
సాక్షి, న్యూఢిల్లీ: తూర్పు ఆగ్రా ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు జగన్‌ప్రసాద్ గార్గ్ బుధవారం మృతిచెందారు. ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్‌ప్రసాద్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికు గార్గ్ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. గార్గ్ మరణవార్త తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గార్గ్ మరణంతో ఆగ్రా నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గార్గ్ ఢిల్లీ బీజేపీ బలోపేతం కావడానికి కృషి చేశారు. అయితే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయనకు మంత్రిగా పనిచేసే అవకాశం రాలేదు.