పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన మెరుపు దాడులతో తీవ్ర అసహనానికి లోనైన పాకిస్తాన్ బుధవారం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. రాజౌరీ సెక్టార్‌లోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం తిప్పికొట్టింది. కాగా, భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ ఫైటర్ జెట్‌ను భారత వాయుసేన కూల్చివేసిందని అధికారులు చెబుతున్నారు.