wreckage
-
Russia Ukraine war: కీవ్‌లో క్షిపణుల మోత
కీవ్: ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తుండడం పట్ల రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకార చర్యలు ప్రారంభించింది. పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేయడమే లక్ష్యంగా రష్యా సైన్యం ఆదివారం తెల్లవారుజామునే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. గత ఐదు వారాలుగా ప్రశాంతంగా ఉన్న కీవ్ మిస్సైళ్ల మోతతో దద్దరిల్లిపోయింది. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు అందజేసిన యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. తమ సైన్యం అత్యంత కచ్చితత్వం కలిగిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. యూరప్ దేశాలు ఇచ్చిన టీ–72 యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఖండించింది. కీవ్‌లో రైల్వే స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలపైనా రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. రష్యా క్షిపణులు కీవ్ సమీపంలోని డార్నిట్స్కీ, డినిప్రోవ్స్కీ జిల్లాలను వణికించాయి. కీవ్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని అణు విద్యుత్ కేంద్రంపై క్రూయిజ్ మిస్సైల్‌ను ప్రయోగించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్లో పలు నగరాలు, గ్రామాలపై రష్యా సైన్యం మిస్సైళ్లు ప్రయోగించింది. గిర్స్కీలో 13, లీసిచాన్‌స్క్‌లో 5 ఇళ్లు దెబ్బతిన్నాయి. క్రామటోర్‌స్క్‌లోనూ వైమానిక దాడులు కొనసాగాయి. ఖర్కీవ్‌లోని చెర్కాస్కీ తీస్కీ గ్రామంలో రష్యా దళాలు ఫాస్ఫరస్ ఆయుధాలు ప్రయోగించాయని ఉక్రెయిన్ ఆరోపించింది. డోన్బాస్లో కీలకమైన సీవిరోడోంటెస్క్ సిటీలో 80శాతం మేర రష్యా సేనలు ఆక్రమించుకున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మృతిచెందిన ఇరు పక్షాల సైనికుల మృతదేహాలను పరస్పరం మార్చుకొనే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యింది. దక్షిణ జపొరిఝాజియాలో 160 మృతదేహాలను మార్చుకున్నట్లు ఉక్రెయిన్ యంత్రాంగం ప్రకటించింది. దయచేసి యుద్ధం ఆపండి: పోప్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఇకనైనా ఆపాలని పోప్ ఫ్రాన్సిస్ రష్యాకు మళ్లీ విజ్ఞప్తి చేశారు. ‘దయచేసి ప్రపంచాన్ని నాశనం చేయకండి’ అని ఆదివారం ఆయన విన్నవించారు. యుద్ధం కారణంగా బాధితులుగా మారుతున్న ప్రజల రోదనలు వినాలని ఉక్రెయిన్, రష్యా అధినేతలను పోప్ కోరారు. -
జనంలేక పాడుబడ్డ ఊరు: రోజూ వచ్చి వెళ్తున్న వృద్ధుడు
చిత్తూరు: పాపాఘ్ని నది సమీపంలో ఉండే ఊరు ఒకప్పుడు జనాలతో, పంటలతో కళకళలాడేది. ఆ ఊరి పేరు పుట్టాపర్తి. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో ఉంది. కొన్నేళ్ల నుంచి నదిలో నీరులేక, బోరు బావుల్లో నీరు రాక.. పంటలు పండక ఊరు ఖాళీ అయిపోయింది. ఇక్కడ జీవించిన వారు సమీప గ్రామాలకు, బెంగళూరుకు పనుల కోసం వలస వెళ్లిపోయారు. దీంతో ఇళ్లన్నీ శిథిలమైపోయాయి. జనం లేకపోయినా ఊరి పేరు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో మిగిలిపోయింది. అయితే బక్కోళ్ల కిట్టన్న అనే 70 ఏళ్ల వృద్ధుడు మాత్రం ప్రతిరోజు ఊరికి వచ్చి వెళుతూ ఉంటాడు. పగలంతా తన వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్డులో కాలక్షేపం చేసి సాయంత్రం తాను నివసిస్తున్న టి.సదుం గ్రామానికి చేరుకుంటున్నాడు. ఎందుకు వెళ్తావు ఆ ఊరికి అని అడిగితే.. చిన్న నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి అని కిట్టన్న బదులిస్తాడు. ఊరి పేరు ఎలా వచ్చిందంటే.. టి.సదుంలో ఒకప్పుడు కలరా వ్యాధి ప్రబలడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి కొంతమంది పాపాఘ్ని నది ఒడ్డున ఉన్న ప్రాంతంలో నివసించడానికి వెళ్లారు. ఆ ఖాళీ స్థలంలో గుడిసెలు, రాతి సుద్ద మిద్దెలు కట్టుకోవడంతో అదో ఊరిగా మారింది. అక్కడ నాగుల పుట్టలు, చెదలు పుట్టలు అధికంగా ఉండటంతో ఆ ఊరికి పుట్టాపర్తిగా నామకరణం చేశారు. శివరాత్రి ఉత్సవాలు ప్రత్యేకత.. పాపాఘ్ని నది ఒడ్డున శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి ఉత్సవ ప్రతిమలను పుట్టాపర్తికి తీసుకెళ్లడం.. అనంతరం టి.సదుం గ్రామానికి తీసుకెళ్లడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు పుట్టాపర్తిలో ఎవరూ లేకపోవడంతో ఉత్సవ ప్రతిమలను నేరుగా టి.సదుంకు తీసుకెళ్లిపోతున్నారు. పాపాఘ్ని నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నపుడు కపిల్ (ఎద్దులతో తిప్పే యంత్రం) ద్వారా నీళ్లు తోడి పంటలు సాగు చేసేవారమని, పచ్చటి పొలాలతో ఊరు కళకళలాడేదని కిట్టన్న చెప్పాడు. ఏడేళ్ల వయసు వరకు ఇక్కడే.. నాకు ఏడేళ్ల వయసు వచ్చే వరకూ ఊళ్లోనే ఉన్నా. పాపాఘ్ని నది దాటి టి.సదుంలో ఉన్న పాఠశాలకు వెళ్లేవాడిని. ఒకసారి నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో ఇంటికి రాలేక పోయాను. ఇప్పుడు టి.సదుంలోనే ఉంటున్నాను. – బోడెన్నగారి ఆదెన్న నీరు తగ్గే వరకూ అక్కడే.. పాపాఘ్ని నదిలోకి నీరు వస్తే మూడు రోజుల వరకూ ప్రవాహం తగ్గేది కాదు. పని మీద బయటకు వెళ్తే అక్కడే ఉండేవాళ్లం. ఊళ్లో పండుగలు, పబ్బాలు గొప్పగా చేసుకునేవాళ్లం. పగలంతా గత అనుభవాలు గుర్తుచేసుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేసి రాత్రికి టి.సదుం చేరుకుంటాను. – బక్కోళ్ల కిట్టన్న చదవండి: నా కులంపై దుష్ప్రచారం చేస్తున్నారు: పుష్ప శ్రీవాణి -
51 ఏళ్ల తర్వాత బయటపడింది
న్యూఢిల్లీ: దాదాపు 50 ఏళ్ల క్రితం గల్లంతైన ఓ భారత వాయుసేన విమానం అవశేషాలను తాజాగా గుర్తించారు. ఆదివారం ఈ విమాన శకలాలు ఢాకాలో బయటపడ్డాయి. ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్-12-534 విమానం 1968 ఫిబ్రవరి 7న గల్లంతైంది. అప్పటి నుంచి దీని ఆచూకీ లభ్యం కాలేదు. ఐఏఎఫ్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీనిలో ఉన్న సిబ్బంది గురించి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ క్రమంలో 2003లో హిమాలయన్ మౌంటనేరింగ్ ఇనిస్టిట్యూట్ సభ్యులు విమానంలో ప్రయాణించిన సిపాయ్ బేలీరామ్ మృతదేహాన్ని గుర్తించారు. దాంతో వాయుసేన మరోసారి గాలింపు చర్యలను ఉధృతం చేయగా 2007లో మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. అయితే 2009 నుంచి ఈ గాలింపు చర్యలను నిలిపివేశారు. అయితే గతేడాది జూలైలో విమానానికి సంబంధించిన కొన్ని శకలాలు ఢాకా గ్లేషియర్‌లో పడినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా మరోసారి గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఆదివారం విమానానికి సంబంధించిన ప్రధాన భాగాలు లభ్యమయ్యాయి. ఏరో ఇంజిన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఇంధన ట్యాంక్ యూనిట్, ఎయిర్‌బ్రేక్ అసెంబ్లీ, కాక్‌పిట్ డోర్ తదితర భాగాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ చరిత్రలో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో దీన్ని ఒకటిగా చెబుతారు. 1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించాలని గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది పైలట్‌కు సమాచారమిచ్చారు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి చండీగఢ్‌కు మళ్లించారు. అయితే మార్గమధ్యంలో రోహ్తంగ్ పాస్ మీదుగా ప్రయాణిస్తుండగా ఈ విమానానికి కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం దక్కలేదు. -
కూలిన పాక్ యుద్ధ విమాన శకలాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్ 16ను భారత వైమానిక దళం విజయవంతంగా తిప్పికొట్టింది. ఎఫ్ 16ను కూల్చివేసినట్టు భారత అధికారులు ప్రకటించగా తాజాగా వీటి శకలాలను పాక్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తించారు. పీఓకేలో కూలిన పాకిస్తాన్ ఎఫ్ 16 శకలాలను పాకిస్తాన్ ఏడవ నార్తర్న్ లైట్ ఇన్ఫ్యాంట్రీ కమాండింగ్ ఆఫీసర్‌తో పాటు ఇతర పాక్ వాయుసేన సిబ్బంది పరిశీలిస్తున్న చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు భారత యుద్ధవిమానాన్ని కూల్చివేసి పైలట్ అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్ ప్రకటించడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. కాగా భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత సమసిపోగానే తమ చెరలో ఉన్న భారత్ పైలట్ అభినందన్‌ను పాక్ భారత్‌కు అప్పగిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు పాక్‌తో ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలో మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతంలో భారత నావికా దళంతో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తమైంది. సముద్రాల్లో నేవీ, కోస్ట్‌గార్డ్ బృందాలు పెట్రోలింగ్ చేస్తూ మత్స్యకారుల కదలికలనూ గమనిస్తున్నారు. -
ఈజిప్టు విమాన శకలాలు గుర్తింపు
కైరో : సముద్రంలో కుప్పకూలిన ఈజిప్టు విమాన శకలాలను శుక్రవారం గుర్తించారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు 290 కి.మీ దూరంలో ఈ విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో నగరానికి బయల్దేరిన ఈ విమానం గురువారం తెల్లవారుజామున అదృశ్యమైంది. దీంతో అధికారులు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా సదరు విమానం మధ్యదర సముద్రంలో కూలిపోయినట్లు గుర్తించారు. విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 66 మంది దుర్మరణం చెందారు. విమానం లో 56 మంది ప్రయాణికులు కాగా.... ఏడుగురు సిబ్బంది... మరో ముగ్గురు భద్రత దళ సిబ్బంది ఉన్నారు. -
50 ఏళ్ల తర్వాత బయటపడింది..
బ్యూనస్ ఎయిర్: 50 ఏళ్ల క్రితం కూలిపోయిన విమాన శకలాలు, సిబ్బంది శవాలను తాజాగా గుర్తించారు. అర్జెంటీనా లో కూలిపోయిన రెండు ఇంజిన్ల పైపర్ అపాచీ విమాన శిధిలాలను అర్ధశతాబ్దం తర్వాత బయటపడింది. దీంట్లో నలుగురు వ్యక్తుల మృతదేహాలు సంబంధించిన అస్తిపంజరాలు లభించాయని అర్జెంటీనా జాతీయ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ నలుగురిలో ఒకరు పైలట్ కాగా , పాన్ అమెరికన్ అర్జెంటీనా ఆయిల్ కంపెనీ అధిపతి మిగెల్ షాంచెజ్ తో పాటు, మరో ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలుగా గుర్తించామని జిన్హువా శుక్రవారం ప్రకటించింది. స్థానిక వ్యక్తి ఒకరు విమాన రెక్క భాగాన్ని సోమవారం గుర్తించారని, మిగిలిన భాగం భూస్థాపితమైందని తెలిపింది. సరస్సులోని కొంతభాగం ఆవిరి కావడంతో ఈ శిధిలాలు భూమినుంచి పైకి చొచ్చుకు వచ్చాయని పేర్కొంది. కాగా అక్టోబర్ 19, 1964లో చెబుత్ రాష్ట్రం లోని ఓ సరస్సులో విమానం కూలిపోయింది. అనంతరం దీని ఆచూకీ కోసం రెండు బృందాలు శోధించినా ప్రయోజనం లభించలేదు.