brutal marder
-
తండ్రి కొడుకుల హత్య కేసు: మరణాంతరం నేత్ర దానం
ఉప్పల్: ఉప్పల్‌లో ఇటీవల దారుణ హత్యకు గురైన తండ్రీ కొడుకులు నర్సింహ శర్మ, శ్రీనివాస్‌ల నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పతికి దానం చేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరసింహ శర్మ కుమారుడు, కూతుళ్లు పేర్కొన్నారు. (చదవండి: తండ్రి కొడుకుల జంట హత్య కేసు దర్యాప్తు ముమ్మరం) -
లైంగికదాడి చేసి.. ఆపై గొంతుకోసి..
తుర్కపల్లి (ఆలేరు) : మండల పరిధిలోని వెంకటాపూర్‌లో బుధవారం రాత్రి వెలుగుచూసిన మహిళ అనుమానాస్పద మృతిని పోలీసులు హత్యగానే తేల్చారు. మహిళపై దుండగులు లైంగిక దాడి చేసి ఆపై గొంతుకోసి దారుణంగా హత్య చేసినట్టు నిర్ధారించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కర్రె అనురాధ (46)కు భిక్షపతితో 30 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 12 సంవత్సరాల క్రితం భర్త అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. వీరికి సంతానం లేకపోవడంతో అనురాధ గ్రామంలో ఒంటరిగానే బెల్ట్‌షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. రెండు రోజుల క్రితం.. మంగళవారం రాత్రి 10 గంటలకు అనురాధ పొరుగింటి వారితో మాట్లాడిందని స్థానికులు చెబుతున్నా రు. ఇంటి ముందు ఉన్న తలుపు గడియపెట్టి ఉండిఫ్యాన్ నడుస్తుండడంతో నిత్యం మద్యానికి వచ్చే వాళ్లకు అనుమానం వచ్చింది. దీంతో ఇంటి వెనుక తలపును పరిశీలించారు. ఇంటి వెనక కూడా గడియపెట్టి ఉండడంతో ప్రహరీ దూకి కిటికిలోంచి తొంగి చూశారు. అనురాధ ఒంటి పైన బట్టలు లేకుండా గొంతు నుంచి రక్తం కారినట్టు విగతజీవిగా ఉండడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెలిసిన వారి పనేనా..? ఇంట్లో చాపలు దప్పుట్లు పరిచి ఉండడంతో పాటు, ఒంటిపై దుస్తులు లేకుండా ఉండడంతో తెలిసిన వారే వచ్చి ఉంటారని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిలో నిరోద్ ప్యాకెట్ కవర్ మాత్రమే దొరికిం ది. 8 తులాల బంగారం, రూ.50 వేల నగదు దొంగిలించారని బంధులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..సంఘటన స్థలాన్ని డీసీపీ నారాయణరెడ్డి, రాచకొండ క్రైమ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులుతో పాటుగా ఎస్ఐ వెంకటయ్య పర్యవేక్షించారు. ఉదయం క్లూస్ టీమ్‌తో పాటుగా డాగ్ స్కాడ్‌తో ఇంటిని పరిసరాలను పరిశీలించగా పోలీసు జాగీలాలు వెంకటాపూర్ ఎరువుల కర్మగారం వరకు వెళ్లి అగిపోయాయి. పోలీసులు కేసును నమోదు చేసుకుని నిందుల కోసం గాలిస్తున్నారు.ఈ çఘటనతో వెంకటాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గొంతు కోసి.. గోళ్లు పీకేసి..
నకిరేకల్: ఇంటి వద్ద ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపేశారు. గొంతు కోసి.. గోళ్లు పీకేసి.. పొట్టపై కాళ్లతో తొక్కి.. చేతులపై విచక్షణారహితంగా గాయాలు చేసి పొట్టనపెట్టుకున్నారు. తర్వాత మృతదేహాన్ని తీసుకొచ్చి బాలుడి ఇంటిపైనే పడేసి వెళ్లిపోయారు. ఈ దారుణమైన ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం వడ్డెర కాలనీ సమీపంలో జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కుక్కడం గ్రామానికి చెందిన రాపోలు రమేశ్, వాణి దంపతులు నాలుగేళ్ల క్రితం నకిరేకల్ పట్టణానికి బతుకుదెరువు కోసం వచ్చారు. స్థానిక మార్కెట్ రోడ్డులోని వడ్డెర కాలనీ ఎగువన నివసిస్తున్నారు. వీరికి సాత్విక్ (9), రుత్విక్ (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ స్థానిక ఏవీఎం టాలెంట్ స్కూల్లో చదువుతున్నారు. తల్లి స్థానిక బట్టల షాపులో పని చేస్తుండగా.. తండ్రి ఇంట్లోనే మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడు రుత్విక్కు జ్వరం రావడంతో పెద్ద కుమారుడు సాత్విక్‌ను కూడా సోమవారం పాఠశాలకు పంపించలేదు. రోజూమాదిరిగానే తల్లి తాను పనిచేసే దుకాణానికి వెళ్లింది. తండ్రి మగ్గం నేస్తూ ఇంట్లోనే ఉన్నాడు. ఆడుకుంటూ అదృశ్యం... సాత్విక్, రుత్విక్‌తోపాటు చుట్టుపక్కల పిల్లలంతా కలసి ఇంటి బయట ఆడుకుంటున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో సాత్విక్ అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని రుత్విక్ తన తండ్రికి చెప్పడంతో అర్ధరాత్రి వరకు చుట్టుపక్కల అంతా గాలించారు. అయినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో రమేశ్ ఇంటి రేకులపై సాత్విక్ మృతదేహం ఉన్న విషయాన్ని పక్కింటికి చెందిన విజయ్‌కుమార్ గమనించి, ఆ విషయాన్ని బాలుడి తండ్రికి తెలిపాడు. వెంటనే ఇంటి పైకి ఎక్కి కుమారుడి మృతదేహాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. చిత్రహింసలు పెట్టి తమ కుమారుడిని చంపారన్న సంగతి తెలిసి తల్లిదండ్రులిద్దరూ కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు బాలుడిని తీసుకెళ్లి కొట్టి చంపి, మృతదేహాన్ని తీసుకొచ్చి వారి ఇంటిపైనే పడేశారని సీఐ గౌరినాయుడు వెల్లడించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని అతడి తండ్రి చెబుతున్నార ని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బాలుడి మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
వ్యక్తి దారుణ హత్య..దహనం
కల్హేర్(నారాయణఖేడ్): గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి కాల్చివేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మండలంలోని బాచేపల్లి సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో జరిగింది. మృతదేహం పూర్తిగా కాలిపోయింది. అస్తిపంజరం, ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. కాలిన శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ నల్లమల రవి, కంగ్టి సీఐ తిరుపతియాదవ్, కల్హేర్ ఎస్ఐ సాయిరాం, ఏఎస్ఐ లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బండరాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భవిస్తున్నారు. హంతకులను పట్టుకునేందుకు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను రంగంలోకి దించారు. క్లూస్‌టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది. అక్కడే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పూడ్చివేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయిరాం తెలిపారు. -
పాతబస్తీలో యువకుడి దారుణ హత్య
పాతబస్తిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బహాదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడిమీర్ ఆలం చెరువు వద్ద ఆదివారం వెలుగుచూసింది. చెరువు సమీపంలోని పొదల్లో ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తితో దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. -
భార్యను నరికి చంపిన భర్త.
-
భార్యను నరికి చంపిన భర్త
నిద్రిస్తున్న భార్య పై గొడ్డలితో దాడి చేసి అతికిరాతకంగా హతమార్చాడో భర్త. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని భాగ్యన గర్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న జమాల్ అలి తన భార్య హుసేన్‌బీ(28) నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి నరికేశాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్యకు గల కారణాలు తెలియ రాలేదు. -
యువకుడి హత్య
బి.కొత్తకోట మండలం బండారువాండ్లపల్లి గ్రామంలో ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లి పట్టణం శివాజీ నగర్ కు చెందిన శ్రీనివాసులు కుమారుడు మనోజ్ కుమార్(20)ను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. మృత దేహాన్ని పక్కనే పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఆదివారం అటుగా వెళ్లిన పశువుల కాపర్లు.. గమనించి.. గ్రామంలోని వీఆర్‌ఓకి సమాచారం అందించారు. వీఆర్వో ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలం నుంచి రెండు మద్యం బాటిళ్లు, ఓ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ ఆధారంగా హత్యకు గురైన యువకుడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు తెలియ రాలేదు.