
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో క్షుద్ర పూజల కలకలం రేగింది. భార్యను చంపేందుకు చేతబడి ప్రయోగం చేశాడో భర్త. రెండో పెళ్లికి అడ్డుగా ఉన్న భార్యపై క్షుద్రపూజలు చేయించాడు. అయితే స్ధానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. పూజల స్థావరంపై దాడిచేసి దొంగ బాబాను అరెస్ట్ చేశారు. బాధిత మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు.
చదవండి: (భర్త వివాహేతర సంబంధాలు.. వేడినూనె పోసి చంపేందుకు భార్య...)