సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించనున్న అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌నకు ఈ అపూర్వ కట్టడంతో అనుభవాలు చాలానే ఉన్నాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ తిరుగులేని ఆదాయ వనరుగా మార్చుకోవడంలో అందెవేసిన చేయిగా పేరొందిన ట్రంప్‌నకు ఆ తాజ్‌మహల్ మాత్రం బిన్న అనుభవాలనే మిగిల్చింది. 1990లో న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో ప్రారంభమైన ట్రంప్ తాజ్ మహల్ క్యాసినో ప్రారంభించిన నెలల్లోనే దివాలాకు దరఖాస్తు చేసింది. అనంతరం దీన్ని ట్రంప్ ఎంటర్టైన్మెంట్ రిసార్ట్స్ అనే మాతృ సంస్థ కిందకు తీసుకువచ్చారు, అప్పటికీ అది రెండు సార్లు దివాలా తీసి కష్టాలు మిగిల్చినా డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా రెండు చేతులా ఆర్జించారు. ట్రంప్ తాజ్ మహల్ ను 2017 లో హార్డ్ రాక్ కేఫ్ బ్రాండ్ యజమానులకు విక్రయించే సమయానికి, డొనాల్డ్ ట్రంప్‌కు మాతృ సంస్థలో వాటా లేదు. (నూలు వడికిన అమెరికా ప్రెసిడెంట్)
తాజ్ వద్ద తాజా సాయంత్రం..
ఇక ఇప్పటి విషయానికి వస్తే తాను నిర్మించిన తాజ్ మహల్ అనుభవం అలా ఉంటే ఇక ప్రపంచంలోనే అత్యంత సందర్శనీయ స్ధలాల్లో ఒకటై ఆగ్రాలో కొలువుతీరిన తాజ్‌మహల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికాసేపట్లో సందర్శించనున్నారు. ట్రంప్ తాజ్ పర్యటన నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. తోటలు, ఫౌంటెన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆర్భాటపు ఏర్పాట్లు, తాజ్ అందాలు ట్రంప్‌ను ఎలాంటి అనుభూతులకు లోనుచేస్తాయి..? తన తాజ్‌మహల్ జ్ఞాపకాలను గుర్తుకుతెస్తాయా..? వాటిని మనతో ఆయన ఎలా పంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment