ఆగ్రా : కరోనా సోకి 35 ఏళ్ల బీజేపీ యువ మెర్చా నాయకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలతో ఆగ్రా బీజేపీ యువ మెర్చా నాయకుడు మే 12న హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెంటనే ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కుటుంబ సభ్యులను కూడా ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. అంతేకాకుండా ఆయన నివాసం ఉంటున్న కాలనీలో శానిటైజేన్ నిర్వహించి, అనుమానిత వ్యక్తులను ఐసోలేషన్‌కు తరలించారు.
బీజేపీ మెర్చా నాయకుడి ఆరోగ్యం క్రమంగా విషమించి గురువారం అర్థరాత్రి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అంతేకాకుండా ఆయనకు వైద్యం అందించిన 28 ఏళ్ల నర్సు కూడా కరోనా భారిన పడినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఆగ్రాలో 785 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. వారిలో 389 మంది కరోనా రోగులు కోలుకొని డిశ్జార్జ్ అయినట్లు తెలిపారు. ఆగ్రాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 27 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. (సెంట్రల్ జైలులో కరోనా కలకలం.. )
Comments
Please login to add a commentAdd a comment