ఆగ్రా: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్ తాజ్‌మహల్‌లో సందడి చేశారు. భర్త జారేద్ కుష్నర్‌తో కలిసి ప్రపంచ వింతల్లో ఒకటైన కట్టడాన్ని వీక్షించారు. 2017లో ఇవాంక తొలిసారిగా భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)’ కు ఆమె హాజరయ్యారు. తాజాగా తన తండ్రి ట్రంప్ భారత పర్యటనలో ఆమె కూడా భాగస్వామ్యమయ్యారు.(చేతిలో చెయ్యి వేసుకుని.. తాజ్ అందాలు వీక్షిస్తూ.. )
ఈ క్రమంలో సోమవారం అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ దంపతులతో పాటు ఇవాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగు ఫ్లోరల్ డిజైన్‌తో రూపొందించిన డ్రెస్‌తో పాటు అదే రంగు హైహీల్స్ ధరించి తనదైన స్టైల్‌లో వావ్ అనిపించారు. ఇక నమస్తే ట్రంప్ కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ కుటుంబం ఆగ్రాకు చేరుకున్నారు. ట్రంప్ దంపతులతో పాటు, ఇవాంక దంపతులు కూడా తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇవాంక భర్త జారేద్ కుష్నర్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. చారిత్రక కట్టడానికి సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి తాజ్ అందాలకు ఫిదా అయిన ట్రంప్ కుటుంబం.. దాదాపు గంటసేపు అక్కడే ఆహ్లాదంగా గడిపారు. (ట్రంప్ పర్యటన : మిడి డ్రెస్‌లో ఇవాంక)
Comments
Please login to add a commentAdd a comment