Crime: అతను డ్రైవింగ్‌.. ఆమె స్నాచింగ్‌! | Nalgonda Woman On Scooty Try To Chain Snatch Video Viral | Sakshi
Sakshi News home page

నల్లగొండ: అతను డ్రైవింగ్‌.. ఆమె స్నాచింగ్‌!

Published Fri, Jan 12 2024 7:52 PM | Last Updated on Sat, Jan 13 2024 10:04 AM

Nalgonda Woman On Scooty Try To Chain Snatch Video Viral - Sakshi

నల్లగొండ: చైన్‌ స్నాచింగ్‌లు మగాళ్లే చేస్తారని భ్రమలో ఉన్నవాళ్లకు ఈ వార్త ఓ కనువిప్పు.  ఓ యువతి ఓ యువకుడి సహకారంతో గొలుసు దొంగతనాలకు ప్రయత్నించింది. ఈ క్రమంలో స్థానికులు కేకలు వేయడంతో వాళ్లిద్దరూ పలాయనం చిత్తగించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పడు వాట్సాప్‌లలో వైరల్‌ అవుతోంది. 

శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి.. యువతి స్కూటీ మీద వచ్చారు. అక్కడ ఓ మహిళ మెడలో గొలుసును వెనక ఉండే యువతి లాగే యత్నం చేసింది. సదరు మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. స్థానికులు బైక్‌పై ఉన్నవాళ్లను వెంబడించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఛేజ్‌ చేస్తూ వాళ్లను వీడియో తీశారు.అయితే వాళ్లు దొరకలేదు. 

ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మర్రిగూడ పోలీసులు.. ఆ ఇద్దరినీ పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement