నగ్నంగా ఊరేగిస్తున్న మహిళ మరిది, జనం
ఆగ్రా : మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవటంతో ఓ వ్యక్తి బట్టలు చించేసి నగ్నంగా ఊరేగించారు జనం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆగ్రాలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికి అదే గ్రామంలో ఉంటున్న పరాయి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇద్దరూ ఏకాంతంగా కలిసి ఉండగా మహిళ మరిది వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అతడితో కలిసిన కొంతమంది ఊరి జనం నిందితుడిని విపరీతంగా చితకబాదారు. బట్టలు పూర్తిగా చించేసి, గ్రామంలోని వీధుల గుండా నగ్నంగా తిప్పారు.
ఊరేగింపునంతా వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. అనంతరం మహిళ బంధువు ఒకరు నిందితుడికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీడియో ఆధారంగా నిందితుడిపై దాడికి పాల్పడ్డవారిని గుర్తించిన పోలీసులు వీలైనంత త్వరగా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment