
ఆగ్రా : ఆసుపత్రిలో చేరిన 48 గంటల్లోనే 28 మంది కరోనా బాధితులు చనిపోయిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. దీంతో ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా బాధితుల తరుపు బంధువుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేసి నివేదిక సమర్పించాలని కోరారు. అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతున్న ఆగ్రాలో అతి తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో మరణాలు సంభవించడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆగ్రాలో 75 మంది కోవిడ్ కారణంగా మరణించారు. (ఆస్పత్రి యాజమాన్యల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి )
తాజా ఘటనపై ఆగ్రా సీఎంవో ఆర్‌సీ పాండే మాట్లాడుతూ.. బాధితులు ఆసుపత్రికి సకాలంలో వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా గుండె, మధుమేహం, శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారిలో అత్యధిక మరణాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఆగ్రాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో పరిస్థితిని సమీక్షించేందుకు విద్యుత్‌శాఖ కార్యదర్శి ఎం దేవరాజ్‌ను నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఆగ్రాలోనే చోటుచేసుకుంటున్నాయి. మరణాల పరంగానూ మొదటిస్థానంలో ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితులపై నివేదిక సమర్పించాల్సిందిగా సీఎం ఆదేశించారు. (మన్మోహన్ వ్యాఖ్యలపై నడ్డా ఫైర్ )
Comments
Please login to add a commentAdd a comment