
చెట్టుకు కట్టేసి బూట్‌తో కొడుతున్న మహిళ
సాక్షి, నల్లగొండ: వివాహితను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన నల్లగొండ శివారులోని ఆర్జాలబావి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన వజ్జ శ్రీశైలం ఇంటర్ వరకు చదివి మద్యానికి బానిసౌ జులాయిగా తిరుగుతున్నాడు. రెండు నెలలుగా అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇంటి ఎదుట నుంచి బైక్‌పై చక్కర్లు కొడుతూ వెకిలి చేష్టలకు పాల్పడుతూ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో సదరు వివాహిత భర్త ఇంటి ఎదుట సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. వీడియో పుటేజీ ఆధారంగా గుర్తించి బుధవారం శ్రీశైలాన్ని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. అనంతరం ఇబ్బందులకు గురిచేస్తున్న వివాహితతోనే అతడిని చెప్పుతో చితకబాదించారు. ఆ సందర్భంగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కూడా హల్‌చల్ సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీశైలంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment