MiG 21 fighter jet
-
రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. హనుమాన్‌గఢ్ జిల్లా బహ్లోల్‌నగర్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ యుద్ధవిమానం సూరత్‌గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే మిగ్-21 కూలిపోవడానికి ముందే పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ విమాన శకలాలు తగిలి ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. వీరి ఇంటిపైనే విమానం కూలినట్లు తెలుస్తోంది. సాధారణ శిక్షణలో భాగంగానే బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైనట్లు భారత వైమానిక దళం తెలిపింది. పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. #WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. Two civilian women died and a man was injured in the incident, the pilot sustained minor injuries. pic.twitter.com/z4BZBsECVV — ANI (@ANI) May 8, 2023 చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
కుప్పకూలిన యుద్ధ విమానం, పైలట్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం ప్రమాదం విషాదాన్ని నింపింది. బుధవారం శిక్షణలో భాగంగా ఈ యుద్ధ విమానం కుప్పకూలిన ఘోర ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన గ్రూపు కెప్టెన్ ఏ గుప్త మృతి చెందినట్లు ఐఎఎఫ్ తెలిపింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు వెల్లడించింది. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. సెంట్రల్ ఇండియాలోని వైమానిక స్థావరంనుంచి రోజువారీ శిక్షణలో భాగంగా బయల్దేరిన విమానం కొద్దిసేపటికే ప్రమాదంలో చిక్కుకుని కుప్ప కూలింది. గుప్త మృతిపై ఐఏఎఫ్ ట్విటర్ ద్వారా తీవ్ర విచారాన్ని ప్రకటించింది. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్ చేసింది. The IAF lost Group Captain A Gupta in the tragic accident. IAF expresses deep condolences and stands firmly with the family members. A Court of Inquiry has been ordered to determine the cause of the accident. — Indian Air Force (@IAF_MCC) March 17, 202 -
కుప్పకూలిన మిగ్ 21 విమానం
భోపాల్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన మిగ్21 శిక్షణ విమానం కుప్పకూలింది. శిక్షణ నిమిత్తం ఇద్దరు పైలెట్లతో వెళ్తున్న మిగ్ విమానం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బుధవారం కూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఎయిర్ ఫోర్స్ అధికారులు స్థానికులు సహాయంతో సహాయ చర్యలను చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
అభినందన్ ఆకాశయానం..!
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ విమానాలను నడపడం ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాకిస్తాన్ యుద్ధ విమానాలతో జరిగిన పోరులో వర్ధమాన్ నడుపుతున్న మిగ్–21 విమానం కూలిపోయి ఆయన గాయాలపాలై పాకిస్తాన్లో పడిపోవడం తెలిసిందే. తన విమానం కూలిపోవడానికి ముందే వర్ధమాన్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్లో పడిపోయినా ఎంతో ధైర్యం ప్రదర్శించి అందరి మన్ననలూ అందుకున్నారు. ఇటీవలే కేంద్రం ఆయనకు వీరచక్ర అవార్డును కూడా ప్రకటించింది. మార్చి 1న రాత్రి వర్ధమాన్‌ను పాక్ భారత్‌కు అప్పగించాక, దాదాపు రెండు వారాలపాటు వర్ధమాన్ చికిత్స అందుకుంటూ భద్రతా సంస్థల పర్యవేక్షణలో ఉన్నారు. వారి విచారణను ఎదుర్కొన్నారు. వీలైనంత త్వరగా మళ్లీ యుద్ధ విమానాన్ని నడపాలని తాను కోరుకుంటున్నట్లు అప్పట్లో వర్ధమాన్ చెప్పారు. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ వర్ధమాన్‌కు వైద్య పరీక్షలన్నీ చేసి, ఆయన మళ్లీ విమానం నడిపేందుకు అన్ని రకాలుగా సిద్ధమేనని మూడు వారాల క్రితం వెల్లడించింది. దీంతో వర్ధమాన్ మళ్లీ యుద్ధ విమానాలు నడుపుతున్నారు. ప్రస్తుతం రాజస్తాన్‌లోని వైమానిక స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్నారు. -
44 ఏళ్ల నాటి విమానం నడపాలా?
న్యూఢిల్లీ: నాలుగు దశాబ్దాల క్రితం నాటి కార్లను ఇప్పుడూ ఎవరూ రోడ్లపై నడపడం లేదనీ, అలాంటప్పుడు 44 ఏళ్ల నాటి యుద్ధ విమానాలను ఎందుకు ఉపయోగించాలని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మంగళవారం ప్రశ్నించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ధనోవా ఇలా మాట్లాడారు. మిగ్–21 యుద్ధ విమానం గురించి ఆయన ప్రస్తావిస్తూ, ‘ఈ విమానాన్ని 1973–74లో వాయుసేనలో చేర్చారు. ప్రస్తుతం వీటిలో ఐదో తరం యుద్ధ విమానాలు వచ్చేశాయి. ఆ తర్వాతి తరం విమానాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఇలాంటి పాత విమానాలతో మనం విజయం సాధించలేకపోతే దానిని భరించగలమా? యుద్ధం లేనంత మాత్రాన మొత్తం ఆధునిక సాంకేతికత స్వదేశంలో తయారయ్యేంత వరకు మనం వేచి ఉండలేం. అయితే రక్షణ వస్తువులను అన్నింటికీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కూడా తెలివైన పని కాదు. దాదాపు 44 ఏళ్ల క్రితం నాటి మిగ్–21 ఎంఎఫ్ విమానాన్ని నేను ఇంకా నడపగలుగుతున్నాను. కానీ అంత పాత కారును మీరెవ్వరూ ఇప్పుడు నడపడం లేదని నేను కచ్చితంగా చెప్పగలను’ అని ధనోవా అన్నారు. భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమనాన్ని కూలి్చనప్పుడు ఉపయోగించింది కూడా ఈ మిగ్–21 విమానాన్నే. -
తొలి మహిళా యుద్ధ పైలట్‌గా భావన
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో విమానం ద్వారా యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన తొలి మహిళగా భావనా కంఠ్ బుధవారం చరిత్ర సృష్టించారు. మిగ్–21 బైసన్ విమానంపై పగటిపూట యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన సిలబస్‌ను భావన పూర్తి చేశారని వాయుసేన అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం రాజస్తాన్‌లోని బికనీర్‌లోని వైమానిక స్థావరంలో భావన విధులు నిర్వర్తిస్తున్నారు. 2017 నవంబర్‌లో ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరిన భావన, గతేడాది మార్చిలో తొలిసారిగా సొంతంగా మిగ్–21 బైసన్ యుద్ధ విమానాన్ని నడిపారు. యుద్ధ విమానాలను నడిపేందుకు మహిళలకూ అవకాశమివ్వాలని మోదీ ప్రభుత్వం తొలి నాళ్లలో నిర్ణయం తీసుకుంది. -
రాజస్తాన్‌లో కుప్పకూలిన మిగ్-21 విమానం
-
కుప్పకూలిన మిగ్-21 విమానం
జైపూర్ : రాజస్తాన్‌లో భారత యుద్ధ విమానం మిగ్-21 కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో పైలట్ విమానం నుంచి ఎజెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పైలట్ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. బికనీర్‌కు సమీపంలో ఉన్న శోభా సర్కీ ధానీ ఏరియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బికనీర్ ఎస్పీ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి, మెరుపు దాడుల నేపథ్యంలో భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో యుద్ధ విమానం కూలిపోవడంతో అలజడి రేగింది. అయితే రాజస్తాన్‌లోని నాల్ ఎయిర్‌బేస్‌కు మిగ్-21ను ఐఏఎఫ్ తరలిస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌ను ఐఏఎఫ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకు ప్రతిగా పాక్ వైమానిక దళం తిరిగి దాడికి ప్రయత్నించగా వారిని ఎదిరించే క్రమంలో భారత పైలట్ అభినందన్ ఆ దేశ ఆర్మీకి చిక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. -
అరుదైన ఘనత సాధించిన అభినందన్
న్యూఢిల్లీ : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం నేషనల్ హీరోగా నీరాజనాలందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సంతోష సమయంలో అభినందన్ పేరిట మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని నేల కూల్చిన తొలి ఐఏఎఫ్ కంబాట్ పైలట్‌గా అభినందన్ అరుదైన ఘనత సాధించారు. ఈ విషయాన్ని స్వయంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్ కృష్ణస్వామి అయ్యర్ తెలిపారు. ఎఫ్-16 విమానాన్ని కూల్చడం సాహసోపేతమైన చర్య అని ఆయన కితాబునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మిగ్-21 బైసన్ అత్యాధునిక ఫైటర్ జెట్టే అయినా.. ఎఫ్-16కు ఇది సాటిరాదు. ఎఫ్-16కు ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్‌గా పేరుంది. అయితే మిగ్-21 బైసన్ నడిపే పైలట్లు తమ నైపుణ్యం పెంచుకునేందుకు అప్పుడప్పుడూ మిరాజ్ - 2000, మిత్ర దేశాల ఎఫ్-16 విమానాలతో శిక్షణ పొందుతుంటారు. అలా అభినందన్ పొందిన శిక్షణ ఎఫ్-16ను కూల్చేందుకు పనికొచ్చింది. క్షణాల్లో జరిగిపోయే గగనతల యుద్ధ సమయంలో ప్రత్యర్థి కంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో మన పైలట్లు ఎల్వోసీ దాటి వెళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభినందన్.. ఎఫ్-16 జెట్‌ను కూల్చడం సాధారణ విషయమేం’ కాదని ఆయన ప్రశంసించారు. అంతేకాక ‘పాకిస్థాన్ ఎఫ్-16 విమానాల్ని పెద్ద సంఖ్యలో అమెరికా నుంచి కొన్నది. ఐఏఎఫ్ కూడా ఎప్పట్నుంచో 100 అత్యాధునిక యుద్ధ విమానాలు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. కానీ, ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. ప్రభుత్వాల అలసత్వంతో రక్షణ శాఖ సామాగ్రి కొనుగోలుకు చాలా ఆలస్యం అవుతోంది. అంతేకాక ఐఏఎఫ్ రెండు దశాబ్దాలుగా ఎస్‌యూ - 30 ఎమ్కేఐలను వినియోగిస్తుంది. వీటిని కూడా ఆధునికీకరించడం అవసరం. కానీ ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, అమల్లోకి రావడానికి పుష్కర కాలం పడుతుంది. అంతేకాక బడ్జెట్లో కూడా రక్షణ రంగానికి చాలా నామమాత్రంగానే కేటాయిస్తారు. ఈ అరకొర నిధులతో కొత్తవి కొనలేం. పాతవాటిని కూడా పూర్తిగా అప్‌గ్రేడ్ చేయలేం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఒకరిపై మరొకరు నిందలు వేసుకునే సమయం కాదని తెలిపారు. రక్షణ వ్యవస్థల్ని ఆధునికీకరించాలని కోరారు. పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..! సరిహద్దుకు అటూ.. ఇటూ.. -
పాక్ విమానాన్ని అభినందన్ నేలకూల్చాడిలా..!
సాక్షి, న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ భారత్‌పై వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాలు గత బుధవారం నియంత్రణ రేఖ (ఎల్వోసీ) దాటి భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ప్రత్యర్థి దాడులను ఐఏఎఫ్ దీటుగా తిప్పి కొట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 విమానాన్ని మనోళ్లు కూల్చేశారు. పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ను కూల్చడానికి అభినందన్ వర్ధమాన్ ఆర్-73 అనే మిస్సైల్ ప్రయోగించాడు. అదే సమయంలో అభినందన్ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగాల్సి వచ్చింది. యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ అభినందన్‌ను జెనీవా ఒప్పందంలో భాగంగా శుక్రవారం రాత్రి పాకిస్తాన్ భారత్‌కు అప్పగించింది. (అభినందన్ ఆగయా..) ఆర్-73 మిస్సైల్.. లక్ష్యం గురి తప్పదు.. ఆర్-73 మిస్సైల్.. ఏ సమయంలోనైనా ప్రత్యర్థి విమానాలపై దాడి చేయగలదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. దశ దిశా మార్చుకుని కావాల్సిన లక్ష్యాన్ని ఛేదించగలదు. ఏరో డైనమిక్ సిస్టమ్ ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు. దాంతో ఇది సమర్థవంతంగా పనిచేసి ప్రత్యర్థి యుద్ధ విమానలను నేల కూల్చగలదు. గంటకు 2500 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న విమాలను.. 30 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ వేటాడగలదు. (ట్రెండింగ్‌లో అభినందన్ ‘గన్స్లింగర్’..!) 58 ఏళ్ల వయసు..అయినా భారత వైమానిక దళంలో సేవలందిస్తున్న మిగ్-21యుద్ధ విమానం వయస్సు సుమారు 58 సంవత్సరాలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రతిష్టాత్మక హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దీన్ని రూపొందించింది. 1961లో తొలిసారిగా భారత వైమానిక దళంలో చేరింది. మారుతున్న కాలానికి అనుగుణంగా రూపురేఖలు మార్చుకుంది. ఐఏఎఫ్ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా అందుబాటులో ఉంది. మిగ్- 21 దెబ్బకు పేలిపోయిన ఎఫ్-16తో పోల్చుకుంటే.. దాని సత్తా తక్కువే. మిగ్ పూర్తి పేరు.. మికోయన్-గురేవిచ్. మొదట్లో రష్యా సంయుక్త రాష్ట్రాలు దీన్ని డిజైన్ చేశాయి. రష్యా నుంచి అనుమతి పొందిన హెచ్ఏఎల్ మిగ్-21 ఎఫ్ ఎల్, మిగ్-21ఎం, మిగ్-21 బైసన్ రకాలను రూపొందించింది. ఇక పాక్ వైమానిక దళంలో ఉన్న ఎఫ్-16 విమానలకు వైపర్ యుద్ధ విమానాలు అని కూడా అంటారు. 1980 ప్రాంతంలో వీటిని పాక్ దిగుమతి చేసుకుంది. -
ల్యాండవుతూ.. అదుపుతప్పడంతో!
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 ఫైటర్ జెట్ విమానం మరోసారి ప్రమాదానికి గురయింది. మంగళవారం శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో మిగ్-21 అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి.. 200 మీటర్ల ఎత్తునుంచి పడిపోయింది. అయినా అదృష్టవశాత్తు ఎవరికీ ఏ గాయాలు కాలేదు. జెట్ ఫైలట్ సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే, మిగ్-21 ఎత్తులోనుంచి పడటం వల్ల రన్‌వే ధ్వంసమైంది. దీంతో శ్రీనగర్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే విమానాలను వెంటనే నిలిపివేశారు. ’ఫైటర్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలట్ గుర్తించడంతో శ్రీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా దీనిని ల్యాండ్ చేశారు. దీనివల్ల జెట్ విమానం టైర్లు కాలి బూడిదైపోయాయి. అయితే సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల విమానానికి ఏమీ కాలేదు.’ అని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి తగలబడుతున్న టైర్లను ఆర్పివేయడంతో విమానానికి మంటలు అంటుకోలేదు.