లక్నో : యూపీలోని ఆగ్రాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొద్ది గంటలు ముందు ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన తాజ్‌మహల్ కొలువైన ఆగ్రాలోనైనా ప్రధాని నరేంద్ర మోదీ ప్రేమ, ఆప్యాయతల గురించి తెలుసుకుంటారని ఆకాంక్షిస్తూ అఖిలేష్ ట్వీట్ చేశారు.
ఆగ్రా సమీపంలో బంగాళదుంప, చెరకు, ధాన్యం రైతుల కష్టాలను సైతం ఆయన గుర్తుతెచ్చుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఇక్కడి రైతులు, వ్యాపారుల దీనావస్థ చూడలేనంతగా యూపీ ఢిల్లీకి దూరంగా లేదని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం కోట్లాది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేదన్నారు.
రైల్వేల్లో 63,000 పోస్టులకు రెండు కోట్ల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో ఇదే యువత మోదీ సర్కార్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉందన్నారు. కాగా అక్రమ మైనింగ్ కేసుల్లో సీబీఐ తనను ప్రశ్నించనుందనే వార్తల నేపథ్యంలో అఖిలేష్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment