పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన చైనా పర్యాటకుడు కిడ్నాప్కు గురయ్యాడు. ఇతడు లాహోర్ నుంచి బెలూచిస్థాన్కు వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు స్థానిక పత్రికలు తెలిపాయి.
పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన చైనా పర్యాటకుడు కిడ్నాప్కు గురయ్యాడు. ఇతడు లాహోర్ నుంచి బెలూచిస్థాన్కు వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు స్థానిక పత్రికలు తెలిపాయి.
హాంగ్ సు డాంగ్ అనే ఈ వ్యక్తిని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ వద్ద గల డర్బన్ ప్రాంతంలో అపహరించారు. కిడ్నాప్ అయిన ప్రాంతం నుంచి డాంగ్కు చెందిన కొన్ని వస్తువులను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. అక్కడినుంచి అతడిని ఎక్కడకు తీసుకెళ్లారో తెలుసుకోడానికి గాలింపు చర్యలు మొదలుపెట్టారు.