ప్రణయ్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తదితరులు
మిర్యాలగూడ : పరువు కోసం పెరుమాళ్ల ప్రణయ్‌ని హత్య చేసిన నిందితులను ఉరితీయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతను పరామర్శించారు. ప్రణయ్ హత్యను సీబీఐచే విచారణ జరిపిం చాలని డిమాండ్ చేశారు. మారుతీరావు అక్రమంగా సంపాదించిన సొమ్ముతను ప్రభుత్వం జప్తు చేయాలన్నారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుండా మల్లేష్, పశ్య పద్మ, జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
దళితులపై దాడులు పెరుగుతున్నాయి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 19 మంది దళితులు హత్యలకు గురయ్యారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షడు రమణ విమర్శించారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ప్రణయ్, అమృతలు ప్రేమిం చుకున్న పాపానికి ప్రణయ్‌ని హత్య చేశారని అన్నారు. ఆడపిల్లకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్, కేటీఆర్ మాట్లాడడం లేదన్నారు. ప్రభుత్వం అమృతకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు కోటి రూపాయల ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. రోమ్ నగరం కాలిపోతుంటే చక్రవర్తి పిడేల్ వాయించినట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందన్నారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎండీ. యూసుఫ్, రాష్ట్ర కార్యనిర్వహాక కా ర్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాధినేని శ్రీని వాస్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, పెద్దిరెడ్డి రాజా, బీఎన్‌రెడ్డి, అంజయ్య, కాసుల సత్యం, పతూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి : టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పెరుమాళ్ల ప్రణయ్‌ని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భార్య అమృత, తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలతను పరామర్శించారు. అదేవిధంగా ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని రాత్రి కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్‌ని హత్య చేయడం దారుణమైన సంఘటన అని అన్నారు. హంతకులను సమాజం క్షమించదన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు పురుషోత్తం, గాదె ఇన్నయ్య, రతన్‌రావు, పరుశురామ్, జిల్లా కన్వీనర్ గవ్వా విద్యాధర్‌రెడ్డి, నాయకులు శ్రీధర్, క్రాంతికుమార్, లింగస్వామి, అంజయ్య, పరందాములు, ప్రేమ్‌కుమార్, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.
కులహంకార హత్య : ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు
ప్రణయ్‌ను కులహంకారంతో హత్య చేశారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. బుధవారం ప్రణయ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ప్రణయ్ భార్య అమృత, తల్లితదండ్రులను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రేమించినందుకు కిరాయి హంతకులతో హత్య చేయిం చడం దారుణమన్నారు. అమృతకు అండగా ఉంటామని, ఆమెకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు. ఆ యన వెంట మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముండ్లగిరి కాంతయ్య, మాలమహానాడు జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, నాయకులు అన్నవరపు కిషోర్, డాక్టర్ ప్రవీణ్, నర్సింహ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
అమృతకు అండగా నిలుస్తాం : సినీ దర్శకుడు పీసీ ఆదిత్య
అమృతకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, ప్రణయ్‌ని హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని సినీ దర్శకుడు పీసీ ఆదిత్య డిమాండ్ చేశారు. బుధవారం ప్రణయ్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రణయ్ భార్య అమృతను తల్లిదండ్రులను పరామర్శించారు. దేశంలోనే సంచలనం కలిగించి ఈ హత్యలో నిందితులు తప్పించుకోవడానికి వీలులేదన్నారు. ఆయన వెంట లఘుచిత్ర దర్శకులు కలీం తదితరులు ఉన్నారు.
ఇలాంటివి పునరావృతం కావొద్దు : జనసేన రాష్ట్ర నాయకుడు జగడం సుధాకర్
పరువు హత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు జగడం సుధాకర్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృత తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ప్రణయ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణయ్ హత్య హేయమైన చర్యఅని, నిందితులందరికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జనసేన పార్టీ నాయకులు రుషికేశ్వర్‌రాజు, ప్రవీణ్, నిమ్మల వెంకన్న, వేణు, శివ, శ్రీనివాస్‌నాయుడు, శ్రీనునాయక్, అశోక్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment