
సాక్షి, నల్లొండ : రాష్ట వ్యాప్తంగా సంచలన సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ఉదంతంలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రణయ్ భార్య అమృత శనివారం సాయంత్రం ఆమె తల్లి గిరిజను కలిశారు. ఇటీవల అమృత తండ్రి, ప్రణయ్ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా మారుతీరావు అంత్యక్రియల సందర్భంగా కడసారి తండ్రిని చూసేందుకు వచ్చిన అమృతను వారి కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో తండ్రిని చివరిసారి కూడా చూడకుండానే అమృత వెనుదిరిగి వెళ్లిపోయారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు అమృతను తల్లి గిరిజ వద్దకు వెళ్లమని లేఖ రాసిన విషయం తెలిసిందే. (గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా)
ఈ నేపథ్యంలో తండ్రి మరణం అనంతరం తొలిసారి తల్లి గిరిజను చూసేందుకు పోలీసుల రక్షణ నడుమ అమృత తన నివాసానికి వచ్చి పరామర్శించారు. తండ్రి చివరి మాటను దృష్టిలో ఉంచుకుని అమృత గిరిజను కలిసినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది ప్రణయ్‌ను వివాహమాడిన తరువాత తల్లిని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మారుతీరావు మరణం అనంతరం అమృత బాబాయ్ శ్రవణ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శ్రవణ్ వేధింపుల కారణంగానే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్‌లో )
Comments
Please login to add a commentAdd a comment