![vigilence officials sudden attacks on medical shops - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/23/v.jpg.webp?itok=AdvFRfpf)
నక్కల రోడ్డులోని సాయి పూర్ణిమ మందుల షాపులో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు
విజయవాడ:నగరంలోని మెడికల్‌షాపులపై విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు జరిపారు. ఐదు బృందాలు ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో మందుల షాపులు, ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. నక్కల్‌రోడ్డు, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులోని 22 షాపులపై దాడులు నిర్వహించారు. దాదాపు అన్ని షాపుల్లో రిజిస్ట్రర్లు సక్రమంగా లేవని గుర్తించారు. 11 షాపుల్లో ఫార్మసిస్టులు లేకుండా మందుల క్రయవిక్రయాలు జరగుతున్నాయి. నక్కల్ రోడ్డులో రాజేంద్రమెడికల్స్, సాయిపూర్ణిమ మెడికల్స్, మక్కెన హాస్పటల్స్, గుణదల లక్ష్మీ మెడికల్ప్‌లో కాలం చెల్లిన మందులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో 22 షాపుల యజమానులకు డ్రగ్‌ఇన్‌స్పెక్టర్లు షోకాజ్ నోటీలు జారీ చేశారు. విజిలెన్స్ ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు ఆధ్వర్యంలో డీఎస్పీ విజయపాల్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఇతర అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment