కుప్పకూలిన మిగ్‌ 21 విమానం | Mig 21 Trainer Aircraft Crashes Madhya Pradesh | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన మిగ్‌ 21 విమానం

Published Wed, Sep 25 2019 1:10 PM | Last Updated on Wed, Sep 25 2019 1:31 PM

Mig 21 Trainer Aircraft Crashes Madhya Pradesh - Sakshi

భోపాల్‌: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన మిగ్‌21 శిక్షణ విమానం కుప్పకూలింది. శిక్షణ నిమిత్తం ఇద్దరు పైలెట్లతో వెళ్తున్న మిగ్‌ విమానం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బుధవారం కూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు స్థానికులు సహాయంతో సహాయ చర్యలను చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement