ఈజిప్టు విమాన శకలాలు గుర్తింపు | EgyptAir flight MS804: 'No survivors' as search team finds wreckage | Sakshi
Sakshi News home page

ఈజిప్టు విమాన శకలాలు గుర్తింపు

Published Fri, May 20 2016 4:22 PM | Last Updated on Thu, Jul 11 2019 6:15 PM

ఈజిప్టు విమాన శకలాలు గుర్తింపు - Sakshi

ఈజిప్టు విమాన శకలాలు గుర్తింపు

కైరో : సముద్రంలో కుప్పకూలిన ఈజిప్టు విమాన శకలాలను శుక్రవారం గుర్తించారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు 290 కి.మీ దూరంలో ఈ విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో నగరానికి బయల్దేరిన ఈ విమానం గురువారం తెల్లవారుజామున అదృశ్యమైంది. దీంతో అధికారులు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అందులోభాగంగా సదరు విమానం మధ్యదర సముద్రంలో కూలిపోయినట్లు గుర్తించారు. విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 66 మంది దుర్మరణం చెందారు. విమానం లో 56 మంది ప్రయాణికులు కాగా.... ఏడుగురు సిబ్బంది... మరో ముగ్గురు భద్రత దళ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement