లక్నో: మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఓ వ్యక్తి గిరిజనుడిపై మూత్రం పోసిన సంఘటన మరువక ముందే ఆగ్రాలో అలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఉన్న ఓ వ్యక్తిపై మూత్రం పోస్తూ వీడియో తీసుకున్నాడు మరో ప్రబుద్ధుడు.
మానవత్వానికి కళంకంగా నిలిచే సంఘటనలు ఒకదాని వెంట మరొకటి చోటు చేసుకంటూనే ఉన్నాయి. సమాజంలో ఇప్పటికీ వివక్షలు చాపకింద నీరులా ప్రబలుతూనే ఉన్నాయి. మొన్న మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి అమానుషంగా గిరిజనుడిపై మూత్రం పోసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగడంతో సదరు నిందితుడు కటకటాల పాలవడమే కాకుండా అతని ఇల్లు కూడా నేలమట్టం చేశారు.
ఒకపక్క ఇటువంటి చర్యలపై చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంతమంది వాటిని ఖాతరు చేయడం లేదు. మధ్యప్రదేశ్ ఉదంతం గురించి తెలిసి కూడా ఆగ్రాలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిద్రిస్తున్న మరో వ్యక్తిని కాలితో నిర్దాక్షిణ్యంగా తన్నుతూ ముఖం మీద మూత్రం పోశాడు. దీన్ని అతని స్నేహితుడు వీడియో తీశాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మూత్రం పోసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని వెతుకులాట కొనసాగుతోందని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వీడియో ఇప్పటిది కాదని మూడు నాలుగు నెలల క్రితం వీడియో అని ఇప్పుడు వైరల్ అయ్యిందని చెబుతూ మూత్రం పోసిన వ్యక్తిని ఆదిత్యగా, వీడియో తీసిన వ్యక్తి అటుస్ గా గుర్తించినట్టు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇది కూడా చదవండి: చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్
Comments
Please login to add a commentAdd a comment