అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి | Student Neeraja Commits Suicide in Bathroom | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి

Published Sat, Dec 15 2018 12:52 PM | Last Updated on Sat, Dec 15 2018 12:52 PM

Student Neeraja Commits Suicide in Bathroom - Sakshi

నీరజ మృతదేహం

యాదాద్రి భువనగిరి,మఠంపల్లి (హుజూర్‌నగరర్‌) :  అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన మంఠంపల్లి మోడల్‌ స్కూల్‌లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు, తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రఘునాథపాలేనికి చెందిన చలిగంటి కొండయ్య కుమా ర్తె నీరజ (17) మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. నీరజ శనివారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసింది. అనంతరం తండ్రి ఫోన్‌ చేయగా మాట్లాడి పడుకుంది. తెల్లవా రిన తర్వాత తోటి విద్యార్థినులు స్నానం చేసేం దుకు బాత్‌రూంకు వెళ్లగా గడియ పెట్టి ఉంది. చాలా సేపు వేచి చూసిన అందులో ఉన్న వారు గడియ తీయకపోవడంతో అనుమానంతో విద్యార్థినులు బాత్‌రూం తలుపును బలంగా నెట్టారు. అందులోని దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. అప్పటికే నీరజ బాత్‌రూం వెంటిలేటర్‌కు చున్నీతో ఉరి పెట్టుకుని కనిపించడంతో కేకలు వేశారు. విషయాన్ని స్కూల్‌ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రంజిత్‌కుమార్‌ ఘటన స్థలా న్ని పరిశీలించారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు.

నీరజ మృతిపై అనుమానాలు
నీరజ మృతిపై తండ్రితో పాటు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రాత్రి వరకు బాగానే ఉన్న తన కుమార్తె తెల్లారేసరికే విగతజీవిగా మారిపోవడానికి బలమైన కారణాలు ఏమీ లేవని వాపోయారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని పోస్టుమార్టం నివేదికలో నిజాలు వెలుగుచూస్తాయని, అప్పటి వరకు శాంతియుతంగా ఉండాలని నచ్చజెప్పారు. మృతురాలి తండ్రి కొండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంజిత్‌ తెలిపారు.

రఘునాథపాలెంలో విషాదఛాయలు ..  
ఇంటర్‌ విద్యార్థిని నీరజన అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో రఘునాథపాలెంలో  విషాదఛా యలు అలుముకున్నాయి. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఇద్దరు చిన్నారులు దారుణంగా మృతిచెందిన  ఘటన మరువక ముందే మరో వి ద్యార్థిని మృతిచెందటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.ఆరుమాసాల క్రితం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతున్న పెదవీడుకు చెందిన విద్యార్థిని హాస్ట ల్‌ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement