సీసీకెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు | Kidnapped newborn recovered in mass police operation in NE China | Sakshi
Sakshi News home page

సీసీకెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు

Published Wed, May 18 2016 3:16 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

సీసీకెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు

సీసీకెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు

హువనాన్(చైనా): కిడ్నాప్కు గురైన రెండు రోజుల పసికందును సీసీకెమెరా వీడియో ఫుటేజీ సహాయంతో కేవలం ఏడుగంటల్లోనే చైనా పోలీసులు సురక్షితంగా తల్లి చెంతకు చేర్చగలిగారు. ఈ సంఘటన ఈశాన్య చైనాలోని హువనాన్ కౌంటీలోని హిలాంగ్జియాంగ్ ప్రావిన్స్లో చోటు చేసుకుంది. ఓ ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులోకి ప్రవేశించిన ఓ అనుమానిత మహిళ రెండు రోజుల వయసున్న బాలున్ని కిడ్నాప్ చేసింది. బాలున్ని తీసుకొని బయటకు వెళ్లి అక్కడే ఉన్న వాహనంలో గుట్టుచప్పుడుకాకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ హోటల్ గదికి వెళ్లింది. అక్కడి నుంచి మరో వాహనంలో మరో చోటుకి వెళ్లింది. ఈ తతంగం అంతా సీసీకెమెరాల్లో రికార్డయింది.  

సమాచాం అందుకున్న పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా అనుమానితురాలి కోసం హువనాన్ కౌంటీ మొత్తన్ని జల్లెడ పట్టారు. మొత్తం 300 మంది పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఏడు గంటల్లోనే బాలున్ని కనుగొన్న పోలీసులు కిడ్నాపర్ల చెరనుంచి సురక్షితంగా రక్షించగలిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement