జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలకు ఆదివారం నామినేషన్ల పర్వం మొదలైంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితోపాటు కోశాధికారి పదవులకు జరిగే ఎన్నికలకు...
హన్మకొండ చౌరస్తా : జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలకు ఆదివారం నామినేషన్ల పర్వం మొదలైంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితోపాటు కోశాధికారి పదవులకు జరిగే ఎన్నికలకు నామినేషన్లు దాఖ లు చేయడానికి ఎన్నికల అధికారి రెండు రో జులపాటు వెసులుబాటు కల్పించారు.
మొదటి రోజు అధ్యక్ష పదవికి ఆరుగురు, ప్రధాన కార్యదర్శి కోసం ఆరుగురు, కోశాధికారి పదవి కోసం రెండు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి టి.చంద్రప్రకాష్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్ర 4 గంటల వరకు కొనసాగిన నామినేషన్ల ఘట్టం రాజ కీయ ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. నామినేషన్లకు అవకాశం ఉండడంతో మరి కొందరు వేసేందుకు అవకాశం కనిపిస్తోంది.
ఆరుగురిలో ముగ్గురు మాజీలే...
ప్రస్తుతం అధ్యక్ష పదవికి ఆరుగురు నామినేషన్లు వేయగా.. అందులో ముగ్గురు మాజీ అధ్యక్షులే కావడం గమనార్హం. ప్రస్తుతం దేవునూరి అంజయ్య జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, తోట సంపత్‌కుమార్, మేచినేని సంపత్‌కుమార్ గతంలో జిల్లా అధ్యక్షులుగా కొనసాగారు. కాగా, రాష్ట్ర కార్యవర్గంలో పెద్ది వెంకటనారాయణగౌడ్ కీలక పదవిలో కొనసాగారు.
పి.పాండురంగయ్య, గోనెల రవీం దర్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు దాఖ లు చేశారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం నామినేషన్లు వేసిన వారిలో ఎర్రబెల్లి వెంకటేశ్వర్‌రావు, వి.వెంకటేశ్వర్లు, గండి రమేష్, వి.వేణుగోపాల్, బూశి ప్రభాకర్‌రెడ్డి, పాండురంగయ్య ఉండగా, కోశాధికారి కోసం దుబ్బ రమేష్, వేణుగోపాల్ నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఉపసంహరణకు 30న చివరి తేదీ కావడంతో అదేరోజు అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు.