బి.కొత్తకోట మండలం బండారువాండ్లపల్లి గ్రామంలో ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లి పట్టణం శివాజీ నగర్ కు చెందిన శ్రీనివాసులు కుమారుడు మనోజ్ కుమార్(20)ను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. మృత దేహాన్ని పక్కనే పొదల్లో పడేసి వెళ్లిపోయారు.
ఆదివారం అటుగా వెళ్లిన పశువుల కాపర్లు.. గమనించి.. గ్రామంలోని వీఆర్ఓకి సమాచారం అందించారు. వీఆర్వో ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలం నుంచి రెండు మద్యం బాటిళ్లు, ఓ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ ఆధారంగా హత్యకు గురైన యువకుడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు తెలియ రాలేదు.