ఆగ్రా: ఎన్ని చర్యలు చేపట్టినా దేశంలో కరోనా కేసులు నియంత్రణలోకి రావడం లేదు. ఇప్పటికే కేసుల సంఖ్య నలభై వేలు దాటింది. ఉత్తర ప్రదేశ్‌లోనూ వైరస్ వ్యాప్తి గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆగ్రాలో 43 హాట్ స్పాట్‌లను గుర్తించిన ప్రభుత్వం అక్కడ 14 వేల మందిని హోమ్ క్వారంటైన్‌కు ఆదేశించింది. అనూహ్యంగా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నవారికి పాజిటివ్ వస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ ప్రతీ 36 నిమిషాలకు ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఈ తరుణంలో క్వారంటైన్ పీరియడ్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని అక్కడి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. (వైరస్‌ను అంతం చేసే యూవీ బ్లాస్టర్...)
ఈ విషయం గురించి డా. ఎస్‌కే కర్ల మాట్లాడుతూ.. ఓ వ్యక్తికి వైరస్ సోకిందన్న విషయం నిరూపితమవడానికి సుమారు 28 రోజులు పడుతుందని, కనుక క్వారంటైన్ పీరియడ్‌ను 14 రోజుల నుంచి 28 రోజులకు పొడిగించాలని తెలిపారు. మరో వైద్యాధికారి డా.వినయ్ కుమార్ మాట్లాడుతూ.. లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్‌కు తరలించి, ఎలాంటి లక్షణాలు వెలుగు చూడని వారికి 28 రోజుల క్వారంటైన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కొంతమందిలో వైరస్ బలహీనంగా ఉండటంతో తొలుత నెగెటివ్ వచ్చినప్పటికీ 14 రోజుల తర్వాత పాజిటివ్ వస్తోందన్నారు. కాబట్టి క్వారంటైన్‌లో ఉండేవాళ్లను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. (మందుబాబులు ఎగబడ్డారు!)
Comments
Please login to add a commentAdd a comment