చీటింగ్‌ తహసీల్దార్‌ | Tahsildar Arrested Cheating Case In Nalgonda | Sakshi
Sakshi News home page

చీటింగ్‌ తహసీల్దార్‌

Published Thu, Oct 4 2018 9:01 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

Tahsildar Arrested Cheating Case In Nalgonda - Sakshi

తహసీల్దార్‌ లింగాల సుధ

సాక్షి, సిటీబ్యూరో : చిట్టీల పేరుతో చీటింగ్‌ చేసినందుకు యాదాద్రిభువనగిరి కలెక్టరేట్‌లోని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలోని  తహసీల్దార్‌ లింగాల సుధను బుధవారం హైదరాబాద్‌ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు అరెస్టు చేశారు. ఈమె సమీప బంధువులు, స్నేహితులతో కలిసి సనత్‌నగర్‌ కేంద్రంగా అక్రమంగా చిట్టీల దందా నిర్వహించడంతోపాటు రూ.2 కోట్లు స్వా హా చేసినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు. విధులకు సైతం హాజరుకాకుండా ఆరు నెలలుగా పరారీలో ఉన్న సుధను ఏసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది.

అధికారం అండతో...
లింగాల సుధ గతంలో నిజామాబాద్‌ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. ఈమెతో పా టు న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె భర్త మల్లేశం, ఆమె సోదరి డాక్టర్‌ శ్రావ్య, డిప్యూటీ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీ సర్‌ మనోహర్‌రావు, హెడ్‌–మాస్టర్‌ విజయమ్మ తదితరులతో కలిసి సనత్‌నగర్‌ కేంద్రంగా చిట్టీల దందా ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగులై ఉండి నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా దాదాపు 15 ఏళ్ల పాటు ఈ దందా నిర్వహించారు. వీరంతా ప్రభుత్వ ఉ ద్యోగులు, కీలక వ్యక్తులు కావడంతో ఆయా విభా గాల్లో పనిచేసిన పలువురు ఉద్యోగులు వీరి వద్ద చిట్టీలు కట్టారు. ఖాతాదారులు చిట్టీ పాడుకున్నప్పటికీ నగదు వారికి ఇవ్వకుండా రూ.2 వడ్డీ ఇస్తామంటూ తమ వద్దే ఉంచుకునేవారు. కాగా మనో హర్‌రావు, విజయమ్మ కొన్నాళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు.
 
చెక్కులు బౌన్స్‌ కావడంతో..
కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.25 లక్షల వరకు చిట్టీలు నిర్వహించారు. కొందరు ఖా తాదారులకు సుధ తదితరులు తమ పేర్లతో ఏర్పాటు చేసిన ఉమ్మడి బ్యాంకు ఖాతా ద్వారా చెక్కుల రూపంలో చెల్లింపులు చేశారు. అత్యధికుల నుంచి మాత్రం అధిక వడ్డీ ఆశచూపి డిపాజిట్లు స్వీకరించారు. వీరి చిట్టీల దందా కొన్నాళ్ల పాటు సజావుగానే సాగినా... ఆపై కథ అడ్డం తిరిగింది. వీరిచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో 35 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చే శారు. దీనికి సంబంధించి నమోదైన రెండు కేసులను దర్యాప్తు చేసిన సీసీఎస్‌ పోలీసులు గతంలో మనోహర్‌రావు, విజయమ్మలను అరెస్టు చేయగా... మల్లేశం, శ్రావ్య న్యాయస్థానం నుంచి ముం దస్తు బెయిల్‌ పొందారు. పోలీసుల వేట ముమ్మరం కావడంతో తహసీల్దార్‌ సుధ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
 
ఏడాదిగా విధులకు దూరం
పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని భావించిన తహశీల్దార్‌ సుధ విధులకు దూరంగా ఉన్నారు. గతేడాది జూలైలో ఆరు నెలల పాటు ప్రత్యేక సెలవు పెట్టారు. ఆపై సెలవులను పొడిగిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితురాలు కావడంతో ఏసీపీ జి.వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం ఆమె కోసం వేట ముమ్మరం చేసింది. సు ధ కదలికలపై కీలక ఆధారాలు సేకరించి మంగళవారం అర్ధరాత్రి ఆమె షెల్టర్‌ తీసుకున్న ప్రాం తంపై దాడి చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్‌కు తరలించి విచారించగా, సుధ నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్టు కు తరలించారు. చిట్టీల  ద్వారా సంపాదించిన సొమ్ముతో నిందితులు తెలుగు రాష్ట్రాల్లో స్థిరాస్తులు కూడ బెట్టుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు.  వీరి వలలో పడి సర్వం పోగొట్టుకున్న బాధితుల్లో అనేక మంది ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన వారు కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement