![ఘోర రోడ్డు ప్రమాదం; 15 మందికి పైగా మృతి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/71488529321_625x300.jpg.webp?itok=dQQPiWwu)
ఘోర రోడ్డు ప్రమాదం; 15 మందికి పైగా మృతి
జైపూర్: రాజస్థాన్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్‌గఢ్ సమీపంలో ఎదురుగా వస్తున్న జీపు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికిపైగా మరణించారు. జీపులో ఉన్నవారు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద స్థలిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
ఢీకొన్ని తర్వాత ట్రక్కు బోల్తాపడగా, జీపు నుజ్జునుజ్జయ్యింది. జీపు టైర్లు, ఇతర భాగాలు విడిపోయి కుప్పలా పడ్డాయి. స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.