భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ట్రైనీ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. రెండు సీట్లున్న సెస్నా 152 విమానం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కూలిపోయింది. సుమారు 40 నిమిషాల పాటు గాలిలో ఉన్న విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా కూలిపోయినట్లు గుణ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దిలీప్ రాజోరియా వెల్లడించారు.
విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి. గాయపడిన పైలట్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే టెస్టింగ్, నిర్వహణ కోసం కొన్ని రోజుల క్రితం పలు విమానాలు ఇక్కడికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. విమానం కూలిపోవటంపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
#MadhyaPradesh Two pilots injured as trainer aircraft crashes in MP's Guna: Two pilots on board suffered injuries; the plane arrived a few days back for testing and maintenance https://t.co/7StFTBL0bV pic.twitter.com/4rM6CiFFq3
— Global Voters (@global_voters) August 11, 2024
Comments
Please login to add a commentAdd a comment