కత్తులతో పొడిచి.. రాయితో మోది | Brutal Murder of a Man in Nagaram Village | Sakshi
Sakshi News home page

కత్తులతో పొడిచి.. రాయితో మోది

Published Tue, Oct 22 2019 8:36 AM | Last Updated on Tue, Oct 22 2019 8:37 AM

Brutal Murder of a Man in Nagaram Village - Sakshi

ఫణిగిరి : ఘటనాస్థలిలో కారు పక్కన యాకయ్య మృతదేహం

నాగారం (తుంగతుర్తి) : ఓ వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. ఈ ఘటన  ఫణిగిరి శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బంధులువు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన కొమ్ము యాకయ్య అలియాస్‌ రమేశ్‌ (33) హైదరాబాద్‌లోని వారసిగూడలో పశువుల వ్యాపారం చేస్తూ అక్కడే కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు. పదిరోజుల క్రితం యాకయ్య తన స్వగ్రామమైన జలాల్‌పురానికి వచ్చి ఇంటికి   మరమ్మతులు చేయిస్తున్నాడు.  ఫణిగిరి గ్రామానికి చెందిన తన రెండో భార్య కొమ్ము మమత మేనమామ వివాహానికి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి సూర్యాపేటకు వెళ్లారు. అక్కడ మూరగుండ్ల సురేష్‌తో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం కొమ్ము యాకయ్య తన భార్య, పిల్లలు, అత్తతో కలిసి  ఫణిగిరి గ్రామానికి కారులో వచ్చాడు. అనంతరం కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లి వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు.

మాటేసి.. వేటేసి..
రాత్రి 8గంటల సమయంలో ఇంటినుంచి కారులో బయటికి వెళ్లిన కొమ్ము యాకయ్య గ్రామశివారులో బంధం మైసమ్మ ఆలయం వద్ద గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి కారులో కూర్చొని మద్యం సేవిస్తున్నాడు. అక్కడే మాటు వేసి ఉన్న ఫణిగిరికి చెందిన మూరగుండ్ల సురేష్, జలాల్‌పురానికి చెందిన కొమ్ము చింతయ్య  వచ్చి మద్యం సేవిస్తున్న యాకయ్య కుడివైపు చాతిపై కత్తితో పొడిచారు  వెంటనే యాకయ్య వారినుంచి తప్పించుకునేందుకు కారు అద్దాలను బిగించుకుని 100 ఫోన్‌ చేశాడు. దుండగులు వెంటనే కారు అద్దాలను ధ్వంసం చేసి మరోమారు కత్తితో యాకయ్యపై దాడిచేశారు. వెంటనే యాకయ్యను కారు నుంచి కిందికి లాగి బండరాయితో తలపై మోదడంతో ప్రాణా లు విడిచాడు. 100 కాల్‌ నుంచి సమాచారం అందుకున్న స్థాని క పోలీసులు వర్షం పడుతుండటంతో పరిసర ప్రాంతాలను గాలించి రాత్రి 11.30సమయంలో మృతదేహాన్ని గుర్తించారు.  పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.   యాకయ్య తల్లీ కొమ్ము సో మలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

పాత కక్షలతోనే..
యాకయ్య, మూరగుండ్ల సురేష్‌లు గతంలో ఇద్దరు కలిసి పశువుల వ్యాపారం చేసే వారు. ఇద్దరి మధ్య లావాదేవీల్లో తేడా రావడంతో ఐదు నెలల క్రితం ఇద్దరి మధ్య ఘర్షణ చో టు చేసుకుంది. దీంతో సురేష్‌ ఎలాగైన యాకయ్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకుని అదునుకోసం వేచి చూస్తున్నాడు.  యాకయ్య ఐదు నెలల అనంతరం బం«ధువు వివాహ నిమిత్తం ఫణిగిరికి రావడంతో సురేష్‌ ఇదే అదునుగా భావించాడు. తొలుత శుభకార్యం జరుగుతున్న సూర్యాపేటలోనే యాకయ్యతో  ఘర్షణ పడ్డాడు. అక్కడ పలువురు సముదాయించడంతో మిన్నకుండి పోయాడు. ఆ తర్వాత  గ్రామంలో పథకం ప్రకారం కాపుకాసి మరికొందరితో కలిసి ఘాతుకానికి తెగబడ్డాడు. 

నలుగురు కలిసి హత్యచేశారా? 
మద్యం తాపించాలంటూ రాత్రి 8గంటల సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌చేసి యాకయ్యను గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడే సురేష్, చింతయ్యతోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేష్, చింతయ్యలతో పాటు బయటికి తీసుకెళ్లిన వ్యక్తి, మరో వ్యక్తి మొత్తం నలుగురు కలిసి పథకం ప్రకారం యాకయ్యను హత్యచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నలుగురిలో ప్రధాన నిందితులు సురేష్, చింతయ్యలు పరారీలో ఉండగా...మరో ఇద్దరు వ్యక్తులను పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement