లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పైలట్ యూనిఫామ్ ధరించి టైఫూన్ ఫైటర్ జెట్‌లో చక్కర్లు కొట్టారు. ఫైటర్ జెట్‌లో గగన విహారం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ దృశ్యాలు సోమవారం విడుదల చేసింది డౌనింగ్ స్ట్రీట్. తన మాస్క్ ధరించి ఫైటర్ జెట్‌ను నడుపుతూ.. తనను అనుసరిస్తూ మరో రెండు విమానాలకు థంబ్స్ అప్ ఇవ్వడం వీడియోలో కనిపించింది. 'ప్రధాని బోరిస్ జాన్సన్ లింకన్‌షైర్‌లోని ఆర్‌ఏఎఫ్ కానింగ్స్‌బై నుంచి టైఫూన్ ఫైటర్ జెట్ కాక్‌పిట్‌లో ఎగురుతున్నారు.' అంటూ వీడియో క్యాప్షన్ ఇచ్చారు.
ఐటీవీ ప్రకారం.. గత వారం లింకన్‌షైర్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్(ఆర్‌ఏఎఫ్) బేస్‌లో టైఫూన్ పైటర్స్ జెట్స్ ప్రదర్శన సందర్భంగా ఈ వీడియో తీశారు. ఈ సందర్భంగా ఆ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన బోరిస్.. కొన్ని విన్యాసాలు చేసేందుకు విమానాన్ని నియంత్రించానంటూ పేర్కొన్నారు. ఫైటర్ జెట్‌లో ప్రయాణంపై వింగ్ కమాండర్ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానమిచ్చారు బోరిస్. మరోవైపు.. ఫైటర్ జెట్‌లో బోరిస్ ప్రయాణించటంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. టాప్ గన్ సినిమాలో టామ్ క్రూజ్ ఫీట్‌లు చేసేందుకు ప్రయత్నించారని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ప్రధాని ఈ జాయ్‌రైడ్‌లో జాలీగా వెళ్లడానికి, టామ్ క్రూజ్‌లా విన్యాసాలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఎంత ఖర్చయిందంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ రైడ్ వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటని మరొకరు ప్రశ్నించారు.
విశ్వాస పరీక్షలో విజయం..
మరోవైపు.. ఇటీవలే ప్రధాని పదవికి రాజీనామా చేసి తాత్కాలిక బాధ్యతల్లో కొనసాగుతున్నారు బోరిస్ జాన్సన్. కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతోంది. భారత సంతతి వ్యక్తి, ఆ దేశా మాజీ మంత్రి రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో అధికార కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది.
ఇదీ చదవండి: Rishi Sunak.. పావులు కదుపుతున్న బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ఓటమికి స్కెచ్!
Comments
Please login to add a commentAdd a comment