ప్రియుడితో భార్య షికారు.. వెంబడించి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న భర్త | Viral Video: Husband Catches His Wife Red Handed With Lover On Scooty in Agra | Sakshi
Sakshi News home page

Viral Video: ప్రియుడితో భార్య షికారు.. వెంబడించి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న భర్త

Published Sat, Sep 17 2022 6:30 PM | Last Updated on Sat, Sep 17 2022 7:12 PM

Viral Video: Husband Catches His Wife Red Handed With Lover On Scooty in Agra - Sakshi

వివాహేతర సంబంధాలు నానాటికీ ఎక్కువై పోతున్నాయి. హాయిగా సాగుతున్న సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. పవిత్రమైన వివాహ బంధాలను విచ్చిన్నం చేస్తున్నాయి. అనేక కుటుంబాలను రోడ్డుకు ఈడుస్తున్నాయి.. పరాయి వ్యక్తి మోజులో పడి కట్టుకున్న వారిని వదిలేసి వెళ్లడం.. చివరకు వారి బంధానికి అడ్డు వస్తున్న వారిని అంతమొందించే వరకు దారితీస్తున్నాయి.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లై పిల్లలున్న ఓ మహిళ ప్రియుడి మోజులో పడింది. భర్తకు తెలియకుండా అతనితో షికారుకెళ్లి జాలీగా ఎంజాయ్‌ చేయడం ప్రారంభించింది.. మహిళ బండారం ఓ రోజు బట్టబయలైంది. భార్య వేషాలు తెలుసుకున్న​ భర్త ఆమెను ఫాలో అయ్యి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగు చూడగా.. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయడంతో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
చదవండి: చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డ మహిళ.. చితకబాదిన స్థానికులు 

పదేళ్ల కిత్రం మహిళకు ఓ వ్యక్తితో పెళ్లైంది. వీరికి కూతురు కూడా ఉంది. అయితే కొన్ని రోజులుగా మహిళకు ఓ వ్యాపారితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 11న ఆదివారం భర్తతో గొడవపడిన భార్య.. ఇంట్లో భర్తను కూతురుని వదిలేని ప్రియుడితో కలిసి షికారుకు వెళ్లింది. భార్యపై అనుమానంతో తన కూతురిని తీసుకుని మహిళను వెతకాడానికి వెళ్లాడు భర్త. ఇంతలో మరో వ్యక్తితో ఆమె స్కూటిపై కైలాష్‌ మందిర్‌ రోడ్డుపై వెళుతూ కనిపించింది. 

దీంతో వారిద్దరినీ కొంత దూరం వెంబడించాడు. బండి ఆపమని గట్టిగా కేకలు వేశాడు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా మహిళ సన్‌గ్లాసెస్‌ ధరించి స్కార్ఫ్‌తో ముఖం కప్పేసుకుంది. భర్తను చూసిన వారిద్దరూ తప్పించుకునే ప్రయత్నం చేయగా వేగంగా బైక్‌ డ్రైవ్‌ చేసి వారిని పట్టుకున్నాడు. భార్యపై, ఆమె ప్రియుడిపై  చేయిచేసుకున్నాడు. నడిరోడ్డుపైనే భార్య, ప్రియుడిని చెప్పుతో కొట్టి చితకబాదాడు. ప్రస్తుతం ఈ బాగోతానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement