50 ఏళ్ల తర్వాత బయటపడింది..
బ్యూనస్ ఎయిర్: 50 ఏళ్ల క్రితం కూలిపోయిన విమాన శకలాలు, సిబ్బంది శవాలను తాజాగా గుర్తించారు. అర్జెంటీనా లో కూలిపోయిన రెండు ఇంజిన్ల పైపర్ అపాచీ విమాన శిధిలాలను అర్ధశతాబ్దం తర్వాత బయటపడింది. దీంట్లో నలుగురు వ్యక్తుల మృతదేహాలు సంబంధించిన అస్తిపంజరాలు లభించాయని అర్జెంటీనా జాతీయ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఆ నలుగురిలో ఒకరు పైలట్ కాగా , పాన్ అమెరికన్ అర్జెంటీనా ఆయిల్ కంపెనీ అధిపతి మిగెల్ షాంచెజ్ తో పాటు, మరో ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలుగా గుర్తించామని జిన్హువా శుక్రవారం ప్రకటించింది. స్థానిక వ్యక్తి ఒకరు విమాన రెక్క భాగాన్ని సోమవారం గుర్తించారని, మిగిలిన భాగం భూస్థాపితమైందని తెలిపింది. సరస్సులోని కొంతభాగం ఆవిరి కావడంతో ఈ శిధిలాలు భూమినుంచి పైకి చొచ్చుకు వచ్చాయని పేర్కొంది.
కాగా అక్టోబర్ 19, 1964లో చెబుత్ రాష్ట్రం లోని ఓ సరస్సులో విమానం కూలిపోయింది. అనంతరం దీని ఆచూకీ కోసం రెండు బృందాలు శోధించినా ప్రయోజనం లభించలేదు.