లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అమానవీయ ఘటన జరిగింది. హోటల్‌లో పనిచేసే యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి మద్యం తాగించి, ఆమెపై కిరాతకంగా దాడి చేశారు. యువతిని గదిలోకి లోక్కెళుతున్న వీడియో ఒకటి బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
శనివారం రాత్రి తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కి ఓ యువతి కాల్ చేసి రోదిస్తూ విషయం తెలిపింది. పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రదేశానికి వెళ్లారు. అప్పటికే గాయాలపాలైన యువతి దారుణాన్ని పోలీసులకు తెలిపింది. యువతి హోటల్‌లో ఏడాదిన్నరగా ఉద్యోగిగా పనిచేస్తోంది. శనివారం అర్ధరాత్రి యువతి స్నేహితురాలు బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు. మద్యం మత్తులో వారితోపాటే ఉన్న మరో నలుగురు యువకులు బాధితురాల్ని ఓ గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ యువతి కాపాడండి అంటూ కేకలు పెడుతున్న ఓ వీడియో పోలీసులకు చిక్కింది.
అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించిన తనపై ఆ యువకులు దాడి చేశారని బాధితురాలు తెలిపింది. గాజు గ్లాస్‌తో తలపై కొట్టారని వాపోయింది. ఇంతకు ముందు తీసిన తన అభ్యంతరకర వీడియోను బయటపెడతామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపింది. ఈ కేసులో నలుగురు యువకులు, ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment