కామారెడ్డి జిల్లా సరంపల్లి రోడ్డుపై ధాన్యం ట్రాక్టర్లతో ఆందోళన చేస్తున్న రైతులు
కామారెడ్డి రూరల్: రైస్‌మిల్లర్ల తీరుతో రైతన్నకు కోపం వచ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని సరంపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం ధాన్యం ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయా యి. సరంపల్లి గ్రామం రైతుల వద్ద నుంచి రెండ్రోజుల క్రితం వచి్చన 200 బస్తాల ధాన్యాన్ని చిన్నమల్లారెడ్డిలోని ఓ రైస్‌మిల్ యాజమాన్యం గురువారం వెనక్కి పంపించింది. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగా రు.
కొనుగోలు కేంద్రంలో నిబంధనల ప్రకా రం రైతులు ధాన్యం విక్రయించారు. ఆ కేంద్రం నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపించగా మిల్లర్.. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. కేం ద్రం నిర్వాహకులు చూసినప్పుడు తేమ శాతం నిబంధనలకు లోబడే ఉందని, వర్షం రావడం.. వాతావరణంలో మార్పు కారణంగా తేమ శాతం పెరిగి ఉండొచ్చని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే రైస్ మిల్లర్ల ఆగడాలు మితిమీరి పోతున్నా యని రైతులు ఆరోపించారు.
వాతావరణంలో మార్పుల వల్ల ధాన్యంలో తేమ శాతం పెరిగితే తప్పు తమదా? అని రైతులు ప్రశ్నించారు. దేవునిపల్లి ఎస్‌ఐ రవికుమార్, రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ తదితరులు రైతులను సముదా యించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment