లైంగికదాడి చేసి.. ఆపై గొంతుకోసి.. | Women Brutal Murder In Nalgonda | Sakshi
Sakshi News home page

లైంగికదాడి చేసి.. ఆపై గొంతుకోసి..

Published Fri, May 10 2019 9:16 AM | Last Updated on Fri, May 10 2019 9:16 AM

Women Brutal Murder In Nalgonda - Sakshi

కర్రె అనురాధ మృతదేహం

తుర్కపల్లి (ఆలేరు) : మండల పరిధిలోని వెంకటాపూర్‌లో బుధవారం రాత్రి వెలుగుచూసిన మహిళ అనుమానాస్పద మృతిని పోలీసులు హత్యగానే తేల్చారు. మహిళపై దుండగులు లైంగిక దాడి చేసి ఆపై గొంతుకోసి దారుణంగా హత్య చేసినట్టు నిర్ధారించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన కర్రె అనురాధ (46)కు భిక్షపతితో 30 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 12 సంవత్సరాల క్రితం భర్త అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. వీరికి సంతానం లేకపోవడంతో అనురాధ గ్రామంలో ఒంటరిగానే  బెల్ట్‌షాప్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది.

రెండు రోజుల క్రితం..
మంగళవారం రాత్రి 10 గంటలకు అనురాధ పొరుగింటి వారితో మాట్లాడిందని స్థానికులు చెబుతున్నా రు. ఇంటి ముందు ఉన్న తలుపు గడియపెట్టి ఉండిఫ్యాన్‌ నడుస్తుండడంతో నిత్యం  మద్యానికి వచ్చే వాళ్లకు అనుమానం వచ్చింది. దీంతో ఇంటి వెనుక తలపును పరిశీలించారు. ఇంటి వెనక కూడా గడియపెట్టి ఉండడంతో   ప్రహరీ దూకి కిటికిలోంచి తొంగి చూశారు. అనురాధ ఒంటి పైన బట్టలు లేకుండా గొంతు నుంచి రక్తం కారినట్టు విగతజీవిగా ఉండడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తెలిసిన వారి పనేనా..?
ఇంట్లో చాపలు దప్పుట్లు పరిచి ఉండడంతో పాటు, ఒంటిపై దుస్తులు లేకుండా ఉండడంతో తెలిసిన వారే వచ్చి ఉంటారని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిలో నిరోద్‌ ప్యాకెట్‌ కవర్‌ మాత్రమే దొరికిం ది. 8 తులాల బంగారం, రూ.50 వేల నగదు దొంగిలించారని బంధులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..సంఘటన స్థలాన్ని డీసీపీ నారాయణరెడ్డి, రాచకొండ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులుతో పాటుగా ఎస్‌ఐ వెంకటయ్య పర్యవేక్షించారు. ఉదయం క్లూస్‌ టీమ్‌తో పాటుగా డాగ్‌ స్కాడ్‌తో ఇంటిని పరిసరాలను పరిశీలించగా పోలీసు జాగీలాలు వెంకటాపూర్‌ ఎరువుల కర్మగారం వరకు వెళ్లి అగిపోయాయి. పోలీసులు కేసును నమోదు చేసుకుని నిందుల కోసం గాలిస్తున్నారు.ఈ çఘటనతో వెంకటాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement