chain snatch
-
Crime: అతను డ్రైవింగ్.. ఆమె స్నాచింగ్!
నల్లగొండ: చైన్ స్నాచింగ్‌లు మగాళ్లే చేస్తారని భ్రమలో ఉన్నవాళ్లకు ఈ వార్త ఓ కనువిప్పు. ఓ యువతి ఓ యువకుడి సహకారంతో గొలుసు దొంగతనాలకు ప్రయత్నించింది. ఈ క్రమంలో స్థానికులు కేకలు వేయడంతో వాళ్లిద్దరూ పలాయనం చిత్తగించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పడు వాట్సాప్‌లలో వైరల్ అవుతోంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి.. యువతి స్కూటీ మీద వచ్చారు. అక్కడ ఓ మహిళ మెడలో గొలుసును వెనక ఉండే యువతి లాగే యత్నం చేసింది. సదరు మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. స్థానికులు బైక్‌పై ఉన్నవాళ్లను వెంబడించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఛేజ్ చేస్తూ వాళ్లను వీడియో తీశారు.అయితే వాళ్లు దొరకలేదు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మర్రిగూడ పోలీసులు.. ఆ ఇద్దరినీ పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. -
చైన్‌స్నాచింగ్ చేసి.. పారిపోతూ..చెరువుగుంతలో పడి..
ముత్తారం(మంథని): ఒకచోట చోరీకి యత్నించి విఫలమయ్యాడు.. వెంటనే మరో ప్రాంతానికి వెళ్లి ఓ మహిళ మెడలో చైన్ తెంపాడు. వెంటనే బాధితురాలు కేకలు వేయగా, పారిపోతూ చెరువుగుంతలో పడి ఓ పాత నేరస్తుడు మృతి చెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదంబండ గ్రామపంచాయతీ పరిధి సర్వారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..రామగిరి మండలం బేగంపేటకు చెందిన బొంతల రాజ్‌కుమార్(35) తన కుటుంబంతో కలిసి గోదావరిఖనిలో ఉంటున్నాడు. గురువారం బైక్‌పై ముత్తారం మండలం మచ్చుపేట నుంచి సర్వారం వైపు వెళుతున్నాడు. ఆ గ్రామానికి చెందిన కాంచర్ల పుష్పలత చేనుకు నడుచుకుంటూ వెళుతుండగా, బైక్‌పై రావాలని రాజ్‌కుమార్ కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో ఆమె గొంతు పట్టుకున్నాడు. బాధితురాలు కేకలు వేయడంతో సమీప చేనులో ఉన్న గొర్రె నవీన్ రావడంతో రాజ్‌కుమార్ అక్కడినుంచి పరారయ్యాడు. ఆ తర్వాత సర్వారంలోని సజ్జనపు మమత కిరాణం వద్దకు చేరుకున్నారు. బైక్‌లో పెట్రోల్ పోయించుకోగా, మిగతా చిల్లర ఇవ్వడానికి మమత ఇంట్లోకి వెళ్లింది. ఆమెను వెంబడించి మెడలోనుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు లాక్కు న్నాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకు న్నారు. వారిని చూసి రాజ్‌కుమార్ బైక్ అక్కడే వదిలేసి మైదంబండ వైపు పరుగెత్తాడు. ఆ దారిలో చెరువుగుంత కనిపించక అందులో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడికి భార్య సింధూజ, కుమారుడు అక్షిత్‌కుమార్(2) ఉన్నారు. నిందితుడిపై 12 కేసులు రాజ్‌కుమార్‌పై పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 12 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనాలతోపాటు పలు ఇళ్లలో చోరీలు చేశాడు. ఈక్రమంలో 2022న రామగిరిలో అరెస్టయి కరీంనగర్ జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై విడుదలయ్యాక గోదావరిఖనికి మకాం మార్చాడు. బైక్‌లో కారంపొడి ప్యాకెట్ చోరీలు చేయాలనే పక్కా ప్లాన్‌తోనే రాజ్‌కుమార్ తన బైక్‌లో కారంపొడి ప్యాకెట్లు ఉంచాడు. మమత మెడలో నుంచి పుస్తెలుతాడు లాక్కొని, పారిపోయేందుకు వీలుగా రోడ్డుపై బైక్ సిద్ధంగా ఉంచుకున్నాడు. అక్కడి నుంచి కాల్వశ్రీరాంపూర్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ, చోరీ సమయంలో స్థానికులు వెంబడించడంతో దారి మార్చుకున్నాడు. చెరువు వైపు పరుగెత్తాడు. అక్కడ చెట్ల ఆకులు, తీగలు, నాచు ఉండడంతో చెరువులోని నీరు కనిపించలేదు. అటువైపు వెళ్లొద్దని స్థానికులు హెచ్చరిస్తున్నా వినకుండా వెళ్లి పూడికతీసిన గుంతలో పడి చనిపోయాడు. -
పట్టపగలే చైన్ స్నాచింగ్
♦ బరితెగించిన అగంతకుడు ♦ ఉపాధ్యాయురాలి మెడలో గొలుసు తెంచుకుని బైక్‌పై పరారీ ♦ వెంటాడినా దొరకలేదు గుంటూరు ఈస్ట్ : రద్దీగా ఉన్న జీడీసీసీ బ్యాంకు ముందు నడిచి వెళుతున్న ఉపాధ్యాయురాలి మెడలోని బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి తెంచుకుని పరారైన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బ్రాడీపేట 2/10లో నివసించే రజనీ.. అదే రోడ్డులోని శారదానికేతన్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లి భోజనం చేసి తిరిగి వెళుతున్నారు. జీడీసీసీ బ్యాంకు సమీపంలోకి రాగానే గుర్తు తెలియని ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై ఆమెకు సమీపంగా వచ్చి మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును తెంచేందుకు ప్రయత్నించాడు. రజని తీవ్రంగా ప్రతిఘటించారు. ఆమెను బలవంతంగా తోసివేసి పరారయ్యేందుకు యత్నించాడు. పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని సుమారు 10 మంది పట్టుకునేందుకు ప్రయత్నిం చారు. ద్విచక్ర వాహనానికి అడ్డుగా వచ్చినవారిని ఢీకొట్టేందుకు యత్నించాడు. దీంతో వారు పక్కకు తొలగడంతో వేగంగా దూసుకు వెళ్లాడు. 4/14 లైన్ చేరుకునే సరికి అగంతకుడి వాహనం వేగానికి అదుపు తప్పింది. అయినా వేగంగా కదిలి ముందుకు దూసుకుపోయాడు. స్థానికులు ద్విచక్రవాహనాలపై పట్టుకునేందుకు వెంబడించినా ఫలితం లేకపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.