ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం
కల్హేర్(నారాయణఖేడ్): గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి కాల్చివేసిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మండలంలోని బాచేపల్లి సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో జరిగింది. మృతదేహం పూర్తిగా కాలిపోయింది.
అస్తిపంజరం, ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. కాలిన శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ నల్లమల రవి, కంగ్టి సీఐ తిరుపతియాదవ్, కల్హేర్ ఎస్‌ఐ సాయిరాం, ఏఎస్‌ఐ లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బండరాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భవిస్తున్నారు.
హంతకులను పట్టుకునేందుకు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను రంగంలోకి దించారు. క్లూస్‌టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది. అక్కడే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పూడ్చివేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయిరాం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment