ఉన్నత స్థానంలో నిలపడానికి నిరంతరం శ్రమిస్తున్నానని వీరన్న తెలిపారు. నాన్న కల నెరవేర్చిన హేమలత మాచాని వీరన్న, చంద్రకళ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె సౌజన్య ప్రస్తుతం మహానందిలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. రెండో కుమార్తె హేమలత ఎంసెట్ మెడిసిన్‌లో స్టేట్ ఫస్టు ర్యాంకు సాధించింది. వీరిద్దరూ కర్నూలులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఇక మూడో కుమార్తె విజయశ్రీ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. తన ముగ్గురు కుమార్తెల్లో ఒక్కరినైనా డాక్టర్‌గా చూడాలనుకున్నారు మాచాని వీరన్న. ఎన్నో వ్యయప్రయాలసకోర్చి పిల్లలను చదివించారు. రెండో తనయ మాచాని హేమలత ఎంసెట్‌లో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించి తండ్రి కలను సాకారం చేసింది. 2015లో 248వ ర్యాంకు 2015 ఎంసెట్ మెడికల్‌లో మాచాని హేమలత మొదటి ప్రయత్నంలోనే 248వ ర్యాంకు సాధించింది. అయితే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. నిర్దేశిత వయసుకు 28 రోజులు తక్కువగా ఉండడంతో ఆమె అప్పట్లో వైద్య విద్యలో ప్రవేశం పొందలేకపోయింది. న్యూరో సర్జన్ అవుతా ‘చాలా ఆనందంగా ఉంది. రోజుకు పన్నెండు గంటలు కష్టపడేదాన్ని. నిరంతరం పుస్తకాలతోనే దోస్తీ చేసేదాన్ని. తల్లిదండ్రుల కల నెరవేర్చడానికి నిరంతరం కష్టడుతూనే ఉంటా. న్యూరోసర్జన్ కావాలన్నది చిరకాల కోరిక. నా విజయం వెనుక మా తల్లిదండ్రులు, అధ్యాపకుల కృషి చాలా ఉంది. ఇంటర్మీడియెట్‌లో 985 మార్కులు వచ్చాయి’ అని హేమలత చెప్పింది. ర్యాంకర్ల మనోగతం న్యూరాలజిస్ట్‌నవుతా... మాది రంగారెడ్డి జిల్లా కొత్తగూడ, నాన్న నరేంద్రరెడ్డి న్యాయవాది. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి డాక్టర్‌ను కావాలనే ఆకాంక్షతో ఇంటర్లో బైపీసీలో చేరాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల శిక్షణతో రెండో ర్యాంకు సాధించాను. న్యూరాలజిస్ట్ కావాలనేది నా ఆశయం. - ఎర్ల సాత్విక్‌రెడ్డి, రెండో ర్యాంకర్ తల్లిదండ్రుల ప్రోత్సాహం... సైదాబాద్‌కు చెందిన మా నాన్న సత్యనారాయణరెడ్డి సివిల్ ఇంజనీర్. నా అభీష్టం మేరకు ఇంటర్ బైపీసీలో చేర్పించారు. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంతటి విజయం సాధించా. న్యూరాలజిస్ట్ లేదా కార్డియాలజిస్ట్‌గా ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష. - ఎ.యజ్ఞప్రియ, మూడో ర్యాంకర్ నగర కుర్రాడి సత్తా ఏపీ ఎంసెట్ మెడికల్‌లో నగరానికి చెందిన ఇక్రంఖాన్ సత్తా చాటాడు. 160 మార్కులు152 మార్కులు సాధించి ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. నారాయణగూడ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదివిన ఇక్రం ఎంపీసీలో 987 మార్కులు సాధించాడు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే తన లక్ష్యమని ఇక్రంఖాన్ తెలిపాడు. కార్డియాలజిస్ట్‌నవుతా బోయినపల్లికి చెందిన ఎస్.సాహితి సావిత్రి ఎస్ఆర్నగర్ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివింది. మెడిసిన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. 160కు 152 మార్కులు తెచ్చుకుంది. ఇంటర్లో 982 మార్కులు సాధించింది. ఆమె తండ్రి రమణ ఐఎస్బీ లో, తల్లి దీప్తి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కార్డియాలజిస్టునయ్యి సేవలందించాల న్నది తన ఆకాంక్షని సాహితి తెలిపింది.