మంత్రి అండతో అక్రమాలు.. మిల్లర్లపై విజిలెన్స్‌ దాడులు | Vigilance Rides On Rice Millers In Vijayawada | Sakshi

మంత్రి అండతో అక్రమాలు.. మిల్లర్లపై విజిలెన్స్‌ దాడులు

May 13 2019 12:44 PM | Updated on May 13 2019 12:55 PM

Vigilance Rides On Rice Millers In Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ: జిల్లా వ్యాప్తంగా పలు రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలపై విజిలెన్స్ దాడులు చేపట్టాయి. ధాన్యం కొనుగోళ్ళలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీ అండతో రైస్ మిల్లర్లు ఓ మాఫియాగా మారారు. దళారీల నుంచి భారీగా ధాన్యం కొనుగోళ్ళు  చేస్తున్నారు. కానీ, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం సేకరించినట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఎమ్మెల్యే అండతో రైస్ మిల్లర్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. 

హనుమాన్ జంక్షన్ లోని రెండు మిల్లుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ధాన్యాన్ని పట్టుకున్నారు. రెవెన్యూ సిబ్బందితో స్థానిక రైతులు పండించిన ధాన్యంగా తప్పుడు ధ్రువపత్రాలు  సృష్టించి మోసం చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు వీఆర్వోలపై వేటు వేశారు. సిపిల్ సప్లై అధికారులకూ ఈ అవినీతిలో వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రూ.కోట్లలో రైతుల పేరిట పక్కదారి పట్టినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement