Rice miller
-
కస్టం మిల్లింగ్ కహానీ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా నుంచి ఇవ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్‌ను మిల్లర్లు ఇప్పటివరకు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. జిల్లాలోని మొత్తం 62 పారాబాయిల్డ్, 218 ముడిరైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులకు పౌరసరఫరాల శాఖ ద్వారా కేటాయించిన ధాన్యానికి సంబంధించి కస్టం మి ల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తుతోంది. వివరాల్లోకి వెళ్తే.. 2022–23 వానాకాలం సీజన్లో జిల్లాలోని మిల్లర్లకు 6,03,872 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. ఈ ధాన్యానికి గాను మిల్లర్లు 4,09,535 మెట్రిక్ టన్నుల కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే 3,87,529 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా 22,005 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సిన సీఎంఆర్ పెండింగ్ ఉంది. ► 2022–23 యాసంగి సీజన్ విషయానికి వస్తే 6,35,190 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇచ్చారు. ఇందుకు సంబంధించి 4,32,264 మెట్రిక్ టన్నుల కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 1,22,980 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చారు. ఇంకా 3,09,284 మెట్రిక్ టన్నులు సీఎంఆర్ ఇవ్వాల్సింది పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఇష్టం మిల్లర్లు కొందరు ఇష్టం వచ్చినట్లు మొండికేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,31,289 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉంది. కొత్త ప్ర భుత్వం ఈ నెలాఖరులోగా మొత్తం సీఎంఆర్ ఇవ్వాలని గడువు పొడిగించింది. అయితే మిల్ల ర్లు మాత్రం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ధాన్యం మాఫియా.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన భారీ అక్రమం ఇటీవల బయటకొచ్చింది. బోధన్‌లోని మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే నాలుగు రైస్‌మిల్లులకు 2021–22 యాసంగి, 2022–23 వా నాకాలం సీజన్లకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఇందుకు గాను 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ (కష్టం మిల్లింగ్ రైస్) కింద తిరిగి పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. మిల్లింగ్ చేసి మిగిలిన సీఎంఆర్ బియ్యం ఇవ్వడం తనకు సాధ్యం కాదని షకీల్ చెప్పాడు. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని ఏఆర్ ఇండస్ట్రీస్(ఎడపల్లి), ఆర్‌కామ్ ఇండస్ట్రీస్(వర్ని), అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్(వర్ని), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) అనే మరో నాలుగు మిల్లులకు కేటాయించినట్లు చూపారు. ఇందుకు సంబంధించి ధాన్యం తమ మిల్లులకు బదిలీ అయినట్లు ఆ నాలుగు మిల్లులకు చెందిన యజమానులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఇందులో ఏఆర్ ఇండస్ట్రీస్ నుంచి 2,000 మెట్రిక్ టన్నులు, ఆర్‌కామ్ నుంచి 1,000 మెట్రిక్ టన్నులు, అబ్దుల్ ఐ నుంచి 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం (సీఎంఎఆర్) మాత్రమే పౌరసరఫరాల శాఖకు ఇచ్చారు. ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. మిగిలిన 26వేల మెట్రిక్ ట న్నుల సీఎంఆర్ బి య్యాన్ని ఇవ్వాలని పౌ రసరఫరాల శాఖ అధికారులు అడుగగా, షకీల్ మిల్లుల నుంచి తమకు బియ్యం రాలేదని చెబుతుండడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఒత్తిడితోనే ధాన్యం బదిలీ అయినట్లు తాము రాసిచ్చినట్లు నలుగురు మిల్లర్లు చెబుతుండడం విశేషం. ఈ విషయమై రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రైస్‌మిల్లుల్లో జరుగుతున్న మోసపూరిత కార్యకలాపాలు, అవినీతి అక్రమాలు బహిర్గతం చేయడానికి ఏకకాలంలో కేంద్ర విజిలెన్స్ విచారణ చేప ట్టాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవేంద్ర సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం ఇచ్చారు. సీఎంఆర్ ఇవ్వకపోతే కఠిన చర్యలు ప్రభుత్వానికి తిరిగివ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్‌ను మిల్లర్లు తక్షణమే ఇవ్వకపోతే కఠినచర్యలు తీసుకుంటాం. కొందరు మిల్లర్ల వైఖరి కారణంగా ప్రభుత్వానికి, రైతుల కు, ఇతర మిల్లర్లకు చెడ్డపేరు వస్తోంది. కొందరు మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా బయట ప్రాంతాల్లో అమ్ముకున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయి. – సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే -
రూ.46 కోట్ల ధాన్యం మాయం!
సాక్షి, హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యానికి, మిల్లింగ్ అయిన ధాన్యానికి, నిల్వ ఉన్న వడ్లకు లెక్క సరిపోలేదు. రూ.46 కోట్లకు పైగా విలువైన ధాన్యం మాయం అయినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రెండు విడతల తనిఖీల్లో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ధాన్యం మాయమైన మిల్లులు,తమ బృందాలకు సహకరించని మిల్లర్లపై చర్యలకు ఎఫ్‌సీఐ సిఫార సు చేసింది. ఆయా మిల్లులు నుంచి కస్టమ్ మిల్లింగ్‌రైస్ (సీఎంఆర్) కానీ, డీసీపీ బియ్యం కానీ తీసుకోవద్దనిప్రభుత్వాన్ని కోరింది. చుక్కలు చూపించిన మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లుల్లో సరిగా ఉన్నాయా? ఎంత పరిమాణంలో మిల్లింగ్ చేశారు? ఇచ్చిన సీఎంఆర్‌కు, నిల్వ ఉన్న ధాన్యానికి లెక్క సరిపోతోందా? అనే విషయాలపై ప్రత్యక్ష తనిఖీలు జరిపేందుకు గత మార్చి, మే నెలల్లో రైస్ మిల్లులకు వెళ్లిన ఎఫ్‌సీఐ అధికారులకు మిల్లర్లు ధాన్యానికి బదులు ‘చుక్కలు’చూపించిన సంగతి తెలిసిందే. మొదటి విడత తనిఖీల సమయంలో చాలాచోట్ల అడ్డదిడ్డంగా ఉన్న బస్తాలను లెక్కించడానికి వీలు కాలేదు. తర్వాత ‘తనిఖీలకు వస్తున్నాం... ధాన్యం సంచులను లెక్కించేందుకు వీలుగా అందుబాటులో ఉంచండి’అని సమాచారం ఇచ్చినా... 593 మిల్లుల యజమానులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. ‘అన్ కౌంటబుల్’(లెక్కించడానికి వీల్లేని స్థితిలో) ధాన్యం నిల్వలను రాశులు పోసిన మిల్లర్లు అక్రమాలు బయట పడకుండా చేశారు. అయితే మొత్తం మీద రూ.46 కోట్ల విలువైన ధాన్యం మాయం అయినట్లు ఎఫ్‌సీఐ వర్గాలు వెల్లడించాయి. తొలివిడతలో రూ.35 కోట్లు.. మలివిడతలో రూ.11 కోట్లు రాష్ట్రంలోని 3,278 మిల్లుల్లో 2020–21 యాసంగి, గత (2021–22) వానాకాలం సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ లెక్కలు తేల్చేందుకు రైస్‌మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలు చేయా లని ఎఫ్‌సీఐ గడచిన మార్చి లో నిర్ణయించింది. అప్పట్లో 958 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. 40 మిల్లుల్లో రూ.35.58 కోట్ల విలువైన 18,156 టన్నుల ధాన్యం గాయబ్ అయినట్లు గుర్తించారు. మిగతా 2,320 మిల్లుల్లో గత నెలలో ప్రత్యక్ష తనిఖీలు జరిపేందుకు నిర్ణయించి, పౌరసరఫరాల శాఖకు సమాచారం ఇచ్చారు. 62 బృందాలను ఏర్పాటు చేసి 124 మందితో తనిఖీలు జరిపించారు. అయితే ఈ తనిఖీలకు అనేకచోట్ల మిల్లర్లు సహకరించలేదు. కాగా 63 మిల్లుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఎఫ్‌సీఐ అధికారులు ధ్రువీకరించారు. రూ.11 కోట్ల విలువైన 5,515 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్క తేలకుండా పోయింది. నిరుటి యాసంగికి సంబంధించిన ధాన్యం బస్తాలు లెక్కించడానికి వీల్లేకుండా 101 మంది మిల్లర్లు సహాయ నిరాకరణ చేయగా, గత వానాకాలం ధాన్యానికి సంబంధించి మరో 492 మిల్లులు సహకరించలేదు. మిల్లర్లు సహకరించడంతో పాటు ధాన్యం లెక్కించేందుకు వీలుగా ఉండి ఉంటే మరిన్ని అక్రమాలు వెలుగు చూసి ఉండేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ మిల్లర్లపై చర్యలు తీసుకోండి ధాన్యం మాయం చేసిన మిల్లులతోపాటు, ఎఫ్‌సీఐకి సహకరించని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఎన్.అశోక్ కుమార్ మంగళవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష తనిఖీల్లో సరైన విధానంలో ధాన్యం బస్తాలను లెక్కించేందుకు వీలుగా మిల్లర్లను ఆదేశిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని లేఖలో ఎఫ్‌సీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. మిల్లుల నుంచి సీఎంఆర్ కింద సెంట్రల్ పూల్‌కు ఇచ్చే బియ్యం కానీ, డీసీపీ కింద రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునే బియ్యం గానీ తీసుకోవద్దని çసూచించింది. ఒకవేళ డీసీపీ పద్ధతిలో వాడుకున్నా, తాము సెంట్రల్ పూల్ లెక్కల్లోకి తీసుకోమని çసూచించింది. -
ధాన్యం ట్రాక్టర్లతో రైతుల రాస్తారోకో
కామారెడ్డి రూరల్: రైస్‌మిల్లర్ల తీరుతో రైతన్నకు కోపం వచ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని సరంపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం ధాన్యం ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయా యి. సరంపల్లి గ్రామం రైతుల వద్ద నుంచి రెండ్రోజుల క్రితం వచి్చన 200 బస్తాల ధాన్యాన్ని చిన్నమల్లారెడ్డిలోని ఓ రైస్‌మిల్ యాజమాన్యం గురువారం వెనక్కి పంపించింది. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగా రు. కొనుగోలు కేంద్రంలో నిబంధనల ప్రకా రం రైతులు ధాన్యం విక్రయించారు. ఆ కేంద్రం నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపించగా మిల్లర్.. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. కేం ద్రం నిర్వాహకులు చూసినప్పుడు తేమ శాతం నిబంధనలకు లోబడే ఉందని, వర్షం రావడం.. వాతావరణంలో మార్పు కారణంగా తేమ శాతం పెరిగి ఉండొచ్చని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే రైస్ మిల్లర్ల ఆగడాలు మితిమీరి పోతున్నా యని రైతులు ఆరోపించారు. వాతావరణంలో మార్పుల వల్ల ధాన్యంలో తేమ శాతం పెరిగితే తప్పు తమదా? అని రైతులు ప్రశ్నించారు. దేవునిపల్లి ఎస్ఐ రవికుమార్, రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ తదితరులు రైతులను సముదా యించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
రైతులకు కుచ్చుటోపి.. రూ.60 కోట్లు ఎగ్గొట్టిన రైస్ మిల్లర్
-
రైతులకు కుచ్చుటోపి.. రూ.60 కోట్లు ఎగ్గొట్టిన రైస్ మిల్లర్
సాక్షి, విజయవాడ: ఎనికేపాడులో రైతులకు ఓ రైస్‌మిల్లర్ రూ.60 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టాడు. పల్లవి రైస్‌మిల్లర్ విశ్వనాథం చేతిలో రైతులు మోసపోయారు. విజయవాడలోని రామ మందిరం వద్ద విశ్వనాధం ఇంటికి తెలుగు రాష్ట్రాల్లోని బాధిత రైతులు చేరుకుంటున్నారు. రైతులకు డబ్బులు ఎగ్గొట్టి విశ్వనాథం తప్పించుకుని తిరుగుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కాకినాడ, కృష్ణాజిల్లా, తెలంగాణ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీగా బాధితులు ఉన్నట్లు సమాచారం. పల్లవి రైస్ మిల్లు వ్యాపారం పేరిట ధాన్యం కొని దాదాపుగా రూ. 60 కోట్లు ఎగవేసినట్లు తెలిసింది. 2015లో 54 మంది బకాయిపడ్డ రైతులు, వ్యాపారులకు 25 కోట్లు చెల్లిస్తానని విశ్వనాధం అగ్రిమెంట్ చేశారు. విశ్వనాథం ఇంటికి తాళం వేసి ఉండటంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. -
మిర్యాలగూడలో రైస్‌మిల్లు వ్యాపారి కుచ్చుటోపీ..!
సాక్షి, మిర్యాలగూడ: ఓ రైస్‌మిల్లు వ్యాపారి సుమారు రూ.5కోట్లకు ఎగనామం పెట్టి ఉడాయించాడు. ఈ ఘటన మిర్యాలగూడలో ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు, విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని వాసవీనగర్‌కు చెం దిన కోటగిరి వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా రైస్ మిల్లులో అకౌంటెంట్‌గా చేరి వ్యాపారంలో అనుభవం గడిం చాడు. దీంతో ఆరేళ్ల క్రితం కుక్కడం సమీ పంలో ఓ రైస్‌మి ల్లును నెలకొల్పి వ్యాపారం ప్రారంభించాడు. సహచర వ్యాపారుల వద్ద జీరో విధానంలో వరిపొట్టు, తవుడు, బియ్యం, కొనుగోలు చేశాడు. ఎంతో కాలంగా ఉన్న తన నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి సహచర వ్యాపారుల వద్ద రూ. కోట్లలో అప్పులు చేశాడు. కారణాలైతే తెలియవు కానీ రెండు నెలల క్రితమే పట్టణంలో ఉన్న తన స్థిర ఆస్తులలన్నింటినీ విక్రయించాడు. అనంతరం వారం రోజుల క్రితం భార్యాబిడ్డలను తీసుకుని కనిపించకుండా పోయాడు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అతడి ఆచూకీ లేక పోవడంతో రూ. లక్షల్లో వెంకటేశ్వర్లుకు అప్పులిచ్చిన వ్యాపారులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. -
మంత్రి అండతో అక్రమాలు.. మిల్లర్లపై విజిలెన్స్ దాడులు
సాక్షి, విజయవాడ: జిల్లా వ్యాప్తంగా పలు రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలపై విజిలెన్స్ దాడులు చేపట్టాయి. ధాన్యం కొనుగోళ్ళలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీ అండతో రైస్ మిల్లర్లు ఓ మాఫియాగా మారారు. దళారీల నుంచి భారీగా ధాన్యం కొనుగోళ్ళు చేస్తున్నారు. కానీ, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం సేకరించినట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఎమ్మెల్యే అండతో రైస్ మిల్లర్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. హనుమాన్ జంక్షన్ లోని రెండు మిల్లుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ధాన్యాన్ని పట్టుకున్నారు. రెవెన్యూ సిబ్బందితో స్థానిక రైతులు పండించిన ధాన్యంగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి మోసం చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు వీఆర్వోలపై వేటు వేశారు. సిపిల్ సప్లై అధికారులకూ ఈ అవినీతిలో వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రూ.కోట్లలో రైతుల పేరిట పక్కదారి పట్టినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
మృత్యు యంత్రం
శ్రీకాకుళం, రాజాం/సంతకవిటి: వరి నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో చిక్కుకుని మహిళా కూలీ దుర్మరణం చెందిన ఘటన సంతకవిటి మండలం పనసపేట వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్తివలస గ్రామానికి చెందిన రాజాపు ఈశ్వరమ్మ(30) తోటి మహిళలతో కలిసి వ్యవసాయ నూర్పిడి పనుల నిమిత్తం పనసపేట వెళ్లింది. అక్కడ వరిపంటను నూర్పిడిచేస్తున్న సమయంలో ఇంజిన్ ఫ్యాన్‌లో చీర చిక్కుకోవడంతో ప్రమాదానికి గురైంది. బలమైన గాయాలయ్యాయి. వెంటనే తోటి కూలీలు స్పందించి రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. ఈమె మృతదేహాన్ని స్వగ్రామం మిర్తివలసకు తీసుకొ చ్చిన అనంతరం సంతకవిటి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజాం రూరల్ సీఐ రుద్రశేఖర్, సంతకవిటి హెచ్‌సీ ప్రసాదరావులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. సాక్షరభారత్ ఎత్తివేయడంతో.. ఈశ్వరమ్మ గతంలో మిర్తివలస సాక్షరభారత్ విలేజ్ కోఆర్డినేటర్‌గా పనిచేసేవారు. భర్త రమణారావు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఏడాది కాలంగా సాక్షరాభారత్ పథకం నిలిపివేయడంతో గౌరవ వేతనాలు రాక కూలి పనులకు వెళ్లడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం కూలి పనులకని పనసపేట వెళ్లి మృత్యుఒడిలోకి చేరిపోయింది. బోరున విలపించినచిన్నారులు.. ప్రమాదంలో మృతిచెందిన ఈశ్వరమ్మకు ఏడేళ్ల కుమారుడు సాయి(2వ తరగతి), ఐదేళ్ల కుమారుడు ప్రదీప్(1వ తరగతి) ఉన్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన వీరు తిరిగి వచ్చేటప్పటికి ఇంటి వద్ద జనాలు ఉండడాన్ని చూసి బిత్తరపోయారు. జనం మధ్యలో తల్లి అచేతనంగా పడి ఉండడం, తండ్రి రమణారావు బోరున విలపించడాన్ని చూసి వీరు కూడా కన్నీరుమున్నీరుగా విలపించారు. అమ్మా లే..అంటూ తల్లి మృతదేహంపై పడి ఏడ్చిన తీరు గ్రామస్తులను కంట తడిపెట్టించింది. అందరికీ చేదోడువాడోదుగా ఉంటూ జీవనం సాగించిన ఈశ్వరమ్మ మృతిని గ్రామస్తులు, కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
సర్కారు ధాన్యం సొంతానికి తాకట్టు
ఓ రైస్‌మిల్లర్ నిర్వాకం రూ.కోటిన్నర రుణం పొందిన వైనం ఫిర్యాదుపై అధికారుల విచారణ బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరిక ఏలూరు (టూ టౌన్) : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని ఒక రైస్‌మిల్లు యజమాని తాకట్టు పెట్టి ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.కోటి 50 లక్షలు రుణం తీసుకున్నాడు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో రుణం ఇచ్చిన బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు చేస్తామని బెదిరించడంతో పాటు రైస్మిలర్ను కూడా అధికారులు హెచ్చరించారు. కామవరపుకోట మండలంలోని రావికంపాడు, కామవరపుకోట, మొండూరు గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 2014 ఖరీఫ్‌లో రైతుల నుంచి సేకరించిన రూ.80 లక్షల విలువైన 35వేల 564 క్వింటాళ్ల ధాన్యాన్ని తడికలపూడిలోని శ్రీనివాసా రైస్‌మిల్లుకు పంపించారు. 2015 జూలైలోపు ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఏలూరులోని ఎఫ్‌సీఐ గోడౌన్‌కు తరలించాలని జిల్లా పౌరసరఫరాల అధికారులు రైస్‌మిల్లర్ ఈడ్పుగంటి వెంకట శ్రీనివాసరావును ఆదేశించారు. రైస్‌మిల్లు యజమాని ధాన్యాన్ని రైస్‌మిల్లులో కాకుండా గోడౌన్లో భద్రపరిచి తానే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు చూపి రాజమండ్రిలోని ఒక ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.కోటి 50 లక్షల రుణం తీసుకున్నారు. దీనిపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులకు సమాచారం అందడంతో బ్యాంకు మేనేజర్‌కు నోటీసు పంపిస్తూ ప్రభుత్వ ధాన్యానికి రుణం ఎలా ఇచ్చారంటూ కేసు పెడతామని హెచ్చరించారు. బ్యాంకు మేనేజర్, సిబ్బంది తడికలపూడి చేరుకుని రైస్‌మిల్లర్‌ను నిలదీశారు. అతను రెండు రోజుల్లో రుణం మొత్తం కట్టివేస్తానని చెప్పారు. పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా రైస్‌మిల్లు యజమాని శ్రీనివాసరావుకు నోటీసు జారీ చేసి ధాన్యం ఆడించి బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోడౌన్‌కు తరలించాలని ఆదేశించారు. పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ వి.వలసయ్య ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం తడికలపూడి రైస్‌మిల్లుకు వెళ్లి కామవరపుకోట తహసిల్దార్ నర్సింహరాజు సమక్షంలో విచారణ నిర్వహించారు. ఐకేపీ కేంద్రాల ద్వారా పంపించిన 35 వేల 564 క్వింటాళ్లకు గాను దానిలో 10 వేల క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ నెలాఖరులోపు ఎఫ్‌సీఐ గోడౌన్‌కు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని పంపిణీ చేస్తానని రైస్‌మిల్లు యజమాని వద్ద హామీపత్రంతో పాటు బ్యాంకు గ్యారంటీ తీసుకున్నారు. ఈ విచారణలో పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ సీహెచ్ రామానుజమ్మ, ఫుడ్ ఇన్స్పెక్టర్ కె.రమేష్‌కుమార్, ఏజీపీవో టి.శివప్రసాద్, సివిల్ సప్లయ్స్ డీటీ శ్రీనివాస్, ఆర్ఐ సుబ్బారావు, వీఆర్వో మురళీ పాల్గొన్నారు. -
బియ్యం దొంగలు
- అధికారుల మొక్కుబడి చర్యలు - రైస్ మిల్లర్ల సంఘం తీరుపై విమర్శలు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలనే నిబంధనను లెక్క చేయడం లేదు. ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేసిన వారిపై చర్యల విషయంలో అధికారులు అలసత్వం చూపిస్తున్నారు. ధాన్యం స్వాహాపరులకు రైస్ మిల్లర్ల సంఘం పెద్దలు అండగా నిలుస్తున్నారు. ఇలా అధికారులు, సంఘం ముఖ్యనాయకుల అండదండలతో ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేసే వారి సంఖ్య ప్రతి సీజనుకు పెరుగుతోంది. రెండేళ్ల క్రితం ప్రభుత్వ వరి ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లలో 12 మంది ఇప్పటికీ బియ్యం ఇవ్వడం లేదు. ఇలా రూ.14.80 కోట్ల విలువైన ధాన్యం మిల్లర్లపాలైంది. ఈ బియ్యాన్ని తిరిగి రాబట్టే విషయంలో పౌర సరఫరాల సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా మిగిలిన మిల్లర్లు ఇదే రకంగా వ్యవహరించేందుకు సహకరిస్తున్నారు. ఎగవేతపై చర్యలు శూన్యం 2013-14 మార్కెటింగ్ సీజనులో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతుల నుంచి ప్రభుత్వం 1.88 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. పౌర సరఫరాల శాఖ ఈ ధాన్యాన్ని జిల్లాలోని 89 రైస్ మిల్లులకు ఇచ్చింది. ఈ ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు వెంటనే బియ్యంగా మార్చి లెవీ సీజనులోపు ఇవ్వాలి. నిబంధన ప్రకారం.. ప్రతి క్వింటాల్ ధాన్యానికి 68 కిలోల బియ్యాన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాలి. సాంకేతికంగా ఏటా అక్టోబరు 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు లెవీ మార్కెట్ సీజను ఉంటుంది. 2013-2014 లెవీ సీజను 2014 సెప్టెంబరు 30తో ముగిసింది. గడువు ముగిసి ఏడాది కావస్తున్నా 12 మంది రైస్ మిల్లర్లు ఇప్పటికీ పూర్తిస్థాయిలో బియ్యం ఇవ్వలేదు. ఈ 12 మంది మిల్లర్లకు ఇచ్చిన ధాన్యంలో 7,416 టన్నుల ధాన్యం దుర్వినియోగమైనట్లు తేలింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 5,043 టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతాయి. ఈ బియ్యాన్ని, వీటికి సంబంధించిన ఖాళీ సంచులను మిల్లర్లు ఇవ్వలేదు. బియ్యం, బస్తా సంచుల విలువ కలిపి రూ.14.80 కోట్లు ఉంటుందని పౌర సరఫరాల సంస్థ లెక్కగట్టింది. ప్రభుత్వానికి ఇంత మొత్తాన్ని ఎగవేస్తున్న వారిపై తూ.తూ.మంత్రంగా కేసులు నమోదు చేయడం తప్పితే బియ్యం రాబట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. -
‘రైస్ మిల్లర్స్’ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
హన్మకొండ చౌరస్తా : జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలకు ఆదివారం నామినేషన్ల పర్వం మొదలైంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితోపాటు కోశాధికారి పదవులకు జరిగే ఎన్నికలకు నామినేషన్లు దాఖ లు చేయడానికి ఎన్నికల అధికారి రెండు రో జులపాటు వెసులుబాటు కల్పించారు. మొదటి రోజు అధ్యక్ష పదవికి ఆరుగురు, ప్రధాన కార్యదర్శి కోసం ఆరుగురు, కోశాధికారి పదవి కోసం రెండు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి టి.చంద్రప్రకాష్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్ర 4 గంటల వరకు కొనసాగిన నామినేషన్ల ఘట్టం రాజ కీయ ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. నామినేషన్లకు అవకాశం ఉండడంతో మరి కొందరు వేసేందుకు అవకాశం కనిపిస్తోంది. ఆరుగురిలో ముగ్గురు మాజీలే... ప్రస్తుతం అధ్యక్ష పదవికి ఆరుగురు నామినేషన్లు వేయగా.. అందులో ముగ్గురు మాజీ అధ్యక్షులే కావడం గమనార్హం. ప్రస్తుతం దేవునూరి అంజయ్య జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, తోట సంపత్‌కుమార్, మేచినేని సంపత్‌కుమార్ గతంలో జిల్లా అధ్యక్షులుగా కొనసాగారు. కాగా, రాష్ట్ర కార్యవర్గంలో పెద్ది వెంకటనారాయణగౌడ్ కీలక పదవిలో కొనసాగారు. పి.పాండురంగయ్య, గోనెల రవీం దర్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు దాఖ లు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం నామినేషన్లు వేసిన వారిలో ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, వి.వెంకటేశ్వర్లు, గండి రమేష్, వి.వేణుగోపాల్, బూశి ప్రభాకర్‌రెడ్డి, పాండురంగయ్య ఉండగా, కోశాధికారి కోసం దుబ్బ రమేష్, వేణుగోపాల్ నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఉపసంహరణకు 30న చివరి తేదీ కావడంతో అదేరోజు అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. -
సంక్షేమం గోవిందా!
పథకాల నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఆహారభద్రత’కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త భాష్యం చెప్పింది. ఇల్లు, భూమి, వృత్తిని ‘కార్డు’కు లింకు పెట్టింది. ఐదెకరాల పైబడి పొలం ఉంటే రేషన్‌కార్డుకు అర్హులు కాదని నిర్దేశించింది. ఈ నిబంధనలే కాదు.. ఆఖరికి ఆర్థికంగా స్థితిమంతులుగానో.. మీ జీవనశైలి బాగున్నట్లు విచారణాధికారి పసిగట్టినా ఆహారభద్రత కార్డుకు అనర్హులుగానే పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు జిల్లా యంత్రాంగానికి అందాయి. దీనికి అనుగుణంగా ఆహారభద్రత, సామాజిక పింఛన్ల దరఖాస్తులను విచారిస్తున్న అధికారుల బృందాలకు సరికొత్త ని‘బంధనాలు’ తలనొప్పిగా మారాయి. మరోవైపు ప్రభుత్వం విధించిన ఆంక్షలతో జిల్లాలో భారీఎత్తున కార్డులకు కోత పడే అవకాశం కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చేవారు కాదు. తాజా నియమావళి మేరకు కేవలం రోజువారీ వేతన కూలీలు, అసంఘటిత రంగ కార్మికులకు పథకాలు వర్తించేలా ఉండడం గమనార్హం. ప్రస్తుతం 9.38లక్షల తెల్లరేషన్ కార్డులుండగా.. తాజా పరిశీలనతో కొత్తవాటి సంగతేమోగానీ ఉన్నవాటికి సైతం ఎసరు వచ్చేలా కనిపిస్తోంది. పల్లెబాట! నిన్న, మొన్నటివరకు సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణలో బిజీగా ఉన్న అధికారులు తాజాగా దరఖాస్తులపై క్షేత్ర పరిశీలనకు ఉపక్రమించారు. డోర్‌టుడోర్ తిరుగుతూ అర్హతను నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యారు. సర్కారు విధించిన కట్టుదిట్టమైన మార్గనిర్దేశకాలను అనుసరించి అధికారులు పరిశీలన ప్రక్రియను చేపట్టారు. అవకతవకలు జరిగితే అందుకు సంబంధించి తనిఖీ అధికారిని బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అధికారులు పకడ్బందీగా పరిశీలన చేపడుతున్నారు. జిల్లాలో 17.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆహార భద్రతకు సంబంధించి 12.67లక్షల దరఖాస్తులు రాగా, సామాజిక పింఛన్ల కోసం 3.69లక్షలు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణకు 1.5లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో పింఛన్లకు సంబంధించి 28వేల దరఖాస్తులు పరిశీలించారు. వీరికి సంక్షేమం లేనట్టే..! * రెండున్నర ఎకరాల తరి, ఐదెకరాల చెలక భూమికి పైబడి లేదా రెండూ కలిపి ఐదెకరాలు ఉన్నవారు ఆహార భద్రత కార్డుల(ఎఫ్ఎస్సీ)కు అనర్హులు. * ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ/ ప్రైవేటు సంస్థలు/ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, డాక్టర్లు/ కాంట్రాక్టర్లు/ వృత్తినిపుణులు /స్వయం ఉపాధి పొందేవారికి ఈ పథకం వర్తించదు. * బడా వ్యాపారులు (ఉదా: నూనె, రైస్ మిల్లర్లు, పెట్రోల్ బంకు, రిగ్గు యజమానులు, దుకాణ దారులు, ప్రభుత్వ పెన్షనర్లు, స్వాతంత్య్ర సమరయోధ పెన్షనర్లు).. * నాలుగు చక్రాల వాహనదారులకు సైతం సంక్షేమ ఫలాలు అందవు. * ఇవేకాకుండా తనిఖీ అధికారుల పరిశీలనలో దరఖాస్తు దారుడి జీవనశైలి, వృత్తి, ఆస్తులను పరిగణనలోకి తీసుకుని అర్హతను నిర్ణయిస్తారు. * పింఛన్లకు సంబంధించి వితంతు, వికలాంగ పింఛన్లకు మినహా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పింఛన్ వర్తిస్తుంది. * 65 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే వృద్ధాప్య పింఛన్లకు అర్హులు. ఇందుకు దరఖాస్తుదారులు వయసు ధ్రువీకరణ పత్రం (జనన, ఓటరు కార్డు, ఆధార్ కార్డు) తనిఖీ అధికారికి చూపాలి. * నిబంధనల ప్రకారం ధ్రువ పత్రం సమర్పించకుంటే దరఖాస్తుదారుడి కుటుంబ సభ్యుల వయసు ఆధారంగా పరిశీలనాధికారి ధ్రువీకరించవచ్చు. * వితంతు పింఛన్ దరఖాస్తుదారులు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. * వికలాంగులు సదరమ్ క్యాంపులో పంపిణీ చేసిన వికలత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. 40శాతం వైకల్యం మించిన వారే దీనికి అర్హులు. -
జోగుతున్న నిఘా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని సరుకుల ధరలూ రెట్టింపయ్యాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆహార పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఫలితంగా ఉత్పత్తుల తక్కువగా వచ్చే పరిస్థితి ఉండటంతో వ్యాపారులు, రైస్ మిల్లర్లు నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తున్నారు. దీంతో ధరల పెరుగుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయినా పౌర సరఫరాల శాఖ, నిఘా విభాగం అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. అక్రమ నిల్వలు, సర్కారు సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతున్న విషయంలో పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు ఎక్కువగా జరగాలి. జిల్లాలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. గత ఏడాది తనిఖీలో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గాయి. ఇదే సమయంలో నిత్యావసరాల ధరలు మాత్రం పెరగడం గమనార్హం. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు పెరగకపోవడానికి జిల్లా ఉన్నతాధికారుల ఉదాసీనతే కారణంగా కనిపిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ(రేషన్)లో పారదర్శకత పెంచడం, నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చర్యలు లక్ష్యంగా జిల్లాలో ఉన్న ఆహార సలహా కమిటీ(ఎఫ్ఏసీ) సమావేశం నిర్వహణపైనా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి ఎఫ్ఏసీ సమావేశం జరగాల్సి ఉంది. చివరగా 2014 జనవరిలో జరిగింది. తనిఖీలు నామమాత్రమే.. పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో ఐదుగురు సహాయ సరఫరా అధికారులు(ఏఎస్వో), ఐదుగురు ఆహార ఇన్స్పెక్టర్లు, ఉప తహశీల్దార్లు ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక ధాన్యం కొనుగోలు అధికారి(జీపీవో), సహాయ అధికారి ఉన్నారు. నిత్యావసరాల అక్రమ నిల్వలను నిరోధించడం, ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను నివారించడం లక్ష్యంగా వీరు నిత్యం తనిఖీలు నిర్వహించాలి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు చేయాలి. ఇలా ప్రత్యేకంగా తనిఖీలు, దాడులు చేసే పౌర సరఫరాల అధికారులు సిబ్బంది కాకుండా ప్రతి మండంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉంటారు. ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు ఉంటారు. వీరు కూడా ఈ పనులు చేయవచ్చు. నిత్యావసర సరుకుల బడా వ్యాపారులతో, రైస్ మిల్లర్లతో అధికారులకు, కింది స్థాయి ఉద్యోగుల వరకు ఉన్న సత్సంబంధాల కారణంగా ఎవరూ తనిఖీలు చేయడంలేదని తెలుస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేసినా... సంబంధిత వ్యాపారులకు అధికారుల నుంచి ముందుగానే సమాచారం అందుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సరఫరా చేసే సరుకులను కొనుగోలు చేయాలంటే కొన్ని ఇతర వస్తువులు తీసుకోవాల్సిందేనని కొందరు రేషన్ డీలర్లు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినా పౌర సరఫరాల అధికారులు స్పందించడంలేదు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ సైతం దాడులు, తనిఖీల విధులను దాదాపుగా పక్కనబెట్టింది. ఏదైనా ఫిర్యాదు వస్తే కింది స్థాయి సిబ్బంది అక్కడి వెళ్లి, తర్వాత పౌర సరఫరాల అధికారులకు సమాచారం ఇచ్చి రావడం జరుగుతుందే తప్ప చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. -
పేదల బియ్యం పక్కదారి!
- డీలర్లు.. మిల్లర్ల మాయాజాలం - అక్రమంగా తరలుతున్న రూ.కిలో బియ్యం - గుట్టుగా మహారాష్ట్రకు తరలింపు - మన మిల్లుల్లోనూ రీసైక్లింగ్ - అనంతరం మార్కెట్‌కు... - పౌరసరఫరాల మంత్రి ఇలాఖాలోనే అవినీతి దందా! సాక్షి, కరీంనగర్ : రేషన్ బియ్యం అక్రమంగా తరలుతోంది. బియ్యం అక్రమ రవాణాలో డీలర్ల పాత్ర కీలకంగా మారింది. కొంత మంది డీలర్లు తమకు వచ్చిన బియ్యాన్ని కోటా నుంచి మిగుల్చుకుంటే.. ఇంకొందరు పేదలకు ఇవ్వాల్సిన దాంట్లో సగం కోటా ఇవ్వకుండా స్థానికంగా ఉండే రైస్‌మిల్లర్లు, దళారులు, వ్యాపారులకు రూ.10 నుంచి రూ.15కు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు దళారులు, వ్యాపారులు నేరుగా ఆ బియ్యాన్ని రోడ్డు, రైలు మార్గాల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి (మరపట్టి) జిల్లాకు తీసుకొచ్చి.. మళ్లీ మనకే బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.23 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై రెవెన్యూశాఖ రైల్వేస్టేషన్లపై నిఘా పెట్టి అప్పుడప్పుడు దాడులు చేస్తుండగా అక్రమంగా తరలుతోన్న క్వింటాళ్లకొద్దీ బియ్యం పట్టుబడుతోంది. అధికారుల దాడులు తెలుసుకున్న కొందరు రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా బియ్యాన్ని రైళ్లలో సరిహద్దు దాటిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలోనే జరిగే రీసైక్లింగ్ ఇప్పుడు మన జిల్లాలోని పలు రైస్‌మిల్లుల్లోనూ జరుగుతున్నట్లు సమాచారం. కొందరు డీలర్లు మిల్లర్లకు ఐదారు రూపాయలకు కిలో బియ్యం విక్రయిస్తున్నారు. మిల్లర్లు.. ఆ బియ్యాన్ని స్థానిక మిల్లుల్లో మరపట్టించి.. బహిరంగ మార్కెట్లో కిలో రూ.23 నుంచి రూ.27కు అమ్ముతున్నారు. రేషన్‌బియ్యం పక్కదారి పట్టడం వెనక పలువురు రేషన్ డీలర్లు.. కాంట్రాక్టర్లతోపాటు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల పొట్ట కొట్టి బియ్యాన్ని పక్కదారి పట్టించిన చాలామంది డీలర్లు ఇప్పటికే లక్షలు గడించారు. ఇటు మిల్లర్లూ అదే బియ్యాన్ని మార్కెట్లో అధిక ధరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. తాజాగా ఈ నెల 15న.. విజిలెన్స్ అధికారులు కరీంనగర్‌లోని ఓ రైస్ మిల్లులో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జిల్లాలో జరుగుతున్న అవినీతి దందాకు అద్దం పడుతోంది. అదే రాత్రి జూలపల్లి మండలంలో 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. అక్రమంపై కొరడా ఝుళిపించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగడంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. సాక్షాత్తూ.. రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే అవినీతి దందా ఈ స్థాయిలో జరగడం చర్చనీయాంశమైంది. తరలింపు తీరిది! బియ్యం అక్రమ రవాణాకు రైలు, రోడ్డు మార్గాలను ఎంచుకున్న దళారులు, వ్యాపారులు డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని ప్లాస్టిక్ బస్తాల్లో నింపి రోజుకు కొన్ని బస్తాల చొప్పున గుట్టుచప్పుడు కాకుండా జమ్మికుంట, పొత్కపల్లి, ఓదెల, కొలనూరు, పెద్దపల్లి, రాఘవపురం, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బెల్లంపల్లి, రేచినిరోడ్డు, ఆసిఫాబాద్ రోడ్డు, కాగజ్‌నగర్, సిర్పూర్ రైల్వేస్టేషన్ల నుంచి తరలిస్తారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా విరూర్ స్టేషన్‌కు బియ్యాన్ని చేరవేస్తారు. బస్తాలన్నీ ఒకే ప్రాంతం నుంచి లోడ్ చేసే సమయం ఉండకపోవడం.. అందరికీ అనుమానం వచ్చే అవకాశాలు ఉండడంతో దళారులు చాకచక్యంగా బియ్యాన్ని లారీలో నింపుకుని జిల్లా పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్లలో కొన్ని, కొన్ని చొప్పున డంప్ చే సుకుంటూ పోతున్నారు. మరో రోడ్డు మార్గాన్ని ఎంచుకున్న వ్యాపారులు జిల్లాలో పలు కేంద్రాలను చేసుకుని సిద్దిపేట- కామారెడ్డి మీదుగా మహారాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తున్నారు. సుల్తానాబాద్, నిమ్మలపల్లి, వేములవాడ నుంచి బియ్యం లారీ ద్వారా పెద్ద ఎత్తున మహారాష్ట్రకు వెళ్తుంది. ఈ దందాతో దళారులకు అన్ని ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.3 లక్షలు మిగులుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. - ఈ నెల 15న కరీంనగర్ మండలం రేకుర్తి నుంచి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా జూలపల్లి మండలం వడ్కాపూర్ శివారులో పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. - 15న జిల్లా కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 99.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. - 12న కొడిమ్యాల నుంచి సిరిసిల్లకు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు వేములవాడలో పట్టుకున్నారు. - 4న.. ఓదెల మండలం కొలనూరులో 15 క్వింటాళ్లు పట్టుకున్నారు. - గత నెల 5న.. సుల్తానాబాద్‌లో ట్రాలీలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని రె వెన్యూ, డీటీసీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. - మే నెలలో సిరిసిల్ల మండలం పెద్దూరు వద్ద 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. - మార్చి 11న.. వేములవాడలో వాహనంలో 23 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. - జమ్మికుంట రైల్వేస్టేషన్ కేంద్రంగా.. రేషన్ బియ్యం రైళ్లో అక్రమంగా మహారాష్ట్రకు తరలుతోంది. మార్చి 29న జమ్మికుంటలో 10 క్వింటాళ్లు.. నాలుగు నెలల వ్యవధిలో 50 క్వింటాళ్ల బియ్యం మహారాష్ట్రకు తరలిస్తుండగా.. రెవె న్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
‘రూపాయి’తో కోటి!
రూపాయికే కిలో బియ్యం ఎంతోమంది పేదోళ్ల కడుపులు నింపుతోంది. కానీ.. అదే బియ్యం పక్కదారి పడితే.. కొంతమంది గద్దలకు కోట్లు సంపాదించి పెడుతోంది. ఆ బియ్యం పేదోళ్లకు చేరితే న్యాయం.. ‘పెద్దోళ్ల’ చేతుల్లో పడితే అక్రమం. జిల్లాలో చాలా వరకు అక్రమం.. అన్యాయమే జరుగుతోంది. రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లాలో కొందరు రైస్‌మిల్లర్లు రేషన్‌దుకాణాల ద్వారా బియ్యాన్ని కొనుగోలు చేసి.. రైస్‌మిల్లుల్లోనే రీ సైక్లింగ్ చేసి.. సంచులను మార్చేసి ఎఫ్‌సీఐకి లెవీ రూపంలో తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలకూ చేరవేస్తున్నారు. రూపాయికి కిలో బియ్యాన్ని రూ. 25కు అమ్ముతూ కోట్లు సంపాది స్తున్నారు. ఇందుకు అర్సపల్లి రైస్‌మిల్లులో రూ.28లక్షల విలువ గల రేషన్ బియ్యం పట్టుబడటమే ఉదాహరణ. వీరికి అధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కిలో బియ్యం ధర బహిరంగ మార్కెట్లో రూ.32ల నుంచి రూ.40లకు పైగా ధర పలుకుతోంది. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం సరఫరా చేస్తుంది. మార్కెట్లో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.25పైనే పలుకుతోంది. రేషన్ బియ్యం సరఫరాను అడ్డుకోవాల్సిన అధికార వ్యవస్థ చేతులెత్తేయడం అక్రమార్కులకు వరంలా మారింది. రూపాయికి సరఫరా చేసే కిలో బియ్యంతో కోట్లు సంపాదిస్తున్నారు. ఈ అక్రమ దందా జిల్లా అధికారులు సూత్రధారులుగా.. దళారు లు, మిల్లర్లు పాత్రధారులుగా నడుస్తున్నట్లు ఆరోపణలూ వస్తున్నాయి. ప్రతినెలా జిల్లాకు కనీసం 10,720.944 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం కేటాయిస్తారు. ఒక్కోసారి బియ్యం కోటా పెరుగుతుంది. జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా 7,67,960 కార్డులకు బియ్యాన్ని సరఫరా చేస్తారు. అయితే ఇదివరకే సరఫరా అవుతున్న రేషన్‌బియ్యంలో నాలుగో వంతు ‘నల్లబజారు’కు తరలుతుందన్న ఆరోపణలున్నాయి. బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే లాభాలు భారీ స్థాయిలో వస్తుండటంతో అక్రమాలు పెరిగే ప్రమాదం ఉంది. తాజాగా శనివారం అర్సపల్లిలోని రైస్‌మిల్ గోదాముల్లో సుమారు రూ.28 లక్షల విలువ చేసే రేషన్ బియ్యం నిల్వ చేసి.. రీసైక్లింగ్ చేస్తున్న వ్యవహారం బట్టబయలైంది. దీంతో వ్యాపారులు, రైసుమిల్లర్ల చీకటి బాగోతం బయటపడింది. ఇలా జిల్లావ్యాప్తంగా అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలున్నా అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోంది. ఫిర్యాదులు వచ్చినప్పుడే స్పందిస్తున్నారన్న ఆరోపణలు న్నాయి. ‘బియ్యం’లో అందరికీ వాటాలు..! రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న బాగోతంలో అందరికీ వాటాలు అందుతున్నాయన్న ప్రచారం ఉంది. పౌరసరఫరాల శాఖలోని ‘నిఘా’ అధికారులు కొందరికీ ఇది ‘మామూలే’నన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా నిత్యవసర వస్తువులు నల్లబజారుకు తరలుతున్నాయని బహిరంగంగా చర్చ జరుగుతున్నా సదరు అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిలో బియ్యం రెండు రూపాయలున్న తరుణంలో నాలుగో వంతు నల్లబజారుకు తరలించిన వ్యాపారులకు ఇప్పుడు కిలోపై ఇంకో రూపాయి అదనంగా లభిస్తుంది. సాధారణంగా ప్రభుత్వం లబ్ధిదారుడికి రూపాయికి కిలో బియ్యం ఇస్తుండగా.. లబ్ధిదారుడి పేరుతో స్థానికంగా ఉండే వ్యాపారులు రూ.7 నుంచి రూ.9 కిలో చొప్పున కొంటున్నారు. వ్యాపారులు మధ్యస్థాయి టోకు వ్యాపారికి కిలో రూ.12కు విక్రయిస్తుండగా, మధ్యస్థాయి వ్యాపారి సిండికేట్‌కు రూ.15లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అక్కడ మిల్లర్లు, దళారులు ప్రవేశించి రీమిల్లింగ్, రీ సైక్లింగ్ ప్రక్రియ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)కి పంపిస్తుండటం గమనార్హం. భూమి గుండ్రగా ఉందన్న రీతిలో సాగుతున్న ఈ అక్రమ దందా ద్వారా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో.. వివిధ మార్గాల ద్వారా మళ్లీ అక్కడికే వెళ్తున్నాయి. కానీ ఏడాదిలో కోట్ల రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. రే షన్ బియ్యానికి ‘లెవీ’ రంగు జిల్లావ్యాప్తంగా చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న రూపాయికి కిలో బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు వ్యాపారులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. 16 మండల స్థాయి నిల్వ కేంద్రాల(ఎంఎల్ఎస్ పాయింట్లు) ద్వారా 7,67,960 కార్డుల లబ్ధిదారులకు సరఫరా చేసేందకు రేషన్ దుకాణాలకు బియ్యం తరలిస్తారు. బాగా సాన్నిహిత్యం ఉన్న గోదాం ఇన్చార్జి ఉంటే.. గోదాముల స్థాయిలోనే బియ్యం చేతులు మారుతాయి. లేదంటే రేషన్ బియ్యానికి సంబంధించి గోనెసంచులు మార్చడం, పాలిష్ పట్టి తరలిస్తున్నారని తెలిసింది. గోదాముల నుంచి రేషన్ దుకాణానికి తరలించకుండా బియ్యాన్ని అక్రమ వ్యాపారులు ఏజెంట్ల ద్వారా టోకున విక్రయిస్తున్నట్లు తెలిసింది. నెలవారీగా వచ్చే బియ్యం కోటా నుంచి కొందరు డీలర్లు సిండికేట్‌గా ఏర్పడి గోదాము నుంచే నేరుగా లారీ లోడు ద్వారా సమీపంలోని రైస్‌మిల్లులకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసిన రైస్‌మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి లెవీ రూపంలో పంపిస్తుండటం విశేషం. అంతేకాకుండా జిల్లాలో వివిధ ప్రాంతాలలో సేకరించిన కొందరు దళారులు రేషన్ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించేందుకు మూమూళ్ల ముట్టజెప్తూ సాలూర, మద్నూరు తదితర చెక్‌పోస్టుల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పేదోడికి చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా ప్రత్యేక నిఘా కమిటీలు ఏం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘తడిసి’ మోపెడు
మోర్తాడ్, న్యూస్‌లైన్: అకాల వర్షంతో తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకువెళ్లేందుకు రైస్ మిల్లర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రా ల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. అటు రైతు లు, ఇటు మిల్లర్ల మధ్య తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారయ్యిందని వారు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ సహకార సంఘాలు, ఇందిర క్రాంతి పథం మహిళా సంఘాల ఆధ్వర్యంలో 289 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. చాలా మంది రైతులు కోతలు పూర్తి కాగానే ధాన్యాన్ని ఈ కేంద్రాలకు తరలించారు. తూకం వేసి, నిర్వాహకులకు అప్పగించి వెళ్లిపోయారు. మామూలుగా అయితే ఈ ధాన్యాన్ని మిల్లర్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అనుకోకుండా మూడు రోజుల క్రితం అకాల వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల నిలువ ఉంచిన దాదాపు ఎనిమిది వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు వీలుగా కాంట్రాక్టర్లు లారీలను పంపాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎన్నిమార్లు మొత్తుకున్నా కాంట్రాక్టర్ లారీలను పంపడం లేదు. కొనుగోలు కేంద్రాలకు గిడ్డంగుల సౌకర్యం లేదు. దీంతో వారు ధాన్నాన్ని రహదారులపైనే కుప్పలుగా పోసి ఉంచారు. వాటిని తరలించడానికి లారీలు రాక పోవడంతో పెద్ద మొత్తంలో నిలువ ఉన్న ధాన్యం తడిసి పోయింది. దీంతో నిర్వాహకులు జిల్లా కలెక్టర్‌కు, జిల్లా ఉన్నతాధికారులకు విషయా న్ని వివరించారు. లారీలు సకాలంలో కొనుగోలు కేంద్రాల వద్దకు రాకపోవడంతో ధాన్యం నీటిపాలైందని వారి దృష్టికి తెచ్చారు. అధికారుల ఒత్తిడితో కాంట్రాక్టర్ లారీలను పంపాడు. అయితే, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తీసుకోవడానికి రైస్ మిల్లర్లు నిరాకరించారు. తడిసిపోయిన ధాన్యంలో కొంత తరుగు తీసేసి తిరిగి లెక్క వేయాలని కోరుతూ వారు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు శనివారం తిప్పి పంపించారు. నష్టం వస్తుందంటూ జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని నిజామాబాద్ మండలం ఖానాపూర్ శివారులోని రైస్‌మిల్లులకు తరలించేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వారు తడిసిన ధాన్యాన్ని తీసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అయోమయం లో పడిపోయారు. ధాన్యంలో తేమ శాతం కొంత ఎక్కువగా ఉన్నా పర్వాలేదని, పూర్తిగా తడిస్తే మాత్రం తాము తీసుకోమని మిల్లర్లు చెబుతున్నారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. తడిసిన ధాన్యానికి మొలకలు కూడా రావడంతో, వాటిని తీసుకుంటే తాము పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారని పేర్కొన్నారు. ఇటు రైతులు తాము తూకం వేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అప్పగించి వెళ్లామని, అక్కడ ఏం జరిగినా వారిదే బాధ్యత అని చెబుతున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. లారీలు ఆలస్యంగా రావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుంటేనే రైతులకు డబ్బు చెల్లింపు జరుగుతుంది. లేకపోతే లేదు. దీంతో రైతులలోనూ ఆందోళన నెలకింది. జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకుని దీనికి ఏదో ఒక పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు. -
మిల్లర్ల జోరు.. రైతు బేజారు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మంచి వర్షాలతో ఈ ఏడాది పంట ఉత్పత్తి పెరిగినా ఈ మేరకు ధాన్యం కొనుగోలును పెంచడంలేదు. ఇలా ధాన్యం రైతుల విషయంలో సర్కారు నిర్లక్ష్యం వ్యాపారులకు, రైస్ మిల్లర్లకు బాగా ఉపయోగపడుతోంది. వరి కోతలు ముమ్మరమైనప్పటికీ సరిపడా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయకపోవడంతో రైతులు రైస్ మిల్లర్లకే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని రైస్ మిల్లర్ల తేమ పేరిట రైతులను నిండా ముంచుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కేంద్ర ప్రభుత్వం ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.1345, సాధారణ రకానికి రూ.1310 మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో రైస్ మిల్లర్లు తేమ సాకుతో క్వింటాల్‌కు రూ.40 నుంచి రూ.50 వరకు మద్దతు ధరలో కోత పెడుతున్నారు. తేమ సాకు చెబుతుండడంతో రైతులు ఎదురు మాట్లాడలేకపోతున్నారు. ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు అంతటా అందుబాటులో లేకపోవడం, కేంద్రాలు ఉన్న చోట చలిలో రెండుమూడు రోజులు పడిగాపులు పడాల్సి ఉండడంతో రైతులు రైస్ మిల్లర్లకే అయినకాడికి అమ్ముకుంటున్నారు. దీంతో ప్రభుత్వం కంటే రైస్ మిల్లర్లే ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు నవంబరు 18 వరకు జిల్లాలో 54 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశాయి. ప్రైవేటు వ్యాపారులు, రైస్ మిల్లర్లు ఇప్పటికే లక్ష టన్నులు కొనుగోలు చేశారు. ప్రభుత్వ సంస్థల కంటే రైస్ మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం రెట్టింపుగా ఉంది. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైస్ మిల్లర్ల పెత్తనాన్ని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. సర్కారు సేకరించిన ధాన్యం కంటే రైస్ మిల్లర్లు కొనుగోలు చేసింది ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటనే విషయంపై అధికారులు వివరణ ఇవ్వడంలేదు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సాధారణంగా ప్రతిరోజు ప్రభుత్వ సంస్థలు, రైస్ మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం లెక్కలను వెల్లడించే పౌరసరఫరాల శాఖ ప్రస్తుత సీజనులో పూర్తి నివేదికలు వెల్లడించడంలేదు. కేవలం ప్రభుత్వ కొనుగోలు లెక్కలను మాత్రమే బహిర్గతం చేస్తోంది. రైస్ మిల్లర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుండడం వల్లే అధికారులు ఇలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైస్ మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. వరి సాగు విస్తీర్ణం పెరగడంతో ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరిగింది. 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది కంటే ఇది మూడు లక్షల టన్నులు అధికం. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లు, గిరిజన సహకార మండలి(జీసీసీ) ద్వారా మొత్తం 609 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి ఆరు లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీజను మొదలై నెలన్నర దాటుతున్నా మూడు సంస్థలు 313 కేంద్రాలనే ఏర్పాటు చేసి, ఇప్పటికి 54 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే రైతుల నుంచి సేకరించాయి. అక్టోబరు ఆరంభం నుంచి 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజను మొదలైంది. మరో రెండు వారాల్లో వరికోతలు పూర్తికానున్నాయి. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం దృష్టిసారించకుంటే రైస్ మిల్లర్లు అన్నదాతలను మరింత దోచుకునే అవకావముంది. -
సర్కారు ధాన్యం హాంఫట్
ప్రభుత్వ ధాన్యాన్ని కొందరు రైస్‌మిల్లర్లు సొంత ఆస్తిగానే భావిస్తున్నారు. ధాన్యం తీసుకుని గడువులోగా బియ్యం అప్పగించాలనే నిబంధనలను అస్సలు పట్టించుకోవడం లేదు. రాజకీయ పలుకుబడితో వరుసగా మూడో ఏడాది కూడా రైస్‌మిల్లర్లు గడువులోగా బియ్యం అప్పగించడం మరిచిపోయారు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రతి ఏటా ప్రభుత్వం ఖరీఫ్ మార్కెట్ సీజన్‌గా భావిస్తుంది. ఖరీఫ్, రబీల్లో వచ్చే ఉత్పత్తులను కలిపి మార్కెటింగ్ పరంగా ఖరీఫ్ సీజన్‌గానే పేర్కొంటుంది. అక్టోబర్ ఆరంభం నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఈ సీజను ఉంటుంది. 2012-13 ఖరీఫ్ మార్కెట్ సీజన్ సోమవారం(సెప్టెంబరు 30)తో ముగిసింది. జిల్లాలోని మిల్లర్లు మాత్రం ఇంకా 14,281 టన్నుల బియ్యాన్ని అప్పగించకుండా తమ వద్దే పెట్టుకున్నారు. రాజకీయ అండదండలతోనే వీరు నిబంధనలను పట్టించుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్ : రెండుమూడేళ్లుగా జిల్లాలో ప్రభుత్వ ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు స్వాహా చేయడం రివాజుగా మారుతోంది. 2012-13 ఖరీఫ్ మార్కెట్ సీజన్లోనూ ఇదే జరిగింది. సోమవారంతో గడువు ముగిసినా ఇప్పటికీ ఇంకా 5056 టన్నుల బియ్యాన్ని రైస్‌మిల్లర్లు తమ వద్దే పెట్టుకున్నారు. 2012-13 ఖరీఫ్, రబీల్లో కలిపి ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు(జీసీసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 7,31,497 టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ఖరీఫ్‌లో 357 మంది మిల్లర్లకు, రబీలో 253 మంది మిల్లర్లకు ఇచ్చింది. రెండు సీజన్లలో కలిపి ధాన్యం తీసుకున్న మిల్లర్లు 4,97,418 టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ఇదంతా గడువు ముగిసేలోపే జరగాలి. ప్రభుత్వ ధాన్యాన్ని సొంత ఆస్తిగా భావించే ధోరణిలో జిల్లాలోని మిల్లర్లు ఉండడంతో ఇంకా 14,281 టన్నుల బియ్యం వీరి వద్దే ఉండిపోయింది. ఇలా మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్న బియ్యం విలువ బహిరంగ మార్కెట్లో ధర ప్రకారం అయితే ఏకంగా రూ.42.84 కోట్లు ఉంటుంది. ఇలా ప్రభుత్వ బియ్యం ఇవ్వని మిల్లర్లు ఖరీఫ్‌లో 10 మంది ఉన్నారు. రబీ సీజన్ బియ్యం ఇవ్వని వారి సంఖ్య రెట్టింపు సంఖ్యలో ఉంది. మన బియ్యం.. లక్ష్యానికి దూరం.. ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద రేషన్ డీలర్ల ద్వారా పేదలకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతపై విమర్శలు వస్తుండడంతో ప్రభుత్వం మన బియ్యం విధానాన్ని తీసుకువచ్చింది. గతంలో రైతుల నుంచి ధాన్యం సేకరించిన రైస్‌మిల్లర్లు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కి బియ్యం లెవీగా ఇచ్చేవారు. ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యాన్ని తీసుకుని పౌర సరఫరాల సంస్థ ద్వారా రేషన్ దుకాణాలకు చేరవేసేది. దీంతో ఒక్కోసారి ఇతర రాష్ట్రాల్లో పండించిన బియ్యం కూడా జిల్లాలో పంపిణీ అయ్యేవి. దీంతో నాణ్యతపై విమర్శలు వచ్చేవి. దీనికి విరుగుడుగా ప్రభుత్వం స్థానికంగా పండిన ధాన్యంతో వచ్చిన బియ్యాన్నే పేదలకు పంపిణీ చేయాలని, దీనివల్ల గోదాములు, రవాణా సమస్యలు తగ్గుతాయని భావించింది. 2012-13 ఖరీఫ్‌లో ప్రారంభించిన ఈ విధానం కింద జిల్లాలో రెండు లక్షల టన్నుల నాణ్యమైన పచ్చిబియ్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉండే జిల్లాలో గడువు ముగిసినా ‘మన బియ్యం’ లక్ష్యం మాత్రం చేరలేదు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఎక్కువగా ఉండడంతో రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా అధిక ధరలకు అమ్ముకున్నారు. దీంతో సోమవారం నాటికి లక్ష్యం కంటే 11 వేల టన్నులు తక్కువగా ప్రభుత్వం సేకరించింది. ఎఫ్‌సీఐకి ఎగనామం రైతుల నుంచి రైస్‌మిల్లర్లు సేకరించిన ధాన్యంతో వచ్చే బియ్యాన్ని భారత ఆహార సంస్థకు లెవీ ఇవ్వడం అనేది జిల్లాలో సరిగా అమలు కావడంలేదు. మన బియ్యం విధానం కింద పచ్చి బియ్యాన్ని మిల్లర్ల ద్వారా తీసుకోవాలని నిర్ణయించగా... జిల్లాలోని 283 మంది మిల్లర్ల నుంచి 2.25 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని భారత ఆహార సంస్థతో లెవీగా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. బహిరంగ మార్కెట్లో లాభాలు వచ్చే పరిస్థితి ఉండడంతో ఎఫ్‌సీఐకి సైతం మిల్లర్లు లక్ష్యం మేరకు బియ్యం ఇవ్వలేదు. ఖరీఫ్ మార్కెట్ సీజన్ గడువు ముగిసిన సెప్టెంబరు 30 నాటికి 1.20 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చారు. మిగిలిన లక్ష్యం ఎప్పటికి పూర్తవుతుందనేది అంతుపట్టని విషయంగా మారింది. -
మంత్రి శాఖలో... ఎంపీ పంచాయితీ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్ముకునేందుకు ప్రభుత్వం రైస్‌మిల్లర్లకు ఇచ్చే ప్రత్యేక ప్రోత్సాహక పర్మిట్ల బదిలీల్లో అక్రమాల వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. పర్మిట్ల బదిలీల్లో మోసపోయిన వారిలో అధికార పార్టీ నేత టి.కరుణాకర్ ఉన్నారు. 1300 క్వింటాళ్ల బియ్యానికి సంబంధించిన ప్రత్యేక ప్రోత్సాహక పర్మిట్లు తనకు తెలియకుండానే రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు కె.మారుతి సంతకంతో బదిలీ అయ్యాయని అంటున్నారు. క్వింటాల్‌కు సగటున రూ.3 వేలు ఉండే పర్మిట్ల విలువ తక్కువే అయినా... పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలపై నియంత్రణ ఉండే కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డెరైక్టరుగా తనకే ఇలా జరగడంపై ఆయన అసహనంగా ఉన్నారు. కరుణాకర్ తనకు జరిగిన మోసంపై ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంపీ స్పందించి మారుతిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇద్దరినీ పిలిచి మంగళవారం మాట్లాడతానని పొన్నం ప్రభాకర్ చెప్పినట్లు తెలిసింది. మిగిలిని 12 మంది మిల్లర్లలాగే నష్టపరిహారం విషయంలో రాజీకుదిరే అవకాశం ఉందని రైస్‌మిల్లర్ల సంఘం వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా... మంత్రి శ్రీధర్‌బాబు సొంత శాఖలో ఇలా వరుసగా అక్రమాలు వెలుగుచూస్తుండడం, ఇవి మంత్రికి వ్యతిరేక వర్గమైన పొన్నం ప్రభాకర్ వద్దకు చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పభుత్వ సంస్థలు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియను కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అంటారు. 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజనులో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 426 రైస్‌మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వ ధాన్యం తీసుకున్న వారిలో 281 మంది మిల్లర్లు మాత్రమే వందశాతం బియ్యాన్ని అప్పగించారు. వీరికి 2.06 లక్షల టన్నుల బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకునే ప్రత్యేక ప్రోత్సాహక అర్హత పర్మిట్లను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు ఇప్పటివరకు 87 వేల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇచ్చారు. దీంట్లో 15 వేల టన్నుల బియ్యం పర్మిట్ల బదలాయింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి గడువులోగా అప్పగించిన రైస్‌మిల్లర్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక అర్హత పర్మిట్లను ఇస్తుంది. ఈ పర్మిట్లతో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యంతో వచ్చే బియ్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ బియ్యం లెక్కప్రకారం సకాలంలో అప్పగించి... తమ దగ్గర ఇతర బియ్యం లేని రైస్‌మిల్లర్లు ఈ ప్రత్యేక ప్రోత్సాహక అర్హత పర్మిట్లను ఇతర మిల్లర్లుకు బదిలీ చేసుకోవచ్చు. కరువు కారణంగా గత ఏడాది వరి విస్తీర్ణం తగ్గి బియ్యం ధరలు పెరగడంతో పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా అర్హులైన కొందరు రైస్‌మిల్లర్ల ప్రత్యేక ప్రోత్సాహక అర్హత పర్మిట్లను వారికి తెలియకుండానే ఇతరులకు బదిలీ అ య్యాయి. రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకున్నట్లు 12మంది మిల్లర్లు ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా చేస్తే అందరికీ చట్టపరంగా ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో వీరికి నష్టపరిహారంకింద రూ.13.50 లక్షలు ఇచ్చి పంచాయతీని ముగించుకున్నారు. ఈ విషయం సద్దుమణిగిందనుకున్న తరుణంలో మరో రైస్‌మిల్లరు అక్రమాలతో నష్టపోయానని బయటికి వచ్చారు. ఇలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారని వీరు త్వరలోనే బయటికి వస్తారని తెలుస్తోంది. అక్రమాలు అవాస్తవం.. బియ్యం ప్రోత్సాహక పర్మిట్ల బదిలీల్లో అక్రమాలు జరిగాయనడంలో వాస్తవం లేదు. రైస్ మిల్లర్లు వారి గుమాస్తాలను పంపిస్తేనే నేను సంతకాలు పెట్టా. నా ప్రతిష్ట దిగజార్చేందుకే ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికి 281 మంది మిల్లర్ల పర్మిట్లపై సంతకాలు చేశా. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. - కోలేటి మారుతి, జిల్లా అధ్యక్షుడు, రైస్‌మిల్లర్ల సంఘం ఎన్నికల వరకే.. రైస్‌మిల్లర్ల సంఘం వ్యవహారాల్లో నాకు సంబంధంలేదు. కేవలం సంఘం ఎన్నికల వరకే జోక్యం చేసుకున్నా. నాకు ఏ పర్మిట్ల విషయం తెలియదు. కరుణాకర్ నాకు ఏ విషయం చెప్పలేదు. నేను ఎవరినీ పిలిచి మాట్లాడుతా అనలేదు. నా పేరు ఎందుకు వాడుకుంటున్నారో నాకు తెలియదు. - పొన్నం ప్రభాకర్, ఎంపీ -
అధ్యక్షుడి నిర్వాకం.. అందరికీ శిక్ష!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : బియ్యం అమ్మకం ప్రోత్సాహక అర్హత పర్మిట్ల అక్రమ బదిలీల ప్రక్రియ రైస్ మిల్లింగ్ పరిశ్రమకే పెద్ద దెబ్బగా మారింది. కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని సర్కారుకు సకాలంలో అప్పగించిన వారికి ఇచ్చే పర్మిట్లను అసలు వ్యక్తులకు తెలియకుండా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు కోలేటి మారుతి ఇతరులకు బదిలీ చేయడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ వ్యవహారం బయటపడినప్పటి నుంచి బియ్యం అమ్మకం అర్హత పర్మిట్ల బదిలీలు పూర్తిగా ఆగిపోయాయి. ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకునే వరకు కొత్తగా పర్మిట్లు జారీ చేయవద్దని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మారుతి చేసిన నిర్వాకంతో ఇప్పుడు అర్హులైన వారికి కూడా కొత్తగా బదిలీ అర్హత పర్మిట్లు జారీ కావడంలేదు. కస్టమ్ మిల్లింగ్ సకాలంలో పూర్తి చేసినా తమకు ఇదేమి శిక్ష అని పలువురు మిల్లర్లు వాపోతున్నారు. 2012-13 ఖరీఫ్ మార్కెట్ సీజన్ ముగిసే సెప్టెంబరులోపే పర్మిట్లను బదిలీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. గడువులోపు పర్మిట్లను వినియోగించుకోకుంటే అంతేసంగతులు. అన్ని సక్రమంగా చేసినా వచ్చే ఆదాయం పోగొట్టుకోవాల్సి వస్తుంది. గడువు ముగిసే తరుణంలో ఎక్కువ మంది మిల్లర్లు ప్రభుత్వ బియ్యాన్ని(సీఎంఆర్) అప్పగిస్తున్నారు. ఇప్పుడే పర్మిట్ల బదిలీ ఆపేయడంతో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిపై భగ్గుమంటున్నారు. సాధారణ ఎన్నికలను తలపించే పోరులో ఓట్లు వేసి గెలిపిస్తే తమకు చేసే మేలు ఇదేనా అని వాపోతున్నారు. అధ్యక్షుడు చేసిన నిర్వాకానికి బదిలీ అర్హత పర్మిట్లే కాదు.. మిగిలిన విషయాల్లోనూ అధికారులు తమను పట్టించుకోవడంలేదని అంటున్నారు. పర్మిట్ల బదిలీ అక్రమాలతో నష్టపోయిన రైస్ మిల్లర్లతో బయట సెటిల్మెంట్ చేసుకున్నా... పరిశ్రమలోని అందరికి ఈ వ్యవహారం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. సంఘం అధ్యక్షుడి చర్యలు, రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరులో పరిశ్రమ దెబ్బతింటోదని వాపోతున్నారు. 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని 426 మంది మిల్లర్లకు ఈ ధాన్యాన్ని ఇచ్చారు. వీరిలో 226 మంది మిల్లర్లు మాత్రమే వంద శాతం బియ్యం అప్పగించారు. వీరు అప్పగించిన 2.06 లక్షల టన్నుల బియ్యానికి సమాన పరిమాణంలో... వారి వద్ద ఉన్న సొంత బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఇప్పటివరకు 87 వేల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇచ్చారు. దీంట్లో 15 వేల టన్నుల బియ్యం పర్మిట్ల బదలాయింపులో అక్రమాలు జరిగినట్లు ఇటీవల బయటపడింది. బియ్యం ధరలు పెరగడంతో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడి ప్రమేయంతో ఇది జరిగిందని నష్టపోయిన మిల్లర్ల్లు వెల్లడించారు. అధికారులకు ఫిర్యాదులు చేస్తే కేసులతో మొత్తానికే మోసం జరుగుతుందని గ్రహించిన సంఘం అధ్యక్షుడు మారుతి... 12 మంది మిల్లర్లకు నష్టపరిహారం చెల్లించేలా సంఘం కార్యాలయంలోనే ఒప్పందం చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ వ్యవహారం అధికారులకు ఇబ్బందిగా మారింది. రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చేసిన తప్పులు తమకు ఇబ్బందిగా మారడంతో మొత్తం పర్మిట్ల జారీ, బదిలీ ప్రక్రియనే పక్కనబెట్టారు. ఎప్పుడు పునరుద్ధరించేది స్పష్టత రావడంలేదు. -
బేరం కుదిరింది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : బియ్యం అక్రమ పర్మిట్ల వ్యవహారానికి సెటిల్మెంట్ తో ముగింపు పలికింది. రైస్ మిల్లర్ల సంఘం జిల్లా కార్యాలయంలోనే ఈ బేరం కుదిరింది. వ్యాపారులకు కలిసి వచ్చే శుక్రవారం రోజునే ఈ సెటిల్మెంట్ పూర్తయ్యింది. పౌర సరఫరాల అధికారి సూచనతో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు కోలేటి మారుతి పూనుకుని ఈ తతంగం పూర్తి చేశా రు. మిల్లర్లకు తెలియకుండా వారి ప్రోత్సాహక పర్మిట్లను అమ్ముకోవడం తప్పేనని మిల్లర్ల సంఘం పెద్దలు ఒప్పుకున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేస్తే అక్రమాల బాగోతం అంతా బయటపడుతుందని, పరిహారం చెల్లిస్తామని 12 మంది మిల్లర్లను ఒప్పించారు. వీరందరికీ కలిపి రూ.13.50 లక్షలు ఇచ్చేలా సంఘం ముఖ్యులు పంచాయితీ తెంపారు. పర్మిట్లను తమకు తెలియకుండా అమ్ముకోవడం వల్ల కలిగిన నష్టం కంటే ఇది ఎక్కువ మొత్తం కావడంతో నష్టపోయిన మిల్లర్లు కూడా వెంటనే ఒప్పుకున్నట్లు తెలిసింది. సెటిల్మెంట్ మొత్తం తీసుకున్న తర్వాత, ఈ 12 మంది మిల్లర్లకు భవిష్యత్తులో అధికారుల నుంచి ఇబ్బంది కలగకుండా చూస్తామని మిల్లర్ల సంఘం గట్టి హామీ ఇచ్చినట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న మిల్లర్లు చెప్పారు. పర్మిట్ల అమ్మకంలో నష్టపోయిన మిగిలిన మిల్లర్లు వస్తే వారికి సైతం మంచిగానే సెటిల్ చేస్తామని, అనవసరంగా అధికారులకు ఫిర్యాదు చేస్తే అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పినట్లు తెలిపారు. ఇక నుంచి ఎలాంటి అక్రమాలు బయటికి రాకుండా చూసుకోవాలని, అంతర్గతంగానే మాట్లాడుకోవాలని సంఘం ముఖ్యులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అక్రమాలిలా.. 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఇప్పటివరకు 226 మంది మిల్లర్లు మాత్రమే వందశాతం బియ్యం అప్పగించడంతో వీరికి 2.06 లక్షల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రైస్ మిల్లర్ల సంఘం పెత్తనంతో అధికారులు ఇప్పటి వరకు 87 వేల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇచ్చారు. దీంట్లో 15 వేల టన్నుల బియ్యం పర్మిట్ల బదలాయింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి గడువులోగా అప్పగించిన రైస్ మిల్లర్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక పర్మిట్లు ఇస్తుంది. ఈ పర్మిట్లతో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యంతో వచ్చే బియ్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా సొంతంగా బియ్యం లేని వారు బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్ముకునే అర్హతను ఇతరులకు బదిలీ చేసుకోవచ్చు. గతేడాది వరి విస్తీర్ణం తగ్గి బియ్యం ధరలు పెరగడంతో పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా అర్హులైన కొందరు రైస్ మిల్లర్ల ప్రత్యేక ప్రోత్సాహక పర్మిట్లను వారికి తెలియకుండానే ఇతరులకు బదిలీ అయినట్లు నాలుగు రోజుల క్రితం బయటపడింది. జిల్లా పౌర సరఫరాల అధికారి ఆమోదంతో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకున్నట్లు 12 మంది మిల్లర్లు ఆరోపించారు. వీరందరికీ పరిహారం చెల్లించడంతో ఈ అక్రమాలు నిజమేనని ఇప్పుడు స్పష్టమవుతోంది. పర్మిట్ల బదిలీతో నష్టపోయివారు గురువారమే ఫిర్యాదు చేసేందుకు కరీంనగర్‌కు రావాలని అనుకున్నారు. మిల్లర్ల సంఘం ముఖ్యుల ‘మధ్యవర్తిత్వం’తో ఆగిపోయారు. 12 మంది కలిసి శుక్రవారం కరీంనగర్‌కు వచ్చారు. అధికారులకు ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతోనే బయలుదేరినా... ఇలా చేస్తే భవిష్యత్తులో వ్యాపారం విషయంలో అధికారుల నుంచి ఇబ్బందులు వస్తాయని మిల్లర్ల సంఘం నుంచి హెచ్చరికలు వెళ్లినట్లు తెలిసింది. ఫిర్యాదు చేయకుండా సెటిల్మెంట్ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని, అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూస్తామని చెప్పినట్లు సమాచారం. పర్మిట్ల అక్రమాలతో నష్టపోయిన వారిలో ఎక్కువ మంది కొత్తగా రైస్ మిల్లింగ్ వ్యాపారంలోకి వచ్చిన వారే కావడంతో... సెటిల్మెంట్కే మొగ్గుచూపినట్లు సమాచారం. -
రైస్‌మిల్లులో.. ఇంటి దొంగలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రైస్ మిల్లర్ల అనుమతి లేకుండా వారికి చెందిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం(సీఎంఆర్) పర్మిట్ల బదలాయింపు వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. 12 మంది మిల్లర్లకు సంబంధించిన సీఎంఆర్ పర్మిట్ల బదలాయింపు వారికి తెలియకుండానే పూర్తి కావడం సంచలనం రేపుతోంది. అధ్యక్షుడిపై నమ్మకంతో సంతకాలు చేసిన పర్మిట్లను అసోసియేషన్‌లో పెడితే... ఇలా చేయడం ఏమిటని కొందరు మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా బదిలీ అయిన పర్మిట్ల విలువ రూ.1.05 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. జిల్లా మిల్లర్ల సంఘం నేతృత్వంలో జిల్లా సరఫరాల అధికారి ఆమోదంతోనే ఇదంతా జరిగినట్లు సమాచారం. ఈ పర్మిట్లతో రూ.45 కోట్ల విలువ చేసే బియ్యాన్ని మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులే చెబుతున్నారు. 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఇందిరాక్రాంతి పథం, ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాల ద్వారా ధాన్యం సేకరించారు. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి (సీఎంఆర్) ఇవ్వడానికి జిల్లాలోని 426 మంది మిల్లర్లకు ఇచ్చారు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చే మిల్లర్లకు... వాళ్లు సొంతంగా కొనుగోలు చేసిన ధాన్యంతో వచ్చే బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు పర్మిట్లు ఇస్తారు. ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఎంత ఇస్తే... అంతే పరిమాణం మేరకు మార్కెట్లో అమ్ముకోవడానికి పర్మిట్ ఉంటుంది. పభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇచ్చిన కొందరు మిల్లర్ల వద్ద రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో వీరికి ఉన్న పర్మిట్లను జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్వో) ఆమోదంతో ఇతరులకు బదలాయిస్తారు. అంతకుముందు కస్టమ్ మిల్లింగ్ పూర్తి చేసిన మిల్లరు దరఖాస్తు చేస్తే పౌర సరఫరాల అధికారి ఆమోదంతో ఇతరులకు బదలాయింపు జరిగేది. ఏడాది క్రితం ఈ విధానంలో మార్పులు చేశారు. రైస్ మిల్లరుతోపాటు రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడి సంతకాలతో వచ్చిన దరఖాస్తులనే జిల్లా సరఫరా అధికారి పరిశీలించి బదిలీ చేస్తారు. ఈ నిబంధనే జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ పర్మిట్లలో అక్రమాలకు కారణమైంది. పర్మిట్ల బదలాయింపునకు అధ్యక్షుడి సంతకం తప్పనిసరి అనే ఉద్దేశంతో జిల్లా సంఘంలో సభ్యత్వం ఉన్న మిల్లర్లందరూ సంతకాలు చేసిన పత్రాలను సంఘం కార్యాలయంలోనే పెడుతున్నారు. నిబంధనలు మార్చినప్పటి నుంచి ఇలాగే చేస్తున్నారు. ఏడాదిగా బియ్యం ధరలు భారీగా పెరుగుతుండడంతో మిల్లర్ల సంఘం బాధ్యులు అసలు మిల్లర్లకు తెలియకుండానే పర్మిట్ల బదిలీల దరఖాస్తులను జిల్లా సరఫరా అధికారికి పంపించారు. మిల్లరు, జిల్లా అధ్యక్షుడి సంతకంతో వచ్చిన దరఖాస్తులను అధికారులు వెంటనే ఆమోదించారు. 12 మంది మిల్లర్లకు చెందిన 15 వేల టన్నుల బియ్యం పర్మిట్లు వారికి తెలియకుండానే బదలాయింపు అయ్యాయి. తమ కోటా పర్మిట్లను బదిలీ చేయాలని ఆ మిల్లర్లు నాలుగు రోజుల క్రితం అధికారులను సంప్రదించగా కోటా పూర్తయిందని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. తాము ఒప్పుకోకుండానే ఎలా తమ కోటా పూర్తయిందని ఆందోళన చెందారు. ఆరా తీస్తే అక్రమాల విషయం బయటపడింది. 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణ లక్ష్యంగా ఉంది. ఇంతే పరిమాణంలో బియ్యం విక్రయాలకు పర్మిట్లను మిల్లర్లకు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2.06 లక్షల టన్నుల పర్మిట్లకు అనుమతించింది. వీటిలో 84 వేల టన్నుల మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారి అనుమతి ఇచ్చారు. వీటిలోనే 15 వేల టన్నుల మేర అక్రమాలు జరిగినట్లు బయటపడింది. ఇక పర్మిట్ల ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తే ఈ అక్రమాలు ఎంత మేరకు ఉంటాయనేది అంతుపట్టకుండా ఉందని పలువురు మిల్లర్లు పేర్కొంటున్నారు. పొరపాట్లు నిజమే.. - కె.మారుతి, జిల్లా అధ్యక్షుడు, రైస్ మిల్లర్ల సంఘం మిల్లర్ల సంఘంలో సభ్యత్వం ఉన్న అందరు మిల్లర్ల పర్మిట్ బదిలీకి సంబంధించిన పత్రాలు వారు సంతకాలు చేసినవి సంఘం కార్యాలయంలో ఉంటాయి. పర్మిట్ల బదలాయింపు విషయంలో పొరపాట్లు జరిగాయని కొందరు మిల్లర్లు అంటున్నమాట నిజమే. అయితే వారు ఫోన్ ద్వారా చెప్పిన తర్వాతే పర్మిట్లను బదలాయించాలని సంఘం ద్వారా డీఎస్వోకు పంపిం చాం. వారు ఇప్పుడు మాట మారుస్తున్నారు. చర్యలు తీసుకుంటాం - చంద్రప్రకాశ్, జిల్లా సరఫరాల అధికారి రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మారుతి సంతకంతో వచ్చిన సీఎంఆర్ పర్మిట్లనే నేను బదిలీ చేశాను. 12 మంది మిల్లర్ల పర్మిట్ల బదలాయిం పులో పొరపాటు జరిగినట్లు నాకు మౌఖి కంగా తెలిసింది. దీనిపై ఎవరు ఫిర్యాదు చేయలేదు. నష్టపోయిన వారు ఫిర్యాదుచేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఇక ముందు ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. 12మంది మిల్లర్ల విషయం తెలియగానే సీఎం ఆర్ పర్మిట్ల బదలాయింపు నిలిపివేశాం. ఇక నుంచి పర్మిట్ బదలాయింపు దరఖాస్తులో ఉన్న రైస్ మిల్లర్‌తో ఫోన్లో మాట్లాడిన తర్వాతే బదిలీ చేస్తాం.