ఈజిప్టు విమాన శకలాలు గుర్తింపు
కైరో : సముద్రంలో కుప్పకూలిన ఈజిప్టు విమాన శకలాలను శుక్రవారం గుర్తించారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు 290 కి.మీ దూరంలో ఈ విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో నగరానికి బయల్దేరిన ఈ విమానం గురువారం తెల్లవారుజామున అదృశ్యమైంది. దీంతో అధికారులు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అందులోభాగంగా సదరు విమానం మధ్యదర సముద్రంలో కూలిపోయినట్లు గుర్తించారు. విమాన శకలాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 66 మంది దుర్మరణం చెందారు. విమానం లో 56 మంది ప్రయాణికులు కాగా.... ఏడుగురు సిబ్బంది... మరో ముగ్గురు భద్రత దళ సిబ్బంది ఉన్నారు.