సాక్షి, మిర్యాలగూడ: ఓ రైస్‌మిల్లు వ్యాపారి సుమారు రూ.5కోట్లకు ఎగనామం పెట్టి ఉడాయించాడు. ఈ ఘటన మిర్యాలగూడలో ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు, విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని వాసవీనగర్‌కు చెం దిన కోటగిరి వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా రైస్ మిల్లులో అకౌంటెంట్‌గా చేరి వ్యాపారంలో అనుభవం గడిం చాడు. దీంతో ఆరేళ్ల క్రితం కుక్కడం సమీ పంలో ఓ రైస్‌మి ల్లును నెలకొల్పి వ్యాపారం ప్రారంభించాడు. సహచర వ్యాపారుల వద్ద జీరో విధానంలో వరిపొట్టు, తవుడు, బియ్యం, కొనుగోలు చేశాడు. ఎంతో కాలంగా ఉన్న తన నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి సహచర వ్యాపారుల వద్ద రూ. కోట్లలో అప్పులు చేశాడు. కారణాలైతే తెలియవు కానీ రెండు నెలల క్రితమే పట్టణంలో ఉన్న తన స్థిర ఆస్తులలన్నింటినీ విక్రయించాడు. అనంతరం వారం రోజుల క్రితం భార్యాబిడ్డలను తీసుకుని కనిపించకుండా పోయాడు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అతడి ఆచూకీ లేక పోవడంతో రూ. లక్షల్లో వెంకటేశ్వర్లుకు అప్పులిచ్చిన వ్యాపారులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment