సాక్షి, ఎర్రుపాలెం : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో సంచలనం సృష్టించిన వెల్లంకి రాజశ్రీ (16) అదృశ్యం కేసులో ఎలాంటి పురోగతి కనిపిం చడంలేదు. రాజశ్రీ సమీప బంధువైన గద్దె నర్సిం హారావు తన ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయనే అనుమానంతో 30 అడుగుల లోతు గొయ్యి తవ్విం చి క్షుద్ర పూజలు చేసిన విషయం తెలిసిందే. స్థానిక పూజారులు మాత్రం తాము హోమాలే చేశామని, క్షుద్ర పూజల సంగతి తెలియదని చెబుతున్నారు. కాగా, ఈ పూజల్లో కీలకంగా భావిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన మరో పూజారి ప్రకాశ్ శర్మ వెంటే రాజశ్రీ ఉందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: ఇంట్లో గొయ్యి... అమ్మాయి అదృశ్యం!
ఆయన భార్య బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఆశ్రమాన్ని ని ర్వహిస్తుండడంతో అక్కడికే ఆ బాలికను తీసుకెళ్లి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొబైల్ లొకేషన్‌ను ట్రేస్ చేస్తున్నప్పటికీ ప్రకాశ్ శ ర్మ, రాజశ్రీ ఎక్కడున్నారనే సమాచారాన్ని పోలీసులు కనుగొనలేకపోతున్నారు. ఈ విషయమై ఎర్రుపాలెం ఎస్సై ఉదయ్‌కిరణ్‌ను వివరణ కోరగా కేసులో కీలకమైన పూజారి ప్రకాశ్ శర్మ, రాజశ్రీ ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నామని చెప్పారు.
ముగ్గురిని మింగిన ‘పులిగుండాల’
పెనుబల్లి: వానాకాలం పంట సీజన్ ముగియడంతో సరదాగా విహార యాత్ర కోసం వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తూ పులిగుండాల ప్రాజెక్ట్ నీటిలో మునిగి చనిపోయారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన 9 మంది యువకులు పెనుబల్లి మండలం తాళ్లపెంట అటవీ ప్రాంతంలోని పులిగుండాల ప్రాజెక్ట్‌కు విహారయాత్రకోసం వెళ్లారు. వెంట తెచ్చుకున్న సామగ్రితో అక్కడే వంట చేసుకుని, స్నానాలు చేద్దామని ముందుగా ఐదుగురు యువకులు వెళ్లారు. వారు తిరిగొచ్చాక జంగ రామకృష్ణారెడ్డి (24), వేమిరెడ్డి సైదిరెడ్డి (18), శీలం చలపతి (25) అనే మరో ముగ్గురు యువకులు నీళ్లలోకి దిగారు. వీరిలో ఒకరు కాలు జారి నీటిలో మునిగిపోగా, ఆ యువకుడిని రక్షించే క్రమంలో మరో ఇద్దరు నీటిలో మునిగి గల్లంతయ్యారు.
దీంతో అక్కడే ఉన్న తోటి మిత్రులు పోలీసులకు సమాచారం అందించడంతో సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్, ఎస్‌ఐ తోట నాగారాజు, కల్లురు ఎస్‌ఐ రఫీ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కల్లూరు ఏసీపీ ఎన్.వెంకటేశ్, ఆర్‌డీఓ సూర్యనారాయణ సందర్శించారు. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు రాత్రి 7 గంటల సమయంలో ముగ్గురు యువకుల మృత దేహాలను వెలికితీశారు. అనంతరం మృదేహాలను పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుల దుర్మరణంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment