Baby delivered
-
విమానం గాల్లో ఉండగా పురిటి నొప్పులు.. చివరికి..
దుబాయ్: విమానంలో ఉన్నట్లుండి ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. అత్యవసర ల్యాండింగ్‌లు కావాల్సి ఉంటుంది. అది పురిటి నొప్పులకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా డెలివరీ దగ్గర పడుతున్న గర్భిణిల విమాన ప్రయాణాలకు అనుమతి ఉండదు. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే!. అలా ఎమిరేట్స్ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలికి హఠాత్తుగా పురిటి నొప్పులు రాగా.. గగనతంలో ఉండగానే విమానంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. టోక్యో నరిటా నుంచి దుబాయ్(యూఏఈ)కి వెళ్తున్న ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో జనవరి 19వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే 319 విమానంలో ప్రయాణికురాలికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో పైలట్ మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికీ షెడ్యూల్ ప్రకారమే ల్యాండ్ కావడం గమనార్హం. ప్రయాణికురాలు ప్రసవ వేదనకు గురవుతున్న క్రమంలో విమాన సిబ్బంది సమయస్ఫూర్తిగా, చాకచక్యంగా వ్యవహరించినట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. విమానశ్రయంలో దిగేసరికి వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని ఎమిరేట్స్ ప్రకటించుకుంది. సాధారణంగా డెలివరీకి దగ్గరపడే సమయంలో మహిళలను ప్రయాణానికి అనుమతించరు. అయితే.. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలకు అనుమతిస్తారు. ఎమిరేట్స్ రూల్స్ ప్రకారం.. ఏడో నెల వరకు గర్భిణిలకు మాత్రమే విమాన ప్రయాణాలకు అనుమతి ఉంది. ఒకవేళ ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలు చెబితే మాత్రం నెలలు నిండిన గర్భిణులకు ప్రయాణాలకు అనుమతిస్తారు. ఇదిలా ఉంటే.. విమాన ప్రయాణాల్లో ఇలా డెలివరీ జరిగిన ఘటనలు కొత్తేం కాదు. కిందటి ఏడాది మే నెలలో.. డెన్వర్ నుంచి కొలరాడోకు వెళ్తున్న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికురాలు బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ నెలలోనే ఘనా నుంచి అమెరికా(వాషింగ్టన్) వెళ్తున్న ఓ విమానంలో ఆరు గంటల పాటు ప్రసవవేదన అనుభవించిన ఓ ప్రయాణికురాలు.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద ఉండే క్యాబిన్ ఫ్లోర్‌పై విమాన బృందం సాయంతో బిడ్డకు జన్మనిచ్చింది. -
తల్లికి కరోనా పాజిటివ్.. బిడ్డకు నెగెటివ్
కోల్‌సిటీ (రామగుండం): కరోనా సోకిన ఓ నిండు గర్భిణికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గురువారం ఆపరేషన్ చేసి పండంటి ఆడ శిశువుకు పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్మ గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. గోదావరిఖనిలోనే ఉంటున్న ఆమె భర్త ప్రతినెలా ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండడడంతో బుధవారం ఆస్పత్రికి రాగా.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, దీనికి ముందుగా కరోనా టెస్ట్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. కరోనా టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెకు గురువారం కోవిడ్ నిబంధనల ప్రకారం గైనకాలజిస్ట్ డాక్టర్ కల్యాణి, అనస్థీషియా డాక్టర్ అగర్‌బాబా పీపీఈ కిట్ ధరించి ఆపరేషన్ చేశారు. పుట్టిన ఆడశిశువుకూ కరోనా టెస్ట్ చేయగా.. నెగెటివ్ వచ్చింది. బాలింతను కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు కళ్యాణి, అగర్‌బాబా, స్టాఫ్‌నర్సులు భవాని, లీలా, సిబ్బంది ఆశిష్, ఓదెలును ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎంఓ భీష్మ, కోవిడ్ ఐసోలేషన్ వార్డు ఇన్చార్జి రాజశేఖర్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్ రాజేంద్రప్రసాద్ తదితరులు అభినందించారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి.. తొమ్మిదో పెళ్లికి రెడీ చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
‘3 ఇడియట్స్’ లాగానే : రీల్ సీన్ రిపీట్
సాక్షి, మైసూరు : ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘3 ఇడియట్స్’ లోని డెలివరీ సీన్ గుర్తుందా... స్కైప్ ద్వారా డాక్టర్ సలహా తీసుకొని సుఖ ప్రసవం చేసిన రీల్ సీన్ లాంటి సీన్ రియల్‌గా రిపీట్ అయింది. ఫోన్ ద్వారా డాక్టర్ సలహాలను తీసుకొని మరీ ఒక మహిళకు డెలివరీ చేసిన ఉదంతం పలువురి అభిమానాన్ని దక్కించుకుంది. ఈ ఘటన మార్చి 9న కర్ణాటకలోని మినీ విధాన సౌధ ఎదురుగా ఉన్న ఒక పబ్లిక్ పార్కులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కొడగులోని గోనికోప్పల్ సమీపంలోని ఒక గిరిజన గ్రామానికి చెందిన మల్లిగే (35) తొమ్మిది నెలల గర్భవతి. తన పిల్లలు బాలుడు(8), బాలికి(6) పిల్లలతో నగరానికి వచ్చింది. ఇంతలో ఆమెకు పురిటినొప్పులు మొదలైనాయి. దీంతో సమీపంలోని పార్క్‌కు వెళ్లిన ఆమె నొప్పులు భరించలేక బిగ్గరగా ఏడుస్తూ.. సహాయం కోసం అరవడం మొదలు పెట్టింది. దీంతో బెంబేలెత్తిన పిల్లల కూడ ఏడుపందుకున్నారు. దీంతో చుట్టుపక్కల షాపుల వారంతా అక్కడిచేరుకుని విషయాన్ని గమనించారు. షాప్ కీపర్లు చాలా మంది మగవారు కావడంతో ఎవరైనా ఆడవాళ్లు సమీపంలోనై ఎవరైనా ఉన్నారని వెదికారు. కానీ ఫలితం లేదు. ఇంతలో ఒకరు 108కి సమాచారం అందించారు. ఈ క్రమంలో అదే రోడ్డులో వెళుతున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) శోభా ప్రకాష్ పార్క్ లోపల ఉన్న జనాన్ని చూసి బండి ఆపి విషయం ఆరా తీశారు. ఆమె కూడా ఖంగారుపడుతూ 108 కి ఫోన్ చేసింది. ఇక్కడే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనంలో ఉన్న ఒకాయన తన స్నేహితుడైన డాక్టర్‌కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన ఆ డాక్టర్ అక్కడ ఎవరైనా ఆడవాళ్లున్నారా అని వాకబు చేశారు. దీంతో ఆయన వెంటనే ఫోన్‌ను శోభాకు కిచ్చారు. తాను ఫోన్ ద్వారా కొన్ని సూచనలు ఇస్తాననీ, వాటిని జాగ్రత్తగా పాటిస్తే..తల్లీ బిడ్డ క్షేమంగా బైటపడతారని చెప్పారు. దీనికి శోభ అనుమాన పడుతూనే ఒప్పుకున్నారు. అలా డాక్టర్ సలహా మేరకు శోభా మల్లిగేకు సహాయం చేయడంతో నిమిషాల్లో, మల్లిగే ఆడ బిడ్డను ప్రసవించింది. శిశువు ప్రసవించిన తర్వాత, బొడ్డు తాడు ఎలా కట్ చేయాలో బోధపడలేదు శోభకు. అలా అనుమానిస్తుండగానే ఒక వ్యక్తి కొత్త బ్లేడును తీసుకొచ్చాడు. ఏం పరవాలేదు కట్ చేయమని డాక్టర్ ధైర్యం చెప్పారు. కానీ అప్పటికే అంబులెన్స్ అక్కడికి చేరుకోవడం, సర్జికల్ బ్లేడుతో బొడ్డుతాడు కోయడం, తల్లీ బిడ్డల్ని ఆసుపత్రికి తరలించడంతో కథ సుఖాంతమైంది. మల్లిగే వద్ద ఉన్న ‘థాయ్’ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా ఆమె కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తనకు ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి అని శోభ వ్యాఖ్యానించారు. కానీ రెండు ప్రాణాలను కాపాడినందుకు చాలా సంతోషంగానూ, ఆశ్చర్యంగానూ ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ సందర్భంగా చొరవ తీసుకున్న డాక్టర్‌కి కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
రైలు పట్టాలపై పసిబిడ్డ
జైపూర్: అమ్మ కడుపులోంచి రైలు పట్టాలపై పడ్డాడో పసిపిల్లాడు. బయట ప్రపంచంలోకి రావడంతోనే ప్రమాదానికి గురైనా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సోమవారం రాజస్థాన్ లో చోటు చేసుకుంది. '22 ఏళ్ల మన్ను తన భర్త, తల్లితో కలిసి రైలులో సూరత్‌ఘర్ నుంచి హనుమాన్‌ఘర్ బయలుదేరింది. ప్రయాణిస్తున్న సమయంలోనే పురిటి నొప్పులు రావడంతో బాత్ రూంలోకి వెళ్లి మగ శిశువుకి జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బాబు అనుకోకుండా మరుగుదొడ్డి పైపు లోంచి కింద పడ్డాడు' అని జీఆర్పీ అధికారి ఒకరు తెలిపారు. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కోమాలోకి వెళ్లిన తల్లిని ఆసుపత్రిలో చేర్పించారని అధికారి చెప్పారు. పట్టాలపై ఏడుస్తున్న శిశువును గమనించిన ఎఫ్‌సీఐ గార్డు రైల్వే అధికారులకు సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం ఆ బిడ్డని హనుమాన్‌ఘర్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్దకు చేర్చారు.