ప్రణయ్ భార్య అమృత
మిర్యాలగూడ(నల్గొండ) : ‘‘అంకుల్ నేను మిస్టర్ ఫర్‌ఫెక్ట్.. మీరు మీ అమ్మాయికి తెచ్చే అబ్బాయిలో ఉండే ఫర్‌ఫెక్ట్ లక్షణాలు ఏవి ఉండాలని కోరుకుంటున్నారో.. ఆ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి’’. అని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య కు గురైన పెరుమాళ్ల ప్రణయ్ తన డైరీలో రాసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రణయ్‌కి డైరీ రాసే అలవాటు ఉండడం వల్ల తాను అమృతను ప్రేమించిన విషయాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే విషయాలు రాసుకున్నట్లు తెలుస్తోంది.
కులం, ఆస్తిపాస్తులు చూసి ప్రేమికులను విడదీయరాదని, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికే అని ప్రణయ్ డైరీలో రాసుకున్నాడు. మద్యం, సిగరెట్ ఇతర చెడు అలవాట్లు ఉన్న వారిని రిజక్ట్ చేయాలని, చెడు అలవాట్లు ఉంటే ఆ అబ్బాయిని తిరస్కరించాలని కూడా డైరీలో రాసుకున్నట్లు తెలు స్తోంది. ఆస్తిపాస్తులు లేకున్నా మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటానని డైరీలో రాసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బేబీ పుట్టేలోపు ఉరితీయాలి: అమృత ప్రణయ్ భార్య
‘ఎస్పీ గారు నాకు బేబీ పుట్టే వరకు రక్షణ కల్పిస్తామని చెప్పారు’ అని ప్రణయ్ భార్య అమృత పేర్కొంటున్నారు. సోమవారం మిర్యాలగూడలోని ప్రణయ్ నివాసంలో ఆమె ‘సాక్షి’తో మా ట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రణయ్‌ని చంపిన వాళ్లు నా బిడ్డను కూడా చంపరని లేదు. బేబీ పుట్టే లోపు ప్రణయ్‌ని చంపినవాళ్లను ఉరి తీస్తే బెటర్. మేము పాఠశాల నుంచి ప్రేమించుకున్నాం. మా విషయాలు ఇంట్లో వారందరికి తెలుసు కానీ. మా డాడీ, బాబాయి ప్రణయ్‌ని బెది రించారు.
నన్ను ఎన్నో పర్యాయాలు కొట్టారు. నన్ను చంపి సాగర్‌లో వేస్తామని కూడా చెప్పారు. ప్రణయ్‌ని హత్య చేసి న సమయంలో ఉన్న సీసీ ఫుటేజీని ధైర్యం లేక ఇప్పటివరకు చూడలేదు. ఈ రోజే సీసీ ఫుటేజీ చూశాను. ప్రణయ్‌ని కళ్లముందే చంపి వెళ్లారు. అలా నేను చూస్తానని అనుకోలేదు. మా డాడీ లాంటి సైకో లు చాలామంది ఉంటారు. 60 ఏళ్లు ఉన్న వారికి కూడా భర్త చనిపోతే కూడా ఎంతో బాధ ఉం టుంది. కానీ నాకు 21 ఏళ్లు. నాకు ఎంత బాధ ఉంటుందో..’’ అని కంట నీరు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment