పంట పొలాల్లో సంక్రాంతి వేడుక | Kamareddy District Farmers Planted Dhanya Lakshmi In Crop Fields | Sakshi
Sakshi News home page

పంట పొలాల్లో సంక్రాంతి వేడుక

Published Sat, Jan 15 2022 1:06 AM | Last Updated on Sat, Jan 15 2022 4:01 PM

Kamareddy District Farmers Planted Dhanya Lakshmi In Crop Fields - Sakshi

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మిషన్‌ కల్లాలిలో ధాన్యలక్ష్మికి పూజలు చేస్తున్న రైతు కుటుంబం 

బిచ్కుంద (జుక్కల్‌): సంక్రాంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలోని 4 మండలాల్లోని రైతులు శుక్రవారం పంట చేలలో ధాన్యలక్ష్మిని ప్రతిష్టించి మొక్కులు తీర్చుకున్నారు. మహారాష్ట్రలో ఉన్న ఈ సంప్రదాయాన్ని ఆ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్‌గల్‌ మండలాల్లో రైతులు పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం సంక్రాంతి రోజున రైతులు ఉదయాన్నే కుటుంబ సమేతంగా ఎడ్లబండి, వాహనాల్లో పంట చేలకు వెళ్తారు.


దేవత ముందు వెలిగించిన దీపాన్ని ఇంటికి తీసుకెళ్తున్న మహిళలు 

పంటచేలలో లక్ష్మీ దేవతను ప్రతిష్టించి పూజిస్తారు. వ్యవసాయరంగంతో ముడిపడి ఉన్న పశువులనూ కొలుస్తారు. 5 రకాల కూరగాయలతో వంటలు, భక్షాలు చేసి నైవేద్యంగా పెట్టి దీపం వెలిగిస్తారు. బంధుమిత్రులతో పంట చేలలో వనభోజనాలు చేస్తారు. దేవత ముందు వెలిగించిన దీపం ఆరిపోకుండా సాయంత్రం గంపలో పెట్టి ఇంటికి తీసుకొచ్చి ఆ దీపంతో ఇంట్లో దీపాలు వెలిగించి పాడిపంటలు పుష్కలంగా పండాలని వేడుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement