ఆ బాంబు టాయిలెట్లోనే తయారు చేశారు | The bomb Have been prepared in the Train toilet | Sakshi
Sakshi News home page

ఆ బాంబు టాయిలెట్లోనే తయారు చేశారు

Published Sun, May 4 2014 9:33 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

గౌహతి ఎక్స్ప్రెస్ రైలులో  బాంబు పేలిన దృశ్యాలు

గౌహతి ఎక్స్ప్రెస్ రైలులో బాంబు పేలిన దృశ్యాలు

బెంగళూరు : చైన్నై రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబును దుండగులు రైలు టాయిలెట్‌లోనే తయారు చేసినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి బాంబు తయారీకి ఉపయోగించే పదార్థాలను దుండగులు రైల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.  ఎస్-7 కోచ్‌లోని టాయిలెట్‌లో వాటిని క్రోడీకరించి బాంబును తయారు చేశారని క్లూస్ టీం నిర్ధారణకు వచ్చింది. బాంబును పూర్తిగా తయారు చేసి రైల్వేస్టేషన్‌లోకి తీసుకురావడం ప్రమాదమని భావించడం వల్లే దుండగులు ఇలా చేసి ఉంటారని ఆ టీం అభిప్రాయపడింది.

చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం త్రివేండ్రం నుంచి గౌహతి వెళుతున్న గౌహతి ఎక్స్ప్రెస్ రైలులో  బాంబు పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి మృతి చెందింది. మరో  15 మంది గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement